Yamaha R2 Price And Features Telugu: దేశవ్యాప్తంగా యువత ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న మోడల్‌ వచ్చేసింది. యమహా YZF-R2 భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. R15కి అప్‌డేట్‌ వెర్షన్‌గా కాకుండా.. దాని కంటే పైస్థాయిలో ఉండే సూపర్‌స్పోర్ట్‌ బైక్‌గా R2ను కంపెనీ తీసుకొచ్చింది. దీంతోపాటు R15 కూడా మార్కెట్లో కొనసాగుతుంది. R15, R2, MT-15 & XSR 155 మోడళ్లను యమహా ఒకేసారి విక్రయిస్తుంది.

Continues below advertisement

R2 ధర ఎంత?

యమహా, YZF-R2ను మూడు వేరియంట్లలో విడుదల చేసింది. బేస్‌ వేరియంట్‌ ధర రూ.2.30 లక్షలు. మిడ్‌ వేరియంట్‌ ధర రూ.2.39 లక్షలు. టాప్‌ ఎండ్‌ R2 M వేరియంట్‌ ధర రూ.2.53 లక్షలు. ఇవన్నీ ఎక్స్‌-షోరూమ్‌ ధరలు. ఈ మూడు వేరియంట్ల మధ్య గరిష్ఠ ధర వ్యత్యాసం రూ.23,000 మాత్రమే. ఆగస్టు 12నే బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. అప్పట్లో రూ.10,000తో బుకింగ్‌ చేసుకునే అవకాశం కల్పించారు. డెలివరీలు సెప్టెంబర్‌ మధ్య నుంచి ప్రారంభం కానున్నాయి.

Continues below advertisement

204cc ఇంజిన్‌తో రచ్చ!

R2లో కొత్త 204cc సింగిల్‌ సిలిండర్‌ లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్‌ ఉంది. ఇది 10,000rpm వద్ద 26.5hp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. 8,000rpm వద్ద 19.1Nm టార్క్‌ను అందిస్తుంది. 

R15లో కూడా సింగిల్‌ సిలిండర్‌ లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్‌ ఉంటుంది. అయితే R2 ఇంజిన్‌లో DOHC సెటప్‌ ఉపయోగించారు. R15లో SOHC సెటప్‌ ఉంటుంది. R2లో VVA సాంకేతికత మాత్రం లేదు.

ఇంజిన్‌లోని వాల్వ్‌లకు DLC కోటింగ్‌ ఇచ్చారు. DLC అంటే డైమండ్‌ లైక్‌ కార్బన్‌. గతంలో యమహా ఫ్లాగ్‌షిప్‌ YZF-R1లో కూడా ఈ టెక్నాలజీని ఉపయోగించారు.

ఇది కూడా చదవండి: పాత కారు అమ్మి కొత్తది కొనాలా? లేక, పాత కారును కొత్త కారుతో ఎక్సేంజ్‌ చేయాలా? స్పిన్నీలో చాలా ఆప్షన్లు

R15 కంటే తేలిక!

R2లో ఇంజిన్‌తో పాటు ఫ్రేమ్‌ కూడా కొత్తదే. R15లో ఉన్న డెల్టాబాక్స్‌ ఫ్రేమ్‌ స్థానంలో 14 కిలోల బరువున్న డైమండ్‌ స్టీల్‌ ఫ్రేమ్‌ను ఇచ్చారు. దీని కారణంగా R2 బేస్‌ వేరియంట్‌ కెర్బ్‌ వెయిట్‌ కేవలం 149 కిలోలుగా మారింది. దీంతో ఈ విభాగంలోనే అత్యంత తేలికైన బైక్‌గా R2 నిలుస్తుందని యమహా చెబుతోంది.

మిడ్‌ & టాప్‌ వేరియంట్ల బరువు 150 కిలోలు. సీటు ఎత్తు 810mm. ఇది R15 కంటే 5mm తక్కువ.

పెర్ఫార్మెన్స్‌ విషయంలోనూ R2 ఆకట్టుకుంటుంది. KTM RC 200 &Hero Karizma XMR వంటి ప్రత్యర్థి బైక్‌లతో పోలిస్తే కొంచెం ఎక్కువ పవర్‌ అందిస్తుంది. టార్క్‌ కూడా ఇదే స్థాయిలో ఉంటుంది.

ఫీచర్లు కూడా అదిరిపోయేలా..

R2లో రైడ్‌-బై-వైర్‌ థ్రాటిల్‌ ఉంది. దీని ద్వారా మూడు రైడింగ్‌ మోడ్‌లను ఎంచుకోవచ్చు. అసిస్ట్‌ & స్లిప్పర్‌ క్లచ్‌, 37mm USD ఫోర్క్స్‌, డ్యూయల్‌ ఛానల్‌ ABS‌ స్టాండర్డ్‌గా ఉన్నాయి. 5 అంగుళాల TFT డిస్‌ప్లే & ట్రాక్షన్‌ కంట్రోల్‌ కూడా ఉన్నాయి. ఇవి ఇప్పటికే R15 Mలో కనిపించిన ఫీచర్లే.

ఇది కూడా చదవండి: డీజిల్ కంటే తక్కువ ఖర్చు, 1100km పైగా రేంజ్‌.. ఈ డీజిల్‌ కిల్లర్‌ చాలా స్పెషల్‌ గురూ!

మిడ్‌ వేరియంట్‌లో మరో ప్రత్యేక ఫీచర్‌ ఉంది. సెగ్మెంట్‌లో తొలిసారిగా బైడైరెక్షనల్‌ క్విక్‌షిఫ్టర్‌ను అందించారు. బాడీ కలర్‌ అలాయ్‌ వీల్స్‌ కూడా ఈ వేరియంట్‌లో ఉంటాయి.

టాప్‌ R2 M వేరియంట్‌లో మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. ప్రీలోడ్‌ అడ్జస్టబుల్‌ ఫ్రంట్‌ & రియర్‌ సస్పెన్షన్‌, అడ్జస్టబుల్‌ బ్రేక్‌ & క్లచ్‌ లీవర్లు, ఫాక్స్‌ స్వెడ్‌ సీట్‌ ఉన్నాయి. కీ లెస్‌ సిస్టమ్‌ను కూడా అందించారు.

మూడు వేరియంట్లకు ప్రత్యేక రంగులు ఉంటాయి.

ఎక్కడ కొనాలి?

యమహా YZF-R2ను సాధారణ డీలర్‌షిప్‌లలో కాకుండా కంపెనీకి చెందిన బ్లూ స్క్వేర్‌ నెట్‌వర్క్‌ ద్వారా మాత్రమే అమ్ముతారు. 

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.