Bajaj Freedom 125 Price, Down Payment, Loan and EMI Details: ప్రపంచంలోని మొట్టమొదటి CNG బైక్ బజాజ్ ఫ్రీడమ్ 125. దీనిని సరిగ్గా ఏడాది క్రితం, 2024 జులై 5న భారతదేశంలో లాంచ్‌ చేశారు, అదే నెల 16 నుంచి డెలివెరీలు కూడా ప్రారంభమయ్యాయి. లాంచ్‌కు ముందే సంచలనం సృష్టించిన ఈ CNG టూవీలర్‌, లాంచింగ్‌ తర్వాత అమ్మకాల పరంగానూ కొత్త రికార్డ్‌లు సృష్టించింది. ఈ బజాజ్ బ్రాండ్‌ బైక్, సామాన్యుడు కోరుకునే లక్షణాలున్న బండి. ఆర్థికంగా అందుబాటులో ఉంటుంది & మంచి మైలేజీ ఇస్తుంది.

రోజువారీ ప్రయాణాలకు బజాజ్ ఫ్రీడమ్ 125 ఒక మంచి ఎంపిక అవుతుంది. ఈ టూవీలర్‌ను కొనడానికి బ్యాంక్‌ మీకు లోన్‌ కూడా ఇస్తుంది.  

హైదరాబాద్‌లో బజాజ్ ఫ్రీడమ్ 125 ధరబజాజ్ ఫ్రీడమ్ 125లో డ్రమ్‌, డ్రమ్‌ LED, డిస్క్‌ LED అనే మూడు ఆప్షన్లు ఉన్నాయి. డ్రమ్ వేరియంట్‌ ఎక్స్-షోరూమ్ ధర (Bajaj Freedom 125 ex-showroom price) 90,976 రూపాయలు. హైదరాబాద్‌లో ఈ బండి ఆన్‌-రోడ్‌ ధర (Bajaj Freedom 125 on-road price) దాదాపు 1.14 లక్షల రూపాయలు. విజయవాడలో దాదాపు 1.10 లక్షల రూపాయలు. ఇతర తెలుగు నగరాల్లోనూ ధరలో స్వల్ప తేడాలు ఉండవచ్చు.

కేవలం రూ.10 వేలతో ఈ బైక్‌ కొనవచ్చు!బజాజ్ ఫ్రీడమ్ 125 కొనడానికి మీ దగ్గర పూర్తి మొత్తం లేకపోయినా పర్లేదు, కేవలం రూ. 10 వేలు ఉన్నా చాలు. ఈ డబ్బును డౌన్‌ పేమెంట్‌ చేసి, మిగిలిన మొత్తాన్ని బ్యాంక్‌ నుంచి లోన్‌ తీసుకోవచ్చు. ఒకవేళ, మీరు ఈ బైక్‌ను హైదరాబాద్‌లో కొంటుంటే, రూ. 10 వేల డౌన్‌ పేమెంట్‌ తర్వాత, రూ. 1.04 లక్షలను లోన్‌ తీసుకోవాలి.

EMI ఎంత అవుతుంది?రూ. 1.04 లక్షల లోన్‌ మీద బ్యాంక్ 9 శాతం వార్షిక వడ్డీ రేటు విధించిందని భావిద్దాం. ఇప్పుడు, మీరు నెలనెలా కట్టాల్సిన EMI ఎంతో లెక్క చూద్దాం.

  • 4 సంవత్సరాల (48 నెలలు) లోన్‌ టెన్యూర్‌ను మీరు ఎంచుకుంటే, ప్రతి నెలా రూ. 2,928 EMI చెల్లించాలి. 
  • 3 సంవత్సరాల్లో (36 నెలలు) రుణం చెల్లించాలని అనుకుంటే, ప్రతి నెలా రూ. 3,646 EMI చెల్లించాలి. 
  • 2 సంవత్సరాల  (24 నెలలు) రుణ కాలపరిమితి ఎంచుకుంటే, ప్రతి నెలా రూ. 5,081 EMI చెల్లించాలి. 

ఫీచర్లలో ఫ్రీడమ్‌బజాజ్ ఫ్రీడమ్ బైక్‌కు పవర్‌ఫుల్‌ 125cc ఇంజిన్‌ను బిగించారు. ఇది బైక్‌తో పాటు రైడర్‌కు కూడా గొప్ప శక్తిని అందిస్తుంది. దీని డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, యూత్‌ & ఫ్యామిలీకి ఇద్దరికీ సరిగ్గా సరిపోతుంది. ఈ బైక్‌లో డిజిటల్ డిస్‌ప్లే, LED లైట్లు వంటి చాలా మోడర్న్‌ టెక్నాలజీలను పొందవచ్చు. ముఖ్యంగా, సౌకర్యవంతమైన సీటింగ్‌ ఈ బండికి ప్లస్‌ పాయింట్‌, డైలీ అప్‌ అండ్‌ డౌన్‌ చేయవచ్చు & ఫ్యామిలీతో కలిసి హాయిగా షికార్‌కు వెళ్లవచ్చు.

మెరుగైన మైలేజ్‌సామాన్యుడు భరించగలిగే ధరలో బెస్ట్‌ మైలేజ్‌ ఇచ్చే టూవీలర్‌ కావడం వల్ల ఈ బైక్‌ను చాలామంది ఇష్టపడుతున్నారు. బజాజ్ ఫ్రీడమ్ 125 బైక్ పెట్రోల్‌ & CNG రెండిటితోనూ నడుస్తుంది. కంపెనీ చెప్పిన ప్రకారం, లీటరు పెట్రోలుకు 60-65 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. CNG మోడ్‌లో కిలోకు 102 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.