World First CNG Scooter Launch India: టెక్నాలజీ ఎంత అప్‌డేట్‌ అవుతోందో చూడండి, ముఖ్యంగా ఆటోమొబైల్‌ రంగంలో. ప్రపంచంలోనే మొట్టమొదటి CNG బైక్‌ Bajaj Freedom 125 గత ఏడాది జులై 5 లాంచ్‌ అయింది. ఇప్పుడు, ప్రపంచంలోనే మొట్టమొదటి CNG స్కూటర్‌ను అదే కంపెనీ లాంచ్‌ చేయబతోంది, ఈ ఈవెంట్‌ అతి త్వరలో జరగబోతోంది. ఈ ఏడాది జనవరిలో, దిల్లీలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2025లో TVS మోటార్‌ చాలా కొత్త ద్విచక్ర వాహన మోడళ్లను పరిచయం చేసింది. వాటిలో TVS Jupiter CNG పేరు కూడా ఉంది. నివేదికల ప్రకారం, TVS జూపిటర్ CNG స్కూటర్‌ను మరికొన్ని నెలల్లో లాంచ్‌ (TVS Jupiter CNG Launch) చేయవచ్చు.

Continues below advertisement


1 కిలో CNG తో జూపిటర్ CNG స్కూటర్‌ ఎంత దూరం నడుస్తుంది?
TVS జూపిటర్ CNG ప్రపంచంలోనే మొట్టమొదటి CNG పవర్డ్ స్కూటర్ అని చెబుతున్నారు. ఈ CNG స్కూటర్‌ ప్రయాణ ఖర్చు కిలోమీటరుకు 1 రూపాయి కంటే తక్కువ అని కంపెనీ ప్రకటించింది. TVS జూపిటర్ CNG బండిలో 1.4 కిలోల CNG ట్యాంక్ అండర్ సీట్ స్టోరేజ్ ఏరియాలో ఏర్పాటు చేశారు. ఈ స్కూటర్ 1 కిలో CNG తో 84 కి.మీ. మైలేజీని ఇస్తుందని కంపెనీ చెప్పింది. ప్రస్తుతం, హైదరాబాద్‌లో కిలో CNG ధర 96 రూపాయలు. విజయవాడలో  కిలో CNG ధర 89 రూపాయలు. ఈ లెక్కన, TVS జూపిటర్ CNG రన్నింగ్‌ ఖర్చు 1 కిలోమీటరుకు దాదాపు 1 రూపాయి మాత్రమే.      


1 కిలో CNG కి 84 కి.మీ. మైలేజీ లెక్క ప్రకారం, TVS జూపిటర్ CNG స్కూటర్‌లోని 1.4 కిలోల ట్యాంక్‌ను నింపితే, ఈ బండి 126 కి.మీ. వరకు ప్రయాణించగలదు.        



TVS జూపిటర్ CNG పవర్‌ట్రెయిన్
TVS జూపిటర్ CNGలో OBD2B కంప్లైంట్ ఇంజిన్ ఉంది. ఇది 125cc బయో-ఫ్యూయల్ ఇంజిన్‌తో పని చేస్తుంది. ఇది 600 rpm వద్ద 5.3 kW శక్తిని & 5500 rpm వద్ద 9.4 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.      


జూపిటర్ CNG ఫీచర్లు     
జూపిటర్ CNG లో కొత్త & స్మార్ట్ ఫీచర్లు ఇస్తున్నారు. LED హెడ్‌లైట్లు, USB ఛార్జర్, స్టాండ్ కట్-ఆఫ్ & బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ స్కూటర్ పర్యావరణ అనుకూలమైనది & ఇంధన ఆదా కోసం ప్రత్యేకంగా తయారైంది. 


జూపిటర్ CNG అంచనా ధర
ప్రస్తుతం, TVS Jupiter 125 పెట్రోల్ వెర్షన్ ధర వేరియంట్‌ను బట్టి రూ. 88,174 - రూ. 99,015 మధ్య ఉంది. కొత్త CNG వెర్షన్ కూడా అదే శ్రేణిలో, రూ. 90,000 - రూ. 99,000 మధ్య లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. అయితే, CNG ట్యాంక్ కారణంగా, అండర్‌సీట్‌ స్పేస్ కొంచెం తక్కువగా ఉండవచ్చు.