Italjet Scooters In India: భారత టూ వీలర్ మార్కెట్లోకి మరో ఇటాలియన్ బ్రాండ్ అడుగుపెట్టబోతోంది. ఇటలీకి చెందిన ప్రముఖ టూ వీలర్ కంపెనీ ఇటాల్‌జెట్‌ (Italjet) తన పవర్‌ఫుల్ డ్రాగ్‌స్టర్ స్కూటర్లను మన దేశంలో లాంచ్‌ చేసేందుకు సిద్ధమైంది. డిసెంబర్‌లో మూడు కొత్త మోడళ్లను పరిచయం చేయనుంది. ఇందులో 300cc, 459cc, 698cc ఇంజిన్ సామర్థ్యాలతో కూడిన స్కూటర్లు ఉన్నాయి. ముఖ్యంగా 700cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో వచ్చే డ్రాగ్‌స్టర్ 700 ఈ లైనప్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

Continues below advertisement

ఇటీవల ఇటలీలోని మిలాన్‌లో జరిగిన EICMA 2026 ప్రదర్శనలో ఇటాల్‌జెట్‌ తన భారత మార్కెట్ ఉత్పత్తులను పరిచయం చేసింది. కొల్హాపూర్‌కు చెందిన మోటోహౌస్ ఇండియాతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ సంస్థ ఇప్పటికే బ్రిక్స్‌టన్‌ మోటార్‌సైకిల్స్ & VLF (వెలోసిఫెరో) బ్రాండ్లను కూడా భారత మార్కెట్లో విక్రయిస్తోంది. మూడు డ్రాగ్‌స్టర్ మోడళ్లను దశలవారీగా తీసుకురావాలని మోటోహౌస్ ప్రణాళిక రూపొందించింది.

డ్రాగ్‌స్టర్ 300: 278cc ఇంజిన్‌

Continues below advertisement

ఈ లైనప్‌లో ఎంట్రీ లెవల్ మోడల్ డ్రాగ్‌స్టర్ 300. ఇందులో 278cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 8,250rpm వద్ద 23.8hp పవర్, 6,250rpm వద్ద 26Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ముందు భాగంలో సింగిల్ ఆర్మ్, సర్దుబాటు చేసుకునే స్ప్రింగ్‌తో కూడిన హైడ్రోన్యూమాటిక్ షాక్ అబ్జార్బర్‌ను అందించారు. వెనుకవైపు లింక్ టైప్ మోనోషాక్ సస్పెన్షన్ ఉంది.

బ్రేకింగ్ కోసం ముందు 240 మి.మీ. డిస్క్, వెనుక 175 మి.మీ. డిస్క్‌ను అమర్చారు. వీటిని బ్రెంబో సంస్థ తయారు చేసింది. డ్యూయల్ ఛానల్ ABS కూడా స్టాండర్డ్‌గా లభిస్తుంది. ఈ స్కూటర్ సీటు ఎత్తు 770 మి.మీ. మాత్రమే ఉండటంతో ఎక్కువ మంది రైడర్లకు సౌకర్యంగా ఉంటుంది. ముందు 120/70 R12, వెనుక 140/60 R13 టైర్లను అందించారు.

ఇది కూడా చదవండి: పెట్రోల్ పవర్‌తో CNG మైలేజీ! Mahindra XUV 3XO CNGలో ఇన్ని ప్రత్యేకతలా? బుక్ చేసే ముందు ఈ విషయాలు తెలుసుకోండి!

డ్రాగ్‌స్టర్ 459: ట్విన్ సిలిండర్ పవర్

మిడ్‌ రేంజ్‌ మోడల్ డ్రాగ్‌స్టర్ 459లో 449cc లిక్విడ్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ ఉంది. ఇది 9,500rpm వద్ద 47.58hp పవర్, 8,000rpm వద్ద 41Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్ జత చేశారు.

