Yamaha R2 Performance Test: యమహా, తన కొత్త R2 బైక్‌లో 204cc సింగిల్ సిలిండర్ DOHC ఇంజిన్‌ను అందించింది. ఈ ఇంజిన్ 10,000rpm వద్ద 26.5hp పవర్, 8,000rpm వద్ద 19.1Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్ జత చేశారు. ఈ బైక్ యాక్సిలరేషన్, రోల్ ఆన్ వేగం & బ్రేకింగ్ పనితీరును ఎక్స్‌పర్ట్‌లు పరీక్షించారు. యాక్సిలరేషన్‌ టెస్ట్‌లో.. ఈ బైక్‌ 9.01 సెకన్లలో 100kp స్పీడ్‌ అందుకుంది, R15 కంటే మెరుగ్గా నిలిచింది. ఈ పరీక్ష కోసం మిడ్ వేరియంట్‌ను ఎక్స్‌పర్ట్‌లు ఉపయోగించారు. 

Continues below advertisement

Yamaha R2 మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అన్ని వేరియంట్లలో TFT స్క్రీన్ & రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. మిడ్ వేరియంట్‌లో బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్ అదనంగా లభిస్తుంది. టాప్ M వేరియంట్‌లో అడ్జస్టబుల్ లివర్లు, ప్రీలోడ్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సస్పెన్షన్, కీ లెస్ స్టార్ట్, స్టీరింగ్ లాక్ & ప్రత్యేకమైన పెయింట్ స్కీమ్ ఉన్నాయి.

యాక్సిలరేషన్ టెస్ట్‌

Continues below advertisement

ఈ పరీక్ష నిర్వహించిన సమయంలో వాతావరణ పరిస్థితులు పొడిగా ఉన్నాయి. Yamaha R2 ప్రారంభ వేగంలో కొంత బలహీనంగా అనిపించినప్పటికీ, 3,500rpm దాటిన తర్వాత మిడ్ రేంజ్‌లో మంచి పనితీరు చూపించింది. 7,000rpm దాటిన తర్వాత పవర్ మరింత పెరిగి, ఇంజిన్ 11,000rpm రెడ్‌లైన్ వరకు వేగంగా స్పందించింది.

యాక్సిలరేషన్ టెస్ట్‌లో బైక్ సాధించిన సమయాలు ఇవి:

 0-40kph వేగం ------ 2.21 సెకన్లు  0-60kph  వేగం ------ 3.72 సెకన్లు  0-80kph  వేగం ------ 5.8 సెకన్లు  0-100kph  వేగం ------ 9.01 సెకన్లు 

బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్ ఉపయోగించిన పరీక్షలో R2, 0-100kph వేగాన్ని 9.01 సెకన్లలో చేరుకుంది. 2021లో పరీక్షించిన R15తో పోలిస్తే, R2 ఈ వేగాన్ని చేరుకోవడానికి 3 సెకన్లకు పైగా తక్కువ సమయం తీసుకుంది.

ఇది కూడా చదవండి: ఇండియన్ మార్కెట్లోకి 3 ఇటాల్‌జెట్‌ స్కూటర్లు.. బ్రెంబో బ్రేక్స్, ట్విన్ సిలిండర్ ఇంజిన్లతో రంగప్రవేశం!

రోల్ ఆన్ యాక్సిలరేషన్

రోల్ ఆన్ పరీక్షలోనూ Yamaha R2 మంచి పెర్ఫార్మెన్స్‌ ఇచ్చింది. అవసరమైనప్పుడు వేగంగా ఓవర్‌టేక్ చేయడానికి బైక్ స్పందన బాగుందని పరీక్షలో గుర్తించారు. తక్కువ వేగంలోనూ ఇంజిన్ సులభంగా పనిచేస్తుంది. 3వ గేర్‌లో 20kph వేగంతో ప్రయాణించినా ఎలాంటి ఇబ్బంది లేకుండా నడుస్తుంది. దీంతో రోజువారీ ప్రయాణాలకు కూడా ఇది అనువుగా ఉంటుంది.

రోల్ ఆన్ పరీక్షలో నమోదైన సమయాలు:

 20-50kph (2వ గేర్)  ------ 2.71 సెకన్లు  30-70kph (3వ గేర్)  ------ 4.85 సెకన్లు  50-80kph (4వ గేర్)  ------ 4.59 సెకన్లు 

బైక్ క్లచ్ ఆపరేషన్ తేలికగా ఉంది. బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్ కూడా బాగా పనిచేస్తుంది. తక్కువ వేగంలో నడపడం, అవసరమైనప్పుడు ఓవర్‌టేక్ చేయడం వంటి సందర్భాల్లో R2 మంచి సౌలభ్యాన్ని అందిస్తుంది.

బ్రేకింగ్ పనితీరు

Yamaha R2 బ్రేకింగ్ పనితీరు పర్వాలేదనిపించినప్పటికీ, ఫ్రంట్ బ్రేక్ లివర్ విషయంలో ఒక లోపం కనిపించింది. లివర్‌ను నొక్కిన వెంటనే బ్రేక్ బైట్ స్పష్టంగా అనిపించదు. లివర్‌ను సగానికి పైగా నొక్కిన తర్వాతే బ్రేక్ పట్టినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో వేగంగా బ్రేకులు వేయాల్సి వచ్చినప్పుడు దీనికి అలవాటు పడాల్సి ఉంటుంది.

60-0kph బ్రేకింగ్ పరీక్షలో బైక్ 17.67 మీటర్ల దూరంలో ఆగింది. మొత్తం మీద బ్రేకింగ్ ఫలితం పర్వాలేదనిపించినా, ఫ్రంట్ లివర్‌లో ప్రారంభ బ్రేక్ బైట్ మెరుగ్గా ఉండాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: Honda Bikes ADAS: బైకుల్లో కూడా అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు.. హోండా కొత్త Sensing Ride సిస్టమ్ ప్రత్యేకతలు ఇవే

Yamaha R2 స్పెసిఫికేషన్లు

 ఇంజిన్  204cc, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్  పవర్  26.5hp @ 10,000rpm  టార్క్  19.1Nm @ 8,000rpm  గేర్‌బాక్స్  6-స్పీడ్, బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్  ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం  12 లీటర్లు  కెర్బ్ బరువు  150kg  సీట్ ఎత్తు  810mm  ఫ్రంట్/రియర్ బ్రేకులు  282mm డిస్క్ / 220mm డిస్క్  ఫ్రంట్/రియర్ టైర్లు  100/80-17 / 140/70-17 

ధరలు

బేస్ వేరియంట్ ధర రూ.2.30 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్ ఉన్న వేరియంట్ ధర రూ.2.39 లక్షలు. టాప్ M వేరియంట్ ధర రూ.2.53 లక్షల వరకు ఉంది. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు.

మొత్తంగా చూస్తే... Yamaha R2 మిడ్ రేంజ్ పనితీరు, రోల్ ఆన్ యాక్సిలరేషన్ & క్విక్‌షిఫ్టర్ పనితీరుతో ఆకట్టుకుంది. 0-100kph వేగాన్ని 9.01 సెకన్లలోనే చేరుకోవడం కూడా ఈ బైక్ పవర్‌ను తెలియజేస్తుంది. అయితే ఫ్రంట్ బ్రేక్ లివర్ ప్రారంభ స్పందన మాత్రం మెరుగుపడాల్సిన అంశమని ఎక్స్‌పర్ట్‌లు అభిప్రాయపడ్డారు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.