Range Rover Ranthambore On Bank Loan And EMI: భారతీయ మార్కెట్‌లో, ల్యాండ్ రోవర్‌ బ్రాండ్‌ కింద లాంచ్‌ అయిన రేంజ్ రోవర్ కార్లు కుర్రకారుకు ఫేవరెట్‌ వెహికల్స్‌. ఈ కారును యూత్‌తో పాటు సెలబ్రిటీలు కూడా ఇష్టపడుతున్నారు, కొంటున్నారు. ఈ కారుకు ఇంత పాపులారిటీ రావడానికి కారణం చూడగానే ఆకర్షించే రఫ్‌ అండ్‌ టఫ్‌ డిజైన్ & ఫీచర్లు.

ల్యాండ్ రోవర్, రేంజ్ రోవర్‌ మోడల్‌కు ఎక్స్‌టెన్షన్‌గా ప్రత్యేకంగా లాంచ్‌ చేసిన 'రణ్‌థంబోర్‌ ఎడిషన్' కూడా మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందింది. రణ్‌థంబోర్‌ నేషనల్‌ పార్క్‌లో స్వేచ్ఛగా తిరిగే పులులను స్ఫూర్తిగా తీసుకుని ఈ ప్రీమియం ఎడిషన్‌ను పరిమిత సంఖ్యలో విడుదల చేశారు. భారతదేశం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రత్యేకమైన రేంజ్ రోవర్ SV బెస్పోక్ మోడల్ ఇది. కారవే & లైట్ పెర్లినో కాంబినేషన్‌లోని ఎక్స్‌టీరియర్‌ కలర్‌ రణ్‌థంబోర్ అడవిలోని సహజమైన రంగులను ప్రతిబింబిస్తాయి. పులి వెన్నుపై ఉండే నమూనాల ఆధారంగా కారు సీట్లను డెకరేట్‌ చేశారు. ఈ ఎడిషన్‌కు 23-అంగుళాల ఫోర్జ్‌డ్‌ స్టైల్‌ డార్క్‌ గ్రే కలర్‌ చక్రాలను Corinthian Bronze ఇన్సర్ట్స్‌తో అందించారు, ఇవి ఈ బండికి యునిక్‌ లుక్‌ను అందించాయి.

రేంజ్ రోవర్‌ రణ్‌థంబోర్‌ ఎడిషన్‌ ధరతెలుగు రాష్ట్రాల్లో, రేంజ్ రోవర్‌ రణ్‌థంబోర్‌ ఎడిషన్‌ ఎక్స్‌-షోరూమ్‌ ధర ‍‌(Range Rover Ranthambore Edition Ex-showroom price) 4 కోట్ల 98 లక్షల రూపాయలు. రిజిస్ట్రేషన్‌ (రూ. 90,14,000), ఇన్సూరెన్స్‌ (రూ. 18,97,709), ఇతర ఖర్చులు (రూ. 4,99,000) కలిపి ఆన్ రోడ్ ధర (Range Rover Ranthambore Edition On-road price) దాదాపు రూ. 6 కోట్ల 12 లక్షల రూపాయలు అవుతుంది. ఈ ప్రీమియం కార్‌ కోసం ఒకేసారి ఇంత డబ్బు ఖర్చు పెట్టలేనివాళ్లు బ్యాంక్‌ లోన్‌ కూడా తీసుకోవచ్చు.

బ్యాంక్‌ లోన్‌ & EMI ఎంత?రేంజ్ రోవర్ రణ్‌థంబోర్‌ ఎడిషన్ కొనడానికి మీ దగ్గర రూ. 62 లక్షలు ఉంటే చాలు, బ్యాంక్‌ మీకు రూ. 5.50 కోట్ల రుణం మంజూరు చేస్తుంది. రుణ మొత్తం మీ క్రెడిట్ స్కోర్‌, బ్యాంక్‌ విధానాలపై ఆధారపడి ఉంటుంది. మీ క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉంటే ఇంకా ఎక్కువ మొత్తంలో లోన్‌ లభిస్తుంది. ఈ రుణంపై బ్యాంకు వసూలు చేసే వడ్డీ ప్రకారం, ప్రతి నెలా ఒక స్థిర మొత్తాన్ని వాయిదా (EMI) రూపంలో బ్యాంకులో జమ చేయాలి.

రేంజ్ రోవర్ రణ్‌థంబోర్‌ ఎడిషన్ కొనడానికి, మీరు డౌన్ పేమెంట్‌గా రూ. 62 లక్షలు డిపాజిట్‌ చేశారనుకుందాం. బ్యాంక్‌ మీకు 9 శాతం వడ్డీ రేటుతో రూ. 5.50 కోట్ల రుణం మంజూరు చేసిందని భావిద్దాం. మీరు...

* 4 సంవత్సరాల ‍‌(48 నెలలు) టెన్యూర్‌తో ఈ లోన్‌ తీసుకుంటే, 9 శాతం వడ్డీ రేటు ప్రకారం, ప్రతి నెలా 13,68,677 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయాలి.

* 5 ఏళ్ల (60 నెలలు) కాలపరిమితితో రుణం తీసుకుంటే, 9 శాతం వడ్డీ రేటు ప్రకారం, నెలానెలా 11,41,710 రూపాయలు EMIగా బ్యాంకుకు చెల్లించాలి.

* 6 సంవత్సరాల (72 నెలలు) కోసం లోన్‌ తీసుకుంటే, 9 శాతం వడ్డీ రేటు ప్రకారం, నెలకు 9,91,405 రూపాయల EMI కడితే అప్పు తీరుతుంది.

* 7 సంవత్సరాల (84 నెలలు) టెన్యూర్‌తో లోన్‌ తీసుకుంటే, 9 శాతం వడ్డీ రేటు ప్రకారం, ప్రతి నెలా 8,84,899 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయాలి.

స్థానిక పన్నులు, ఇతర ఖర్చులను కలుపుకుని రేంజ్ రోవర్‌ రణ్‌థంబోర్‌ ఎడిషన్‌ ధరలో మార్పులు ఉండవచ్చు.