Zelio Gracy Price in India: భారత్‌లో పెరుగుతున్న పెట్రోలు ధరలు, పర్యావరణంపై పెరుగుతున్న అవగాహనతో చాలా మంది ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో సామాన్యులకు అందుబాటులో ఉండే ధరలో అత్యాధునిక ఫీచర్లతో జెలియో గ్రేసీ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లోకి వచ్చింది. తక్కువ ఖర్చుతో స్థానిక ప్రయాణాల కోసం ఆకర్షణీయంగా దీన్ని డిజైన్ చేశారు. 

Continues below advertisement

సిటీలో తిరిగేందుకు కరెక్ట్‌గా సరిపోయే బైక్ 

ప్రస్తుతం రద్దీ నగరాల్లో తక్కువ దూర ప్రయాణాలకు భారీ ఖర్చుతో కూడిన బైకులు అవసరం లేదు. జెలియో గ్రేసీ ప్రధానంగా విద్యార్థులు, గృహిణులు, ఆఫీస్‌లకు వెళ్లే వారిని ఉద్దేశించి రూపొందించారు. ఇది పర్యావరణ హితమైంది మాత్రమే కాకుండా, నిర్వహణ ఖర్చు కూడా తగ్గిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు ఉండటం వల్ల ఇది సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తుంది. 

Also Read: ఏడు గేర్లతో వచ్చే బైక్ నిర్వహణ ఖర్చు కిలోమీటర్‌కు 7 పైసలే ! అదిరిపోయే వాహనం ధర, మైలేజీ, ఫీచర్స్ గురించి తెలుసుకోండి!

నాలుగు వేరియంట్లలో జెలియో గ్రేసీ

జెలియో గ్రేసీ మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తోంది. వినియోగదారులు వారి అవసరాలకు, బడ్జెట్‌కు అనుగుణంగా లెడ్- యాసిడ్ లేదా లిథియం అయాన్ బ్యాటరీ ఆప్షన్‌లు ఎంచుకోవచ్చు. 

Continues below advertisement

గ్రేసీ లెడ్ యాసిడ్‌లో 60V 32AH మోడల్ బైక్ ఎక్స్‌షోరూమ్ ధర 59,999రూపాయలు ఇది పూర్తి ఛార్జింగ్‌కు 8 నుంచి 10 గంటల సమయం పడుతుంది. గ్రేసీ లెడ్ యాసిడ్ 72V 32AH మోడల్ ధర 62, 499 రూపాయలు ఇది కడా ఛార్జింగ్ కోసం 8-10 గంటలు సమయం పడుతుంది. 

Also Read: యెజ్డీ నుండి సరికొత్త బైక్ - రగ్డ్ లుక్ తో 2026 స్క్రాంబ్లర్ ఎంట్రీ.. సిటీ రోడ్లు, ఆఫ్-రోడింగ్ కు పక్కా ఆప్షన్!

గ్రేసీ లిథియం- అయాన్ 60V 32AH మోడల్ ధర 72, 999 రూపాయలు. లిథియం బ్యాటరీ కావడంతో ఇది కేవలం నాలుగు నుంచి ఐదు గంటల్లోనే పూర్తి ఛార్జ్ అవుతుంది. ఇందులో నే 72V 32AH మోడల్ ఉంది. ఇది హై ఎండ్ వేరియంట్‌. దీని ధర 76, 999 రూపాయలు. ఇది కూడా నాలుగు నుంచి ఐదు గంటల్లో ఫుల్ ఛార్జింగ్ అవుతుంది. 

హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ప్రైస్ 

హైదరాబాద్‌లో ఎక్స్ షోరూమ్‌ ప్రారంభ ధర 59, 999 రూపాయలు కాగా, వివిధ నగరాల్లో ఆన్‌రోడ్‌ ధరలు మారుతూ ఉంటాయి. హైదరాబాద్‌లో దీని ఆన్‌ రోడ్ ప్రైస్‌ 63, 438 రూపాయలుగా ఉంది. బెంగళూరులో కూడా దాదాపు ఇదే ప్రైస్ కలిగి ఉంది. 

జెలియో గ్రేసీ ఫీచర్స్ ఇవే 

జెలియో గ్రేసీ బైక్‌లో శక్తిమంతమైన BLFC హబ్‌ మోటార్‌ ఉపయోగించారు. ఇది ఎక్కువ సౌండ్ రాకుండా పని చేస్తుంది. దీని బ్యాటరీ సామర్ఖ్యం 1. 92Kwh. వేరియంట్‌ను బట్టి మారుతూ ఉంటుంది. ఈ స్కూటర్‌ గరిష్టంగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. ముందు భాగంలో డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో డ్రమ్‌ బ్రేక్ అమర్చారు. దీని వల్ల ప్రయాణంలో బైక్ కంట్రోల్‌లో ఉంటుంది. ఇందులో ట్యూబ్‌లెస్‌ టైర్లు, అలాయ్‌ వీల్స్ అమర్చారు. 

Also Read: క్లాసిక్ స్టైల్‌లో వెస్పా కొత్త వేరియంట్ - 125cc, 150cc ఇంజిన్లతో 'టెక్ 80th' ఎంట్రీ.. వింటేజ్ కలర్ తో కట్టిపడేస్తున్న లుక్!

