Yamaha XSR 155 Launch - Know Price Features: యమహా అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న బైక్ ఎట్టకేలకు మార్కెట్‌లోకి వచ్చింది. Yamaha XSR 155 ఇప్పుడు అధికారికంగా భారత్‌లో లాంచ్ అయింది. ₹1.50 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో వచ్చిన ఈ బైక్... క్లాసిక్ లుక్‌తో పాటు యమహా స్పోర్టీ DNA ని కలిపి డిజైన్ చేసినట్లుగా ఉంటుంది.
పవర్‌ఫుల్ 155cc ఇంజిన్‌ఈ బైక్‌లో R15 V4, MT-15 V2లలో వాడిన అదే 155cc లిక్విడ్-కూల్డ్, 4-స్ట్రోక్, SOHC, సింగిల్-సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇందులో ఉన్న Variable Valve Actuation (VVA) టెక్నాలజీ వల్ల పెట్రోల్ వినియోగం తగ్గి పెర్ఫార్మెన్స్ మెరుగవుతుంది. ఈ ఇంజిన్ 18.1 bhp పవర్, 14.2 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్, అసిస్ట్ & స్లిప్పర్ క్లచ్ కూడా స్టాండర్డ్‌గా లభిస్తాయి.
డిజైన్‌లో రెట్రో + మోడరన్ మేళవింపురౌండ్ LED హెడ్‌ల్యాంప్స్, టీయర్ డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్, ఫ్లాట్ సింగిల్ సీటు - ఇవన్నీ కలిపి ఈ బైక్‌కి అద్భుతమైన రెట్రో లుక్ ఇస్తాయి. అయితే లుక్ రెట్రో అయినా ఫీచర్లు మాత్రం ప్యూర్‌గా మోడ్రన్. ఫుల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, LED లైటింగ్, ప్రీమియం ఫినిషింగ్‌తో XSR 155 స్మార్ట్‌గా కనిపిస్తుంది.
Yamaha XSR 155 వీల్ బేస్ 1,330 mm, సీట్ ఎత్తు 810 mm, గ్రౌండ్ క్లియరెన్స్ 170 mm, కెర్బ్ వెయిట్ 134 kg, ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్లు.
రైడింగ్ కంఫర్ట్ & సేఫ్టీరైడింగ్ పొజిషన్ అప్‌రైట్‌గా ఉండటంతో సిటీ, హైవే రెండింటిలోనూ రైడింగ్ కంఫర్ట్‌గా ఉంటుంది. ముందు అప్‌సైడ్ డౌన్ ఫోర్క్స్, వెనుక మోనోషాక్ సస్పెన్షన్ ఉంటాయి. బ్రేకింగ్ విషయంలో... 282mm ఫ్రంట్, 220mm రియర్ డిస్క్‌లు ఉన్నాయి. డ్యూయల్ ఛానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్ స్టాండర్డ్‌గా వస్తాయి.
నాలుగు కలర్ ఆప్షన్లుమెటాలిక్ గ్రే, వివిడ్ రెడ్, గ్రేయిష్ గ్రీన్ మెటాలిక్, మెటాలిక్ బ్లూ (Metallic Grey, Vivid Red, Greyish Green Metallic, Metallic Blue) వంటి నాలుగు రంగుల్లో ఈ బైక్ అందుబాటులో ఉంది. అదనంగా ‘Scrambler’ & ‘Cafe Racer’ పేర్లతో రెండు యాక్సెసరీ కిట్స్ కూడా లభిస్తున్నాయి. అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ ఈ బైక్‌కి ప్రీమియం టచ్ ఇస్తుంది.
మార్కెట్లో టార్గెట్‌యమహా XSR 155 ని Royal Enfield Hunter 350, TVS Ronin, Honda CB350RS వంటి రెట్రో స్టైల్ బైక్‌లతో పోల్చవచ్చు. అయితే... తక్కువ బరువు, తక్కువ ఇంజిన్ సైజ్‌తో ఉన్నప్పటికీ, ఈ బైక్ రైడింగ్ ఫన్, స్టైల్ రెండింటినీ కలిపి అందిస్తుంది.
యమహా XSR 155 యువతకు పర్ఫెక్ట్ ఆప్షన్. రోజువారీ ఆఫీస్/కాలేజ్ రైడ్‌కైనా, వీకెండ్ లాంగ్ రైడ్‌కైనా ఇది సరిపోతుంది. రెట్రో లుక్‌తో స్పోర్టీ పెర్ఫార్మెన్స్ కలిపిన ఈ బైక్ యమహా అభిమానుల్లో కొత్త ట్రెండ్ సెట్ చేసే అవకాశం ఉంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.