Yamaha Aerox Electric Launched: జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ యమహా, భారత మార్కెట్లో తన తొలి ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ Aerox Electricను అధికారికంగా విడుదల చేసింది. గతంలో XSR155ను ప్రదర్శించిన సమయంలోనే Aerox-Eను కూడా కంపెనీ ఆవిష్కరించగా, ఇప్పుడు దానిని సేల్స్‌ కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.2.82 లక్షలు (ఎక్స్ షోరూమ్). ప్రస్తుతం భారత మార్కెట్లో యమహా విక్రయిస్తున్న ఉత్పత్తుల్లో ఇదే అత్యంత ఖరీదైన మోడల్‌గా నిలిచింది.

Continues below advertisement

Yamaha Aerox Electricలో రెండు 1.5kWh సామర్థ్యం కలిగిన రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్‌లను అందించారు. వీటికి జతగా 9.5kW గరిష్ట పవర్‌, 48 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేసే శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్‌ను కంపెనీ అమర్చింది. అధిక పనితీరు కోసం హై ఎనర్జీ సెల్స్‌ను ఉపయోగించినట్లు Yamaha వెల్లడించింది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే IDC ప్రమాణాల ప్రకారం 117 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ ప్రకటించింది. స్కూటర్ మొత్తం బరువు 139 కిలోలు. ఇది, పెట్రోల్ Aerox 155తో పోలిస్తే సుమారు 13 కిలోలు ఎక్కువ.

Continues below advertisement

ఇది కూడా చదవండి: హోండా యాక్టివా ఇ vs యాంపియర్‌ మాగ్నస్‌ గ్రాండ్‌! భారత్ ఈవీ మార్కెట్‌లో ఏది బెస్ట్?

రైడింగ్ అనుభవాన్ని మెరుగుపరచేందుకు Eco, Standard, Power అనే మూడు రైడింగ్ మోడ్‌లతో పాటు అదనంగా Boost మోడ్‌ కూడా అందించారు. అవసరమైన సమయంలో తక్షణ పవర్ అందించి వేగంగా ఓవర్‌టేక్ చేయడానికి ఈ బూస్ట్‌ మోడ్ ఉపయోగపడుతుంది.

భద్రత విషయంలో కూడా Yamaha ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ముందు చక్రానికి డిస్క్ బ్రేక్‌తో పాటు ABS వ్యవస్థను అందించగా, వెనుక చక్రానికి కూడా డిస్క్ బ్రేక్‌ను ఏర్పాటు చేసింది. దీంతో అధిక వేగాల్లో కూడా మెరుగైన బ్రేకింగ్ పనితీరు లభిస్తుంది.

ఇది కూడా చదవండి: 2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?

డిజైన్ పరంగా Aerox Electric & పెట్రోల్ Aerox 155 మధ్య పెద్దగా తేడాలు కనిపించవు. ముందు భాగంలో ట్విన్ LED హెడ్‌ల్యాంప్స్‌, వెనుక LED టెయిల్‌ల్యాంప్‌ను కొనసాగించారు. అయితే పెట్రోల్ మోడల్‌లో ఉన్న LCD డిస్‌ప్లే స్థానంలో ఈ ఎలక్ట్రిక్ వెర్షన్‌లో TFT డిజిటల్ డిస్‌ప్లేను అందించారు. దీనికి స్మార్ట్‌ఫోన్ యాప్ కనెక్టివిటీ కూడా అందుబాటులో ఉంటుంది.

ప్రస్తుతం Yamaha Aerox Electricను ఢిల్లీ, బెంగళూరు, ముంబై, పుణె & చెన్నై నగరాల్లో మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. బెంగళూరు & ఢిల్లీలో దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.2,81,600 కాగా, ముంబై, పుణె & చెన్నైలో రూ.2,82,390గా నిర్ణయించారు.

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఈ స్కూటర్ అందుబాటులో లేదు. అయితే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ మార్కెట్లలో కూడా విడుదల చేసే అవకాశం ఉంది. అక్కడ విక్రయాలకు వస్తే ఎక్స్ షోరూమ్ ధర సుమారు రూ.2,82,074 గా ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.