Yamaha R2 Price And Features Telugu: యమహా కంపెనీ, యువత ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న R2 బైక్‌ను ఆగస్టు 27న భారత మార్కెట్లో విడుదల చేసింది. కొత్త Supersport బైక్‌గా దీన్ని పరిచయం చేసింది. ఇప్పటికే పాపులర్‌ అయిన R15కి ఇది ప్రత్యామ్నాయం కాదు. R15 కంటే పై స్థాయిలో ఉండే మోడల్‌గా R2ను తీసుకొచ్చింది.

Continues below advertisement

Yamaha R2 మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ధరలు రూ.2.30 లక్షల నుంచి రూ.2.53 లక్షల వరకు ఉన్నాయి. ఇవన్నీ ఎక్స్‌-షోరూమ్‌ ధరలు.

Yamaha R2 మూడు వేరియంట్లలోనూ ఒకే ఇంజిన్‌ ఉంటుంది. 204cc లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్‌ 26.5hp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. 10,000rpm వద్ద ఈ పవర్‌ వస్తుంది. గరిష్ఠ టార్క్‌ 19.1Nm. ఇది 8,000rpm వద్ద లభిస్తుంది.

Continues below advertisement

అన్ని వేరియంట్లలోనూ 5 అంగుళాల TFT ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ ఉంటుంది. ట్రాక్షన్ కంట్రోల్, అసిస్ట్ & స్లిప్పర్ క్లచ్, మూడు రైడింగ్ మోడ్‌లు కూడా ఉన్నాయి. ముందు భాగంలో 37mm USD ఫోర్క్ ఉంటుంది. వెనుక లింకేజ్ మోనోషాక్ అమర్చారు. డ్యూయల్ ఛానల్ ABS కూడా అన్ని వేరియంట్లలోనూ స్టాండర్డ్‌గా లభిస్తుంది.

బేస్‌ వేరియంట్‌ ధర రూ.2.30 లక్షలు. ఇది Metallic Black & Dark Bluish Gray రంగుల్లో లభిస్తుంది. ఈ వేరియంట్‌లో బ్లాక్‌ వీల్స్‌ ఉంటాయి. Matte Finish Seat కూడా అందించారు.

ఇది కూడా చదవండి: Yamaha R15 కంటే పవర్‌ఫుల్‌.. 204cc ఇంజిన్‌, 26.5hp పవర్‌.. Yamaha R2 రేటెంతో తెలుసా?

R2 (Quickshifter)రేస్‌ ట్రాక్‌పై బైక్‌ను ఎక్కువగా ఉపయోగించాలనుకునే వారికి రెండో వేరియంట్‌ R2 (Quickshifter) మరింత ఆసక్తికరంగా ఉంటుంది. దీని ధర రూ.2.39 లక్షలు. బేస్‌ వేరియంట్‌ కంటే రూ.9,500 ఎక్కువ.

ఈ వేరియంట్‌లో బై డైరెక్షనల్‌ క్విక్‌షిఫ్టర్ ప్రధాన ఆకర్షణ. అంటే గేర్‌లను పైకి మార్చడంతో పాటు కిందికి మార్చేటప్పుడు కూడా క్విక్‌షిఫ్టర్ పనిచేస్తుంది. R15లో ఉన్న క్విక్‌షిఫ్టర్ కేవలం అప్‌ షిఫ్ట్‌లకు మాత్రమే పనిచేస్తుంది. R2లో మాత్రం అప్‌ & డౌన్‌ షిఫ్ట్‌లకు ఇది ఉపయోగపడుతుంది.

ఈ వేరియంట్‌లో బాడీ రంగులో ఉండే అల్లాయ్ వీల్స్ ఉంటాయి. ప్రత్యేక గ్రాఫిక్స్ కూడా ఇచ్చారు. Matte White Pearl & Racing Blue రంగుల్లో ఇది లభిస్తుంది.

MR2లో టాప్‌ వేరియంట్‌ M. దీని ధర రూ.2.53 లక్షలు. మధ్య వేరియంట్‌ కంటే రూ.14,000 ఎక్కువ. ఇందులో సస్పెన్షన్‌ను మరింతగా సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటుంది.

R2 Mలో ముందు Fork & వెనుక లింకేజ్ మోనోషాక్‌కు సర్దుబాటు చేయగల ప్రీలోడ్ సదుపాయం ఉంది. రైడర్‌ బరువుకు అనుగుణంగా సస్పెన్షన్‌ సెటప్‌ను మార్చుకోవచ్చు.

అదనంగా ప్రీమియం 3D ఎంబోస్డ్ ఎంబ్లమ్‌, ఫాక్స్ స్వెడ్ ఫినిష్ సీటు, సిల్వర్ ఫినిష్ స్వింగ్‌ఆర్మ్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. మఫ్లర్ ఎండ్ క్యాప్‌కు షాట్ బ్లాస్టెడ్ ఫినిష్ ఇచ్చారు.

M వేరియంట్‌లో అడ్జస్టబుల్‌ బ్రేక్ & క్లచ్ లివర్లు కూడా ఉన్నాయి. కీలెస్‌ సిస్టమ్‌ కూడా అందించారు. ఇది Metallic Grey అనే ఒకే రంగులో లభిస్తుంది.

ఇది కూడా చదవండి: యమహా R15 V4 బైక్ లోన్ ఆఫర్లు: ఎంత డౌన్‌పేమెంట్ కడితే నెలకు ఎంత EMI పడుతుంది? పూర్తి క్యాలిక్యులేషన్‌!

మూడు వేరియంట్లలోనూ ఇంజిన్‌ & ప్రధాన ఫీచర్లు దాదాపు ఒకేలా ఉన్నాయి. ధర పెరిగే కొద్దీ అదనపు సౌకర్యాలు, రేసింగ్‌కు ఉపయోగపడే ఫీచర్లు పెరుగుతాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.