GST Reforms 2025 Impact On New Car Bookings: ఇప్పుడు, ఇండియన్‌ ఆటోమొబైల్ మార్కెట్లో ఒక ప్రత్యేక పరిస్థితి కనిపిస్తోంది. కొత్త GST కోతల ఆశతో, కొత్త కారు కొనుగోలుదార్ల తమ నిర్ణయాలను వెనక్కి తీసుకుంటున్నారు/ వాయిదా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పన్ను (GST) రేట్లను తగ్గిస్తే, కార్లు మునుపటి కంటే చౌకగా మారుతాయని ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈ ఆశ కారణంగా, కొత్త కారు కొనాలనుకుంటున్న కస్టమర్లు "వేచి చూద్దాం" అనే ధోరణిలో ఉన్నారు.

బుకింగ్స్‌పై ప్రభావండీలర్‌షిప్‌లలో వాహనాల గురించి విచారణలు ఖచ్చితంగా పెరిగాయి, కానీ బుకింగ్స్‌ బాగా తగ్గాయి. ఎంట్రీ లెవల్ కార్లు & ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేసే వినియోగదారులు, సరైన సమయం (GST సంస్కరణల ప్రకటన) కోసం వేచి చూస్తున్నారు. ప్రస్తుతం 28% పన్ను పరిధిలో ఉన్న చిన్న కార్లు GST రేట్ల తగ్గింపు తర్వాత 18% పరిధిలోకి దిగి రావచ్చు. మరోవైపు, SUVలపై పన్ను 45% నుంచి 40% కు తగ్గే అవకాశం ఉంది. ఇది వాహనాల ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది, ట్యాగ్‌ ప్రైస్‌ బాగా తగ్గి కస్టమర్లకు పెద్ద మొత్తంలో డబ్బు ఆదా అవుతుంది.

కార్ల ధరలు ఏ మాత్రం తగ్గవచ్చు?GST రేట్లు తగ్గిస్తే... Maruti Wagon R, Maruti Baleno, Hyundai Creta & Mahindra Scorpio N వంటి పాపులర్‌ వెహికల్స్‌ బాగా చౌకగా మారవచ్చు. చిన్న కార్ల ధరలు దాదాపు రూ. 60,000 తగ్గుతాయని అంచనా. అదే సమయంలో, SUVల ధరలు రూ. లక్ష లేదా అంతకంటే ఎక్కువ తగ్గవచ్చు. ఇది, కార్‌ లోన్‌ తీసుకునే కొనుగోలుదారుల EMI ని కూడా తగ్గిస్తుంది & కారు కొనుగోలు చేయడాన్ని మునుపటి కంటే సౌలభ్యంగా మారుస్తుంది. 

కార్ల కంపెనీల ఆందోళననిజానికి, ఈ పరిస్థితి కార్ల కంపెనీల ఆందోళనలు పెంచింది. వాస్తవానికి, ఆటో రంగానికి ఈ పండుగ సీజన్‌ (దసరా, ఓనమ్‌, దీపావళి పండుగల సమయం) ఒక పీక్‌ టైమ్‌. ఏడాది మొత్తం జరిగే విక్రయాల్లో మెజారిటీ సేల్స్‌ ఈ ఫెస్టివ్‌ సీజన్‌లోనే జరుగుతాయి. కేంద్ర ప్రభుత్వం పన్ను GST రేట్లను తగ్గిస్తుందన్న ఆశతో వినియోగదారులు ఇప్పుడు కార్లు కొనడానికి దూరంగా ఉన్నారు, ఈ కారణంగా అమ్మకాలు తగ్గుతున్నాయి. 

పండుగ సీజన్ & కార్పొరేట్ వ్యూహంవాస్తవానికి, ఈ పండుగ సీజన్ కారు కొనడానికి ఉత్తమ సమయంగా మారే అవకాశం ఉంది. GST గురించి గందరగోళం కారణంగా సీజన్‌ ప్రారంభం కొంచెం బలహీనంగా ఉంది. దీంతో, కంపెనీలు, ఇప్పుడు, కస్టమర్లను ఆకర్షించడానికి డిస్కౌంట్లు & ప్రత్యేక ఆఫర్లను ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి. 

సెప్టెంబర్ 3 & 4 తేదీల్లో న్యూదిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ‍‌(GST Council meeting) జరగనుంది. కార్లపై పన్ను రేట్లు తగ్గించాలా, వద్దా అనే విషయంపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం, వినియోగదారులు వేచి ఉన్నారు & మార్కెట్‌ కాస్త డల్‌గా ఉంది. పన్ను తగ్గించాలని నిర్ణయించుకుంటే ప్రభుత్వం నిర్ణయిస్తే అది ఆటో రంగంలో కొత్త ఉత్సాహం నింపుతుంది. & కస్టమర్ల రద్దీతో షోరూమ్‌లు మళ్లీ కళకళలాడతాయి.