చూడగానే ఆకట్టుకే జెలియో గ్రేసీ ఆకారం 

స్పీడో మీటర్, ఓడో మీటర్,టాకో మీటర్, క్లాక్ అన్ని డిజిటల్‌ రూపంలో కనిపిస్తాయి. తాళం అవసరం లేకుండానే స్కూటర్‌ను స్టార్ చేసే సౌకర్యం ఉంది. సులభంగా స్కూటర్ ప్రారంభించడానికి పుష్‌ బటన్ సదుపాయం ఉంది. ప్రయాణంలో మొబైల్‌ ఫోన్‌లను ఛార్జ్ చేసుకోవడానికి యూఎస్‌బీ పోర్ట్ కూడా అందుబాటులో ఉంది. హెడ్‌లైట్‌ టైల్‌లైట్‌, టర్న్ సిగ్నల్ ల్యాంప్స్‌్ అన్నీ ఎల్‌ఈడీ రకానికి చెందినవి. ఇవి తక్కువ విద్యుత్‌ను తీసుకొని ఎక్కువ కాంతిని ఇస్తాయి. బ్యాటరీ ఛార్జింగ్ తగ్గినప్పుడు వినియోగదారుడికి హెచ్చరించే వ్యవస్థ కూడా ఉంది. 

గుంతల రోడ్డుపై సాఫీగా 

ఈ స్కూటర్‌ ఆకర్షణీయమైన డిజైన్‌తో వస్తుంది. ప్రస్తుతం ఇది వైట్‌ రంగులో లభిస్తుంది. ప్రయాణికుల సౌకర్యం కోసం సింగిల్ సీట్, వెనుక కూర్చునే వారికి బ్యాక్‌రెస్ట్‌, ఫుట్‌రెస్ట్ ఉన్నాయి. అదనంగా సామాన్యులు పెట్టుకోవడానికి సీటు కింద స్టోరేజ్ ఉన్నాయి. దీని సస్పెన్షన్ విషయానికి వస్తే ముందు టెలిస్కోపిక్ హైడ్రాలిక్, వెనుక స్ప్రింగ్ లోడెడ్‌ సస్పెన్షన్‌ అమర్చారు. ఇది గుంతల రోడ్డుపై కూడా సాఫీగా వెళ్లేలా చేస్తుంది. 

Also Read: కేటీఎమ్ Duke రెండు వేరియంట్ల మ‌ధ్య తేడా.. ఆ మోడ‌ల్ కొంటే భారీ లాభం.. ధ‌ర‌, ఫీచ‌ర్ల వివ‌రాలు..

ఎవరెవరితో పోటీ అంటే...

జెలియో గ్రేసీ మార్కెట్‌లో పలు ఇతర బడ్జెట్‌ ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోటీ పడుతోంది. దీనికి మొదటి పోటీ ఓలా ఎస్‌1Zతో ఉంది. ఆ బైక్ కూడా దాదాపు అరవై వేలుకే వస్తుంది. కానీ వేగం 70 కిలోమీటర్లు ఉంటే రేంజ్ 146 కిలోమీటర్లు ఉంది. ఈ విషయంలో జెలియో గ్రేసీ కంటే ఎక్కువగా ఉంది. 

జెలియో గ్రేసీకి పోటీ వచ్చే రెండో బైక్‌ కైనెటిక్‌ గ్రీన్ ఈ లూనా ఇది 70 వేలకు లభిస్తుంది. ఇది 50కిలోమీటర్ల వేగాన్ని కలిగి ఉంటుంది. హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్‌ కూడా ఆరవై వేలలోనే వస్తుంది. ఇది కూడా జెలియో గ్రేసీతో సమానమైన ఫీచర్స్ కలిగి ఉంది. 

వీటితో పోలిస్తే జెలియో గ్రేసీ తనదైన శైలిలో తక్కువ వేగంతో సురక్షితమైన ప్రయాణాన్ని కోరుకునే వారికి, కొత్తగా బైక్ నేర్చుకునే వారికి సౌకర్యవంతమైన బైక్. లైసెన్స్, రిజిస్ట్రేషన్ కూడా త్వరగా అవుతుంది. 

1845 ఈఎంఐతో...

జెలియో గ్రేసీ కొనుగోలు చేయాలనుకునే వారు మొత్తాన్ని ఒకేసారి చెల్లించకుండా కొంత మొత్తాన్ని డౌన్‌ పేమెంట్ చెల్లించి మిగతా మొత్తాన్ని ఈఎంఐ రూపంలో చెల్లించుకోవచ్చు. ఈ బైక్ కొనుగోలు చేయాలంటే 1845 రూపాయలతో ఈఎంఐ ప్రారంభమవుతుంది. బ్యాంకులు సాధారణంగా వాహనాలపై 90 శాతం వరకు ఫైనాన్స్‌ అందిస్తాయి. జెలియో గ్రేసీ మంచి బడ్జెట్‌లో వచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్. అరవై వేల ప్రారంభ ధర, ఆధునిక డిజైన్, ఫీచర్లు ఆకట్టుకోనున్నాయి.