2025 Tata Altroz Facelift Price, Mileage And Features: టాటా మోటార్స్, తన ఫ్యాన్‌బేస్ కోసం, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను కొన్ని రోజుల క్రితం విడుదల చేసింది. ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో ప్రధాన మార్పులు జరిగాయి, ఈ కార్ మునుపటి కంటే స్మార్ట్‌గా, సేఫ్‌గా & ఫీచర్-రిచ్‌గా మారింది. అప్‌డేటెడ్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర (2025 Tata Altroz Facelift ex-showroom price) రూ. 6.89 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది, టాప్-ఎండ్ వెర్షన్ రేటు రూ. 11.40 లక్షల వరకు ఉంటుంది. సరికొత్త అవతార్‌లో రోడ్డు ఎక్కిన ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను కొనేముందు, ఈ కారును ప్రత్యేకంగా నిలుపుతున్న 5 విషయాలు తెలుసుకోండి.
కొత్త డిజైన్ & ఎక్స్‌టీరియర్ అప్‌డేట్స్‌కొత్త ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్‌లో సరికొత్త LED హెడ్‌లైట్లు, రిఫ్రెష్‌డ్ ఫ్రంట్ గ్రిల్ & ఏరోడైనమిక్ డిజైన్ బంపర్‌ను బిగించారు. ఇంకా... కొత్త 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, లైట్లు వెలిగే ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ & కనెక్టెడ్ LED టెయిల్‌ల్యాంప్‌లు ఉన్నాయి. టాటా మోటార్స్ ఈ ఫేస్‌లిఫ్ట్‌ను కొన్ని కొత్త రంగుల్లోనూ పరిచయం చేసింది. ఇవన్నీ కలిసి కొత్త ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్‌ను మునుపటి కంటే స్టైలిష్‌గా మార్చాయి.
ఫ్యూచరిస్టిక్ ఇంటీరియర్ & కొత్త 'ఫిజిటల్' డాష్‌బోర్డ్ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ లోపలి భాగం కూడా మరింత ప్రీమియంగా మారింది. 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, 2-స్పోక్ స్టీరింగ్ వీల్ అందించారు. డిజిటల్ & ఫిజికల్ కంట్రోల్స్ కాంబోతో 'ఫిజిటల్' (Phygital) డాష్‌బోర్డ్ ఏర్పాటు చేశారు. కొత్త ఆల్ట్రోజ్‌కు కొత్త లేత రంగు అప్‌హోల్‌స్టెరీ అపాదించారు, ఇది క్యాబిన్‌లో మరింత ఓపెన్ & కంఫర్టబుల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది.
భద్రత & సాంకేతికత కొత్త టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ డ్రైవింగ్ అనుభవాన్ని స్మార్ట్‌గా మార్చిన కంపెనీ, భద్రతపరంగా గతం కంటే మెరుగైన ఆధునిక & ప్రీమియం ఫీచర్లను చేర్చింది. బ్లైండ్ వ్యూ మానిటర్‌తో 360-డిగ్రీ కెమెరాను ఏర్పాటు చేసింది. దీనివల్ల, కారును ఇరుకైన ప్రదేశాలలో పార్క్ చేయడం & సురక్షితంగా మలుపులు తీసుకోవడం ఇంకా సులభంగా మారింది. ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, 6 ఎయిర్‌బ్యాగ్‌లు కారులో ఉన్నాయి. ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్) భద్రత వల్ల, క్లిష్ట పరిస్థితుల్లో కూడా కారు స్కిడ్ కాకుండా స్థిరంగా ఉంటుంది. ఎంటర్‌టైన్‌మెంట్ & మ్యూజిక్ అనుభవం కోసం కారులో 8-స్పీకర్ హర్మాన్ ఆడియో సిస్టమ్ కూడా ఉంది. క్యాబిన్‌లో మరింత ప్రీమియం ఫీల్ తేవడానికి ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ కూడా ఇచ్చారు.
ఇంజిన్ ఆప్షన్లు & ట్రాన్స్‌మిషన్‌టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ అన్ని రకాల కస్టమర్ల అవసరాలకు తగిన ఇంజిన్ ఆప్షన్స్‌తో అందుబాటులో ఉంది. దీనిలో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది, ఇది రెండు ట్రాన్స్‌మిషన్ ఎంపికలు - AMT & DCA - ఆప్షన్స్‌తో వస్తుంది. తద్వారా, కస్టమర్‌లు తమ అవసరానికి అనుగుణంగా ఎంచుకోవచ్చు. ఆల్ట్రోజ్ CNG వెర్షన్ కూడా ఉంది, ఇది మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో నడుస్తుంది. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.
ట్రిమ్ లెవల్స్‌టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ నాలుగు ట్రిమ్ లెవల్స్‌లో లాంచ్ అయింది - Smart, Pure, Creative & Accomplished. ఈ ట్రిమ్‌లలో ఫీచర్లు & సౌకర్యాల స్థాయి పెరుగుతుంది. అంటే.. కస్టమర్ తన బడ్జెట్ & అవసరాలకు అనుగుణంగా సరైన ట్రిమ్ ఎంచుకోవచ్చు.