Yamaha XSR155 vs TVS Ronin: నియో రెట్రో స్టైల్ బైక్స్‌కు ప్రస్తుతం యువతలో మంచి క్రేజ్ ఉంది. ఈ సెగ్మెంట్‌లో Yamaha Motor India విడుదల చేసిన XSR155 & TVS Motor Company అందిస్తున్న Ronin మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా XSR155 ధర ఇటీవల పెరగడంతో, ఈ రెండు బైక్స్ మధ్య పోలిక ఇప్పుడు యూత్‌లో హాట్ టాపిక్ అయింది.
ఇంజిన్, పనితీరు
Yamaha XSR155
155సీసీ, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్
పవర్: 18.2hp @ 10,000rpm
టార్క్: 14.4Nm @ 7,500rpm
6-స్పీడ్ గేర్‌బాక్స్
TVS Ronin
225సీసీ, సింగిల్ సిలిండర్, ఆయిల్ కూల్డ్ ఇంజిన్
పవర్: 20.4hp @ 7,750rpm
టార్క్: 19.9Nm @ 3,750rpm
5-స్పీడ్ గేర్‌బాక్స్
Ronin ఎక్కువ పవర్, ముఖ్యంగా తక్కువ rpm వద్దే ఎక్కువ టార్క్ ఇస్తుంది. ఇది సిటీ రైడింగ్‌లో సౌకర్యంగా ఉంటుంది. XSR155లో అదనంగా ఒక గేర్ ఉండటం వల్ల హైవే రైడింగ్‌లో మెరుగైన టాప్ స్పీడ్ అందిస్తుంది. తక్కువ కర్బ్ వెయిట్ కారణంగా XSR155 పవర్-టు-వెయిట్ రేషియో కొంచెం మెరుగ్గా ఉంది.
బరువు, డైమెన్షన్‌లు
Ronin బరువు కొంచెం ఎక్కువ. అయితే సీట్ ఎత్తు తక్కువగా ఉండటం వల్ల కొత్త రైడర్లకు కంట్రోల్ చేయడం సులభం. XSR155లో ఇంధన ట్యాంక్ చిన్నదిగా ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే XSR155, MT-15 స్థాయిలోనే ఉంటుంది.
సస్పెన్షన్, బ్రేక్స్, టైర్లు
Roninలో 41mm మందపాటి ఫ్రంట్ ఫోర్క్ ఉంటుంది. టాప్ వేరియంట్లలో గోల్డ్ ఫినిష్ ఫోర్క్ ట్యూబ్స్ ఉంటాయి.
XSR155లో వెనుక భాగంలో రేడియల్ టైర్ ఉండటం ప్రత్యేకత. బ్రేక్ డిస్క్ సైజు చిన్నదైనా, తక్కువ బరువు కారణంగా సరిపడా స్టాపింగ్ పవర్ ఇస్తుంది.
ఫీచర్లు
రెండు బైక్స్‌లోనూ రౌండ్ LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఫోన్ కనెక్టివిటీ, యాప్ సపోర్ట్, పూర్తి LED లైటింగ్ అందుబాటులో ఉన్నాయి.
Ronin ప్రత్యేకత:
‘T’ ఆకారంలో DRL
డ్యూయల్ ఛానల్ ABS
Urban, Road అనే రెండు ABS మోడ్‌లు
XSR155లో కూడా డ్యూయల్ ఛానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉన్నాయి.
ధర పోలిక (ఎక్స్-షోరూమ్ ధర)
Yamaha XSR155: ₹1.50 లక్షల నుంచి ₹1.59 లక్షలు
TVS Ronin: ₹1.27 లక్షల నుంచి ₹1.60 లక్షలు
XSR155 ఒకే వేరియంట్‌లో అందుబాటులో ఉంది. బ్లూ కలర్‌కు ప్రారంభ ధర వర్తిస్తుండగా, ఇతర కలర్స్‌కు ధర ₹1.59 లక్షల వరకు పెరిగింది.
Ronin మాత్రం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. బేస్ వేరియంట్ తక్కువ ధరతో వస్తుంది. టాప్ వేరియంట్‌లో గోల్డ్ USD ఫోర్క్, షార్ట్ ఫ్లైస్క్రీన్ వంటి అదనపు ఫీచర్లు ఉంటాయి.
మీరు ఎక్కువ టార్క్, తక్కువ ధరతో సిటీ రైడింగ్ కోసం బైక్ చూస్తుంటే Ronin మంచి ఆప్షన్. కానీ తక్కువ బరువు, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్, హైవే పనితీరు కోరుకుంటే XSR155 మీకు నచ్చే అవకాశం ఉంది.
మొత్తంగా చూస్తే ధర పరంగా Ronin అందుబాటులో ఉండగా, ప్రీమియం ఫీల్ పరంగా XSR155 ప్రత్యేకంగా నిలుస్తోంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.