అదానీ గ్రూప్ వ్యాపారాలలో కొత్త రికార్డులు సృష్టించబోతోందని, ఇప్పటివరకూ  పెట్టుబడులలో ఉన్నఅన్ని రికార్డులను కొట్టబోతోందని అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ 2025 వార్షిక సాధారణ సమావేశంలో (Annual General Meeting) తెలిపారు. " రాబోయే ఐదు సంవత్సరాలలో మేము సంవత్సరానికి 15-20 బిలియన్ డాలర్ల  పెట్టుబడి  (షుమారు లక్షన్నర కోట్ల రూపాయలు) పెట్టాలని భావిస్తున్నాము. ఇవి కేవలం మా గ్రూప్‌లో పెట్టుబడులు మాత్రమే కాదు, భారతదేశ మౌలిక సదుపాయాల కల్పనలో అవకాశాల పరంపరను సృష్టించడం.. అని ఆయన అన్నారు.

గ్రూప్ స్థాయిలో,  అదానీ హోల్డింగ్స్  ఆదాయం 7 శాతం పెరిగింది, అయితే EBITDA 8.2 శాతం పెరిగింది.  నికర రుణ-to-EBITDA నిష్పత్తి 2.6x వద్ద ఆరోగ్యంగా ఉంది. మొత్తం ఆదాయం రూ. 2,71,664 కోట్లుగా ఉంది, సర్దుబాటు చేసిన EBITDA రూ. 89,806 కోట్లుగా ఉందని ఛైర్మన్ AGMలో తెలిపారు.

అదానీ గ్రూప్ ఆరోగ్య సంరక్షణ, విద్యా వ్యాప్తికి చేస్తున్న కృషి గురించి మాట్లాడుతూ, " సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం, నా 60వ పుట్టినరోజున, నా కుటుంబం భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ, విద్య మరియు నైపుణ్యాభివృద్ధిని పునర్నిర్వచించడానికి రూ. 60,000 కోట్లు వాగ్దానం చేసింది. అదానీ హెల్త్‌కేర్ టెంపుల్స్ మా మొదటి ప్రధాన అడుగు - ప్రపంచ స్థాయి, అందుబాటు ధరలో, వైద్య కళాశాలలు, పరిశోధనా కేంద్రాలు మరియు వెల్నెస్ స్పేస్‌లతో అహ్మదాబాద్ మరియు ముంబైలలో 1,000 పడకల క్యాంపస్‌లు అన్నీ కలిపి ఉన్నాయి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉన్న, AI- ఆధారిత, రోగి-మొదటి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను రూపొందించడానికి మాయో క్లినిక్ మాకు మార్గదర్శకంగా ఉంది." అని అన్నారు.

'మేము నమ్మకాన్ని కలిగిస్తున్నాము'

"మేము కాంక్రీటు వేయడం లేదు. మేము నమ్మకాన్ని కలిగిస్తున్నాము - ఆశయాలను మోసుకెళ్ళే రహదారులు, ఆశను రవాణా చేసే పోర్టులు,  భవిష్యత్తును వెలిగించే గ్రిడ్‌లు. చరిత్ర మనల్ని గుర్తుంచుకోవాల్సింది..- మన బ్యాలెన్స్ షీట్ పరిమాణంలో కాదు.. జాతి నిర్మాణం కోసం ఏం చేశాం అని గుర్తుంచుకోవాలి. . మనం ప్రవేశించిన మార్కెట్‌లు కాదు..  మనం ఎదుర్కొని మరింత బలపడిన సంక్షోభాలను గుర్తుచుంకోవాలి.  ఎందుకంటే అంతా బాగున్న వెలుతురులో  నడిపించడం సులభం, కానీ నిజమైన నాయకత్వం సంక్షోభంలో నుంచే పుడుతుంది.." అని ఆయన అన్నారు.

దేశవ్యాప్తంగా ఉన్న యువతకు సాధికారత కల్పించే లక్ష్యంతో ముంద్రాలో ప్రపంచ స్థాయి నైపుణ్య విశ్వవిద్యాలయం,  ఫినిషింగ్ స్కూల్‌ను ఏర్పాటు చేయడానికి గ్రూప్ రూ. 2,000 కోట్లు పెట్టుబడి పెడుతుందని అదానీ ప్రకటించారు. "ఎక్సలెన్స్ పాఠశాలలు, గ్లోబల్ సర్టిఫికేషన్‌లు మరియు ITEES సింగపూర్ మరియు IGCC వంటి సంస్థలతో భాగస్వామ్యం ద్వారా, మేము పరిశ్రమకు సిద్ధంగా ఉన్న శ్రామికశక్తిని సృష్టించడంపై దృష్టి సారించాము" అని ఛైర్మన్ పేర్కొన్నారు.

అదానీ రీసోర్స్ 30శాతం వృద్ధి రేటు నమోదు చేస్తోందని... 47 మిలియన్ టన్నుల కోల్, ఐరన్ ఓర్ ఉత్పత్తి చేశామని.. 410 టన్నుల కార్గో హ్యాండ్లింగ్‌తో అదానీ పోర్ట్స్ దేశంలో ఏ ప్రైవేట్ పోర్ట్ చేయలేనంత చేస్తోందని.. 100 బిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి ద్వారా అదానీ ఇంతవరకూ ఏ ప్రైవేట్ సెక్టార్ కంపెనీ సాధించని ఫీట్ సాధించిందన్నారు. అదానీ గ్రీన్ ,  అదానీ పవర్  ద‌్వారా 2030 నాటికి ఆ రంగాల్లో ప్రపంచంలో అతిపెద్ద కంపెనీగా అవతరిస్తామని చెప్పారు.  

ఇది కూడా చదవండి: అదానీ గ్రూప్ ముంబై ధారవి ప్రాజెక్ట్ జీవితాలను మారుస్తోంది, గౌతమ్ అదానీ