Zero Lompico Electric Motorcycle Design Patents: ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్ లో సరికొత్త సంచలనానికి తెర లేచింది. జీరో లంపియాకో ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ కు సంబంధించిన డిజైన్ పేటెంట్లు ఇంటర్నెట్ లో లీకయ్యాయి. అఫీషియల్ ఎంట్రీ కంటే ముందే ప్రొడక్షన్ మోడల్ ఎలా ఉండబోతోందో ఈ డ్రాయింగ్స్ క్లియర్ గా చూపిస్తున్నాయి. లీకైన సమాచారం ప్రకారం ఈ లంపియాకో బైక్ హీరో విడా వీఎక్స్ జెడ్ (Hero Vida VxZ) తో మెకానికల్ కాంపోనెంట్స్ ను పంచుకోనుంది. విడా ఎక్స్ జీరో పార్ట్‌నర్‌షిప్ లో డెవలప్ అవుతున్న ఈ రెండు మోటార్ సైకిళ్ల మధ్య ఉన్న స్ట్రాంగ్ బాండింగ్ ను ఈ అప్‌డేట్ కన్ఫర్మ్ చేస్తోంది. గ్లోబల్ ఈవీ మార్కెట్ లో ఇదొక బిగ్గెస్ట్ స్టెప్ కానుంది.

Read Also: Car Modifications News: కార్ మోడిఫికేషన్స్ పై ట్రాఫిక్ పోలీసుల నిఘా: రూల్స్ బ్రేక్ చేసే ఆ ఐదు మార్పులు ఇవే.. వాహనదారులు అలర్ట్ అవ్వాలంటూ హెచ్చరిక

ఒకే రకమైన ట్రెల్లిస్ ఫ్రేమ్.. 

జీరో లంపియాకో, హీరో విడా వీఎక్స్ జెడ్ మోడల్స్ ఒకే ట్రెల్లిస్ ఫ్రేమ్ పై బిల్డ్ అయ్యాయి. రెండు బైకుల్లో ఒకే రకమైన వీల్స్, బ్రేకింగ్ సిస్టమ్, ఫ్రంట్ యూఎస్‌డీ టెలిస్కోపిక్ ఫోర్క్స్, రియర్ మోనో షాక్ సస్పెన్షన్ ఉన్నాయి. వీటితో పాటు టీఎఫ్‌టీ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, స్ట్రీట్ స్టైల్ హ్యాండిల్ బార్స్, స్వింగ్‌ ఆర్మ్ పై అమర్చిన నంబర్ ప్లేట్ హోల్డర్ కామన్ గా కనిపిస్తాయి. జీరో మోటార్ సైకిల్స్ ఈ లంపియాకో పవర్‌ట్రెయిన్ డిటెయిల్స్ ను కన్ఫర్మ్ చేసింది. ఇందులో 8.8 కిలోవాట్ అవర్ (kWh) బ్యాటరీ ప్యాక్ తో పాటు 40 బీహెచ్‌పీ పీక్ పవర్ ఇచ్చే మిడ్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ ను ఉపయోగించారు.

Read Also: India First Flex Fuel WagonR: మారుతి నుంచి ఇండియాలోనే మొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ లాంచ్: ఇథనాల్ తో నడిచే వ్యాగన్ ఆర్ వెర్షన్ రెడీ..

డిఫరెంట్ డిజైన్ అప్రోచ్.. 

మెకానికల్ గా ఇవి ట్విన్స్ అయినప్పటికీ డిజైన్ పరంగా చాలా తేడాలు ఉన్నాయి. విడా వీఎక్స్ జెడ్ మోడల్ స్పోర్టీ, కాంటెంపరరీ లుక్ లో ఉంటే జీరో లంపియాకో మాత్రం బోల్డ్ రెట్రో ఫ్యూచరిస్టిక్ థీమ్ తో వస్తోంది. ఇందులో వైడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్ (LED DRL), సెంట్రల్ హెడ్‌లైట్ యూనిట్, స్క్వేరిష్ టీఎఫ్‌టీ డిస్ప్లే ఇచ్చారు. ఫ్యూయల్ ట్యాంక్, సైడ్ ప్యానెల్స్ ఉండే ఏరియాను సింగిల్ పీస్ లాగా స్పెషల్ గా డిజైన్ చేశారు. విడా రెగ్యులర్ స్టైలింగ్ తో పోలిస్తే ఇది డిఫరెంట్ విజువల్ ఐడెంటిటీని కలిగి ఉంటుంది.

ఇండియాలోనే ప్రొడక్షన్.. 

ఈ లీకైన పేటెంట్లను బట్టి జీరో లంపియాకో బైక్ ను ఇండియాలోనే హీరో మోటోకార్ప్ మాన్యుఫ్యాక్చర్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడి నుంచి ఈ బైకులను అమెరికాకు ఎగుమతి చేస్తారు. ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో హీరో చేస్తున్న ఇన్వెస్ట్‌మెంట్లకు, జీరో మోటార్ సైకిల్స్ తో ఉన్న పార్ట్‌నర్‌షిప్ కు ఇది సరిగ్గా సరిపోతుంది. 2023 లో హీరో సంస్థ సుమారు 60 మిలియన్ యూఎస్ డాలర్ల పెట్టుబడితో ఈ రిలేషన్ స్టార్ట్ చేసింది. విడా బ్రాండ్ కేవలం స్కూటర్లకే పరిమితం కాకుండా ఎలక్ట్రిక్ బైక్ పోర్ట్‌ఫోలియోను పెంచడానికి ఈ మోడల్స్ హెల్ప్ అవుతాయి.