ఈ స్కూటర్‌లో మార్జోక్కీ సంస్థకు చెందిన పూర్తిగా సర్దుబాటు చేసుకునే USD ఫ్రంట్ ఫోర్క్ & వెనుక మోనోషాక్ సస్పెన్షన్ ఉన్నాయి. 15-అంగుళాల వీల్స్‌తో వస్తుంది. ముందు 120 సెక్షన్, వెనుక 160 సెక్షన్ పిరెల్లీ టైర్లను అమర్చారు. బ్రేకింగ్ కోసం ముందు 270 మి.మీ. డ్యూయల్ డిస్కులు, వెనుక 260 మి.మీ. డిస్క్ ఉన్నాయి. డ్యూయల్ ఛానల్ ABSతో పాటు ట్రాక్షన్ కంట్రోల్ కూడా స్టాండర్డ్‌గా లభిస్తుంది. ఇందులో 16 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ప్రత్యేక ఆకర్షణ.

డ్రాగ్‌స్టర్ 700: లైనప్‌లో టాప్ మోడల్

ఈ మూడు స్కూటర్లలో అత్యంత శక్తిమంతమైనది డ్రాగ్‌స్టర్ 700. ఇందులో 698cc లిక్విడ్ కూల్డ్ ట్విన్ సిలిండర్ ఇంజిన్‌ను అందించారు. ఇది 70hp పవర్, 70Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్ జత చేశారు. బయటకు కనిపించే ట్యూబ్యులర్ స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్ ఈ స్కూటర్‌కు ప్రత్యేకమైన రూపాన్ని ఇస్తుంది.

సస్పెన్షన్ విషయంలో డ్రాగ్‌స్టర్ 459లో ఉన్న మార్జోక్కీ USD ఫ్రంట్ ఫోర్క్ & వెనుక మోనోషాక్‌నే ఇందులోనూ కొనసాగించారు. 15-అంగుళాల వీల్స్, పిరెల్లీ టైర్లు అందించారు. బ్రేకింగ్ కోసం ముందు 270 మి.మీ. డ్యూయల్ డిస్కులు, వెనుక 260 మి.మీ. డిస్క్ ఉన్నాయి. డ్యూయల్ ఛానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Volkswagen Virtus Facelift టీజర్ లాంచ్‌.. LED లైట్లు, బ్లాక్ అల్లాయ్ వీల్స్‌తో అదిరిపోయే డిజైన్!

మూడు స్కూటర్లలోనూ LED లైటింగ్, TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను స్టాండర్డ్‌గా అందిస్తున్నారు. అదనంగా హీటెడ్ గ్రిప్స్, యాంటీ థెఫ్ట్ సిస్టమ్ వంటి ఫీచర్లను ఆప్షనల్‌గా పొందవచ్చు. కంపెనీ 24 నెలల తయారీదారుల వారంటీని అందిస్తోంది. 

డిసెంబర్ 4న భారత్‌లో పరిచయం

ఇటాల్‌జెట్‌, డిసెంబర్ 4-5 తేదీల్లో జరగనున్న ఇండియా బైక్ వీక్ (IBW) 2026 ద్వారా భారత మార్కెట్‌లోకి అరంగేట్రం చేయనుంది. ఈ కార్యక్రమంలో డ్రాగ్‌స్టర్ 300, డ్రాగ్‌స్టర్ 459, డ్రాగ్‌స్టర్ 700 మోడళ్లను పరిచయం చేస్తుంది.

ఈ మూడు స్కూటర్లను మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఉన్న మోటోహౌస్ ఇండియా తయారీ కేంద్రంలో అసెంబుల్ చేయనున్నారు. 2027 రెండో త్రైమాసికం నుంచి డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. భారత మార్కెట్‌కు సంబంధించిన ధరలు, ప్రత్యేక స్పెసిఫికేషన్లు & ఇతర వివరాలను కంపెనీ తర్వాత వెల్లడించనుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.