Maruti Suzuki e-Vitara Launch Date: మరికొంత కాలంలో, మారుతి సుజుకి భారతదేశంలో లాంచ్‌ చేయనున్న ఎలక్ట్రిక్ SUV ఇ-విటారా కోసం ప్రజలు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి, మారుతి నుంచి వస్తున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్‌ వాహనం ఇదే. ఈ ఏడాది జనవరిలో జరిగిన 'ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో' సందర్భంగా, మారుతి సుజుకీ, ఇ-విటారాను మొదటిసారిగా పరిచయం చేసింది. లాంచ్‌కు ముందు, ఇప్పుడు, ఇ-విటారా నలుపు రంగుతో ఎటువంటి కవర్ లేకుండా రోడ్డుపై కనిపించింది.

న్యూస్‌ వెబ్‌సైట్ రష్లేన్‌ రిపోర్ట్‌ చేసిన ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ SUV మారుతి గురుగావ్‌ క్యాంపస్ బయట కనిపించింది. ఎలక్ట్రిక్ SUV ఇ-విటారా లాంచ్ కోసం జరుగుతున్న సన్నాహాలు క్లైమాక్స్‌కు చేరుకున్నాయని ఈ సంఘనట సూచిస్తుంది.

డిజైన్ ఎలా ఉంది?మారుతి సుజుకి E విటారా డిజైన్ పూర్తిగా ఆధునికంగా & దూకుడు (అగ్రెసివ్‌)గా ఉంది. నిగనిగలాడే నలుపు రంగులో ఈ కారు దర్శనమివ్వడం ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. కనెక్టెడ్‌ LED టెయిల్‌ల్యాంప్స్‌, షార్ప్‌ బంపర్ కట్స్‌, డ్యూయల్-టోన్ ఏరోడైనమిక్ అల్లాయ్ వీల్స్, C-పిల్లర్‌ మీద ఇంటిగ్రేటెడ్ డోర్ హ్యాండిల్స్ & మారుతి సిగ్నేచర్ స్టైల్‌ వంటి ముచ్చటగొలిపే ఎక్స్‌టీరియర్‌ను కూడా ఈ కారులో చూడవచ్చు. బోల్డ్ వీల్ ఆర్చ్‌లు & చూడచక్కటి సైడ్ ప్రొఫైల్ దీనిని మస్క్యులర్ & గ్లోబల్ లుక్‌లోకి మార్చాయి. భారతీయ కస్టమర్లతో పాటు అంతర్జాతీయ కస్టమర్లను కూడా ఆకర్షించేలా ఈ కారును డిజైన్‌ చేశారు.

బ్యాటరీ & రేంజ్‌మారుతి ఇ-విటారాలో జనం ఎక్కువగా చూస్తున్న విషయం దాని బ్యాటరీ & రేంజ్. E Vitaraలో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌ ఉంటాయి - మొదటిది 48.8 kWh స్టాండర్డ్ ప్యాక్, ఇది దాదాపు 450 కి.మీ. రేంజ్ ఇస్తుంది. రెండోది 61.1 kWh లాంగ్ రేంజ్ ప్యాక్, ఇది సింగిల్‌ ఛార్జ్‌లో 500+ కి.మీ. దూరాన్ని కవర్ చేయగలదు. ఈ కారు సింగిల్‌ మోటార్ సెటప్‌తో వస్తుంది. 

ఫీచర్లు & ఇంటీరియర్ఫీచర్లు & ఇంటీరియర్ల విషయానికి వస్తే... E Vitara టెక్నాలజీ & లగ్జరీ-రిచ్ కారు. కంప్లీట్‌ డిజిటల్ ఇన్‌స్ట్రమెంట్‌ క్లస్టర్, 360-డిగ్రీ కెమెరా సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ & లెవల్-2 ADAS (లేన్ కీప్ అసిస్ట్ & ఆటోమేటిక్ బ్రేకింగ్ వంటివి) వంటి అధునాతన లక్షణాలు కారుకు ప్రీమియం ఫీల్‌ ఇస్తాయి. ఈ కారు డెల్టా, జీటా & ఆల్ఫా వేరియంట్‌లలో లాంచ్‌ చేయబోతున్నారు. తద్వారా కస్టమర్‌లు వారి అవసరాలు & బడ్జెట్ ప్రకారం వేరియంట్‌ను ఎంచుకోవచ్చు.

ఎలక్ట్రిక్ SUV విభాగంలో, e Vitara ఇప్పటికే ఉన్న ప్రధాన మోడళ్లతో పోటీ పడనుంది. డిజైన్ & టెక్నాలజీ పరంగా హ్యుందాయ్ క్రెటా EVతో; డ్రైవింగ్‌ రేంజ్‌ & సేఫ్టీ విషయంలో Tata Harrier EVతో; పెర్ఫార్మెన్స్‌లో Mahindra XUV 9eతో & డబ్బుకు తగిన విలువలో MG ZS EVతో పోటీ పడనుంది. e Vitaraను ఈ ఏడాది నవంబర్-డిసెంబర్ సమయంలో లాంచ్‌ చేయవచ్చు. ప్రారంభ ధర దాదాపు రూ. 17 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని అంచనా. లాంచ్‌కు ముందే బుకింగ్స్‌ ఓపెన్‌ కావచ్చు.