Hindenburg On Block : హిండెన్‌బర్గ్ రీసెర్చ్ గురువారం మరో బాంబ్ పేల్చింది. ఇటీవల అదానీ కంపెనీ వ్యవహారాలను బట్టబయలుచేసిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ తాజాగా జాక్ డోర్సే పేమెంట్స్ సంస్థ 'బ్లాక్' షార్ట్ పొజిషన్‌లను కలిగి ఉందని వెల్లడించింది.  జాక్ డోర్సే నేతృత్వంలోని చెల్లింపుల సంస్థ తన వినియోగదారుల కౌంట్ ను ఎక్కువ చేసి చూపిందని తెలిపింది. దాంతో పాటు కస్టమర్ ఖర్చులను తక్కువ చేసిందని హిండెన్ బర్గ్ తన నివేదికలో ఆరోపించింది. "మా రెండు సంవత్సరాల పరిశోధనలో... బ్లాక్ డెమోగ్రాఫిక్స్ ను లబ్ది పొందిందని తేలింది" అని హిండెన్ బర్గ్  తన వెబ్‌సైట్‌లో రాసింది.  యూఎస్ కు చెందిన ఈ షార్ట్ సెల్లర్, అదానీ గ్రూప్‌లో 100 బిలియన్ల డాలర్లకు పైగా మార్కెట్ పతనానికి కారణమైంది.










యూఎస్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ గురువారం జాక్ డోర్సే చెల్లింపుల సంస్థ బ్లాక్ లో అవకతవకలు జరిగాయని నివేదిక బయటపెట్టింది. జాక్ డోర్సే బ్లాక్ ఛైర్మన్, ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు.   'బ్లాక్ తన వినియోగదారుల కౌంట్ ను రెట్టింపు చేసి చెప్పిందని, అలాగే కస్టమర్ ఆదాయ, ఖర్చులను తక్కువ చేసిందని మా పరిశోధనలో తేలింది' అని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తెలిపింది. హిండెన్‌బర్గ్ జాక్ డోర్సే సంస్థ మోసానికి పాల్పడిందని, వినియోగదారుల కొలమానాలను పెంచిందని తెలిపింది. దీంతో ఈ సంస్థ అంతర్గత వ్యక్తులు $1 బిలియన్లకు పైగా నగదును పొందేలా చేసిందని ఆరోపించింది. 


"మా సంస్థ రెండు సంవత్సరాల పరిశోధనలో బ్లాక్ క్రమపద్ధతిలో సాయం పొందేందుకు వినియోగదారుల కొలమానాలు పెంచిందిం" అని షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ తన వెబ్‌సైట్‌లో ప్రచురించిన నోట్‌లో తెలిపింది. ఈ నివేదిక తర్వాత యూఎస్ షేర్ మార్కెట్ ఉదయం 9:54 గంటలకు బ్లాక్ షేర్లు 20% క్షీణించి $58.35కి చేరుకున్నాయి. 44 బిలియన్ల డాలర్ల మార్కెట్ విలువ కలిగి ఉన్న బ్లాక్ సంస్థ, నకిలీ ఖాతాలతో తప్పుదోవ పట్టించిందని, లావాదేవీలలో మార్పులు చేసిందని నివేదికలో పేర్కొంది. అలాగే ఈ  క్యాష్ యాప్ ప్లాట్‌ఫారమ్‌లో ఎంత మంది ఉన్నారో కూడా స్పష్టంగా పేర్కొలేదని హిండెన్‌బర్గ్ ఆరోపించింది. ఇలా కంపెనీ షేరు ధర పెరిగేలా చేసి జాక్ డోర్సే, జేమ్స్ మెక్‌కెల్వే కలిసి 1 బిలియన్ డాలర్ల పైగా స్టాక్‌ను విక్రయించారని హిండర్‌బర్గ్ తెలిపింది. ఈ సంస్థ సీఎఫ్ఓ అమృతా అహుజా, క్యాష్ యాప్ లీడ్ మేనేజర్ బ్రియాన్ గ్రాసడోనియాతో సహా ఇతర ఎగ్జిక్యూటివ్‌లు కూడా మిలియన్ల డాలర్ల స్టాక్‌ కలిగిఉన్నట్లు నివేదిక పేర్కొంది.


బ్యాంక్ లో అకౌంట్ లేని కస్టమర్లకు సేవలందించడంలో బ్లాక్ క్యాష్ యాప్ వృద్ధి చేశారని పరిశోధనా సంస్థ తెలిపింది. క్యాష్ యాప్ ను మొబైల్ నుంచి డబ్బును త్వరగా స్వీకరించడానికి, ఇతర వ్యక్తులకు పంపడానికి అనుమతిస్తుంది. మొబైల్ బ్యాంకింగ్‌తో పాటు, క్యాష్ యాప్ తన ప్లాట్‌ఫారమ్ ద్వారా స్టాక్, బిట్‌కాయిన్‌లను కొనుగోలు చేసే అవకాశాన్ని కూడా అందిస్తుంది. బ్యాంక్ లో ఖాతాల్లేని కస్టమర్లు ఈ యాప్ ద్వారా నేరపూరిత లేదా అక్రమ కార్యకలాపాలు జరిగాయని నివేదికలో హిండెన్ బర్గ్ ఆరోపించింది. క్యాష్ యాప్ లో ప్రోగ్రామ్‌లు లోపభూయిష్టంగా ఉన్నాయని, అందుకు ఉదాహరణలు పుష్కలంగా ఉన్నాయని హిండెన్‌బర్గ్ ఆరోపించింది. ఈ యాప్ లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ పేరిట ఖాతాలు ఉన్నాయి. అవి నకిలీ ఖాతాలని వెల్లడించింది.