Yamaha XSR 155 Bike Updates India: యమహా XSR 155 యువతలో మంచి క్రేజ్‌ సృష్టించిన మోడల్‌. ఇప్పుడు ఈ బైక్‌ను ఇంకా స్టైలిష్‌గా మార్చుకునే అవకాశం వచ్చింది. యమహా అధికారికంగా Scrambler (స్క్రాంబ్లర్) & కేఫ్‌ రేసర్‌ (Café Racer) కిట్ల ధరలను ప్రకటించింది. XSR 155 ని పూర్తిగా కొత్త లుక్‌లోకి మార్చేలా ఈ రెండు కిట్లను హోండా కంపెనీ ప్రత్యేకంగా డిజైన్‌ చేసింది. ముఖ్యంగా యువత రైడింగ్‌ స్టైల్‌, లుక్‌, అటిట్యూడ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ యాక్సెసరీలను రెడీ చేసింది.

Continues below advertisement

స్క్రాంబ్లర్ కిట్‌ మొదట Scrambler కిట్‌ గురించి మాట్లాడుకుంటే... ఈ కిట్‌ మొత్తం ధర రూ. 24,850. దీనిలో ఉన్న ఫ్లై స్క్రీన్‌, బార్‌-ఎండ్‌ మిర్రర్లు బైక్‌కు రఫ్‌-అండ్‌-టఫ్‌ వైబ్‌ ఇస్తాయి. హెడ్‌లైట్‌ కవర్‌, రేడియేటర్‌ గార్డ్‌, ట్యాంక్‌ పాడ్స్‌, లైసెన్స్‌ ప్లేట్‌ హోల్డర్‌, సీటు కవర్‌ లాంటి భాగాలు ఈ కిట్‌లో ఉన్నాయి. మీకు అవసరమైతే మొత్తం కిట్‌ను లేదా కొన్ని భాగాలను ఒక్కొక్కటిగా కూడా కొనొచ్చు. అందులో బార్‌-ఎండ్‌ మిర్రర్లు రూ. 3,080 కు, ఫ్లై స్క్రీన్‌ రూ. 3,290 కు, నంబర్డ్‌ సైడ్‌ ప్లేట్లు రూ. 4,320 కి అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా ఈ కిట్‌ XSR 155 ని ఒక నిజమైన మినీ స్క్రాంబ్లర్‌గా మార్చేస్తుంది.

సీట్ కవర్ --- రూ. 480

Continues below advertisement

ట్యాంక్ ప్యాడ్‌లు --- రూ. 400

బార్-ఎండ్ మిర్రర్ --- రూ. 3,080

సర్దుబాటు చేయగల లివర్లు --- రూ. 2,720

ఫ్లై స్క్రీన్ --- రూ. 3,290

హెడ్‌లైట్ కవర్ --- రూ. 3,610

నంబర్డ్ సైడ్ ప్లేట్లు --- రూ. 4,320

రేడియేటర్ గార్డ్ --- రూ. 1,330

లైసెన్స్ ప్లేట్ హోల్డర్ --- రూ. 5,620

మొత్తం --- రూ. 24,850

కేఫ్‌ రేసర్‌ కిట్‌ఇక Café Racer కిట్‌ అయితే అసలు XSR 155 ని పూర్తిగా మార్చేసే ప్రత్యేక లుక్‌ ఇస్తుంది. ఈ కిట్‌ రేటు రూ. 28,180. ఇందులో ఉన్న స్టెప్డ్‌ సీట్‌, ప్రత్యేక హెడ్‌లైట్‌ కౌల్‌ బైక్‌కు క్లాసిక్‌ కేఫ్‌ రేసర్ స్టైల్‌ ఇస్తాయి. హెడ్‌లైట్‌ కౌల్‌ ధర రూ. 8,980 కాగా, స్టెప్డ్‌ సీట్‌ రూ. 6,640. దీనిని బైక్‌కు బిగించాక, ఈ బండి ఒక కొత్త రెట్రో-స్పోర్ట్స్‌ లుక్‌లో కనిపిస్తుంది. యమహా, ట్రాక్‌ స్ట్రీట్‌ కల్చర్‌ మిక్స్‌తో ఈ కిట్‌ను డెవలప్‌ చేసినట్టు తెలుస్తోంది.

స్టెప్డ్ సీట్ --- రూ. 6,640

సర్దుబాటు చేయగల లివర్లు --- రూ. 2,720

లైసెన్స్ ప్లేట్ హోల్డర్ --- రూ. 5,620

హెడ్‌లైట్ కౌల్ --- రూ. 8,980

సైడ్ ప్యానెళ్లు --- రూ. 2,890

రేడియేటర్ గార్డ్ --- రూ. 1,330

మొత్తం --- రూ. 28,180

కొన్ని విడిభాగాలు కామన్‌అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ రెండు కిట్లలో కొన్ని భాగాలు కామన్‌గా ఉన్నాయి. ముఖ్యంగా.. అడ్జస్ట్‌ చేసే లీవర్లు, రేడియేటర్‌ గార్డ్‌, లైసెన్స్‌ ప్లేట్‌ హోల్డర్‌ రెండు కిట్లలో కూడా ఉంటాయి. అంటే, రైడర్లు తమ స్టైల్‌ ప్రకారం మిక్స్‌-మ్యాచ్‌ చేసుకునే అవకాశం కూడా ఉంది.

XSR 155 ఎక్స్‌-షోరూమ్‌ ధర ప్రస్తుతం రూ. 1.50 లక్షలు. దీనికి Scrambler కిట్‌ (రూ. 24,850) వేసుకుంటే మొత్తం బైక్‌ ధర సుమారు రూ. 1.75 లక్ష అవుతుంది. Café Racer కిట్‌తో ‍‌(రూ. 28,180) అయితే బండి రేటు సుమారు రూ. 1.78 లక్ష వరకు వెళ్తుంది. యువతలో రెట్రో-స్పోర్ట్స్‌ బైక్‌లకు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో, యమహా తీసుకొచ్చిన ఈ కస్టమైజేషన్‌ ఆప్షన్లు మార్కెట్‌లో మంచి రెస్పాన్స్‌ తెచ్చే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఉన్న యువ రైడర్లకు XSR 155 కస్టమైజేషన్‌ కిట్లు ఇప్పుడు బిగ్‌-అట్రాక్షన్‌గా మారే అవకాశం ఉంది. ఎందుకంటే, ఇంతకు ముందు ఇలాంటి అఫీషియల్‌ పర్సనలైజేషన్‌ ఆప్షన్లు అరుదుగా లభించేవి. ఇప్పుడు, అన్ని చోట్లా, అదీ యమహా బిల్ట్‌ క్వాలిటీతో రావడం మరింత ప్రత్యేకంగా మారింది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.