Royal Enfield Classic 350 Down Payment, Loan and EMI Details: మోటార్‌ సైకిల్‌ అంటే రాయల్‌ ఎన్‌ఫీల్డే. బైకుల రాజ్యంలో సింహం ఈ బండి. పేరుకు తగ్గట్లే ఇది రాయల్‌గా ఉంటుంది, రైడర్‌కు కూడా రాయల్‌ అప్పీల్‌ ఇస్తుంది. భారతీయ మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్‌‌కు డైహార్డ్‌ ఫ్యాన్స్‌ ఉన్నారు. ముఖ్యంగా, యువత ఈ బ్రాండ్ మోటార్‌ సైకిళ్లు అంటే పిచ్చెక్కిపోతారు. పిచ్చ పాపులారిటీ ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్‌ 350 బైక్‌ల గురించి చర్చ వచ్చినప్పుడల్లా, క్లాసిక్ 350 పేరు మొదట వినిపిస్తుంది. మీరు రోజూ ఆఫీసుకు వెళ్లడానికి రాయల్ ఎన్‌ఫీల్డ్‌ బైక్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, క్లాసిక్ 350 మీకు బెస్ట్‌ పార్ట్‌నర్‌ అవుతుంది, మీ స్టైల్‌ ఇనుమడిస్తుంది.

రేటు ఎంత?తెలుగు నగరాల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్ 350 బైక్‌ 7 వేరియంట్లలో అందుబాటులో ఉంది. క్లాసిక్ 350లో అత్యంత తక్కువ రేటు మోడల్ దాని 'Redditch' వెర్షన్. దీని ఎక్స్‌-షోరూమ్‌ ధర (Royal Enfield Classic 350 ex-showroom price) 1,95,300 రూపాయలు. హైదరాబాద్‌ లేదా విజయవాడలో దీని ఆన్-రోడ్ ధర (Royal Enfield Classic 350 on-road price) 2,44,220 రూపాయలు. డీలర్‌షిప్‌ లేదా నగరాన్ని బట్టి ఈ ధరలో స్వల్ప తేడా ఉండవచ్చు. 

క్లాసిక్ 350 ని EMI పై ఎలా కొనుగోలు చేయాలి? మీరు ఈ రాయల్‌ బండిని సొంతం చేసుకోవడానికి ఈ డబ్బు మొత్తాన్ని ఒకేసారి చెల్లించాల్సిన అవసరమే లేదు. మీకు డబ్బు సర్దుబాటు చేయడానికి బ్యాంక్‌ లేదా ఫైనాన్స్‌ కంపెనీ ప్రతినిధులు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ షోరూమ్‌లోనే రెడీగా ఉంటారు. బైక్‌ లోన్‌ తీసుకుని, ఈజీ EMI ఆప్షన్‌ పెట్టుకుని, ఈ మోటార్‌సైకిల్‌ను ఎంచక్కా మీ ఇంటికి తీసుకెళ్లవచ్చు.

బ్యాంక్‌ లేదా ఫైనాన్స్‌ కంపెనీ లోన్‌ పొందాలంటే ముందుగా మీరు స్వల్ప మొత్తాన్ని డౌన్‌ పేమెంట్‌ చేయాలి. రాయల్ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్ 350 కొనడానికి మీరు రూ. 14,220 డౌన్ పేమెంట్‌ చేస్తే చాలు. మిగిలిన రూ. 2,30,000 రుణంగా లభిస్తుంది. ఈ రుణంపై, బ్యాంక్ 9 శాతం వార్షిక వడ్డీని వసూలు చేస్తుందని అనుకుందాం. ఇప్పుడు, మీరు నెలనెలా చెల్లించాల్సిన EMI లెక్క చూద్దాం. 

రుణం: రూ.2,30,000 - వడ్డీ రేటు: 9% - EMI: ?  

4 సంవత్సరాల్లో తిరిగి తీర్చేలా లోన్‌ తీసుకుంటే మీరు ప్రతి నెలా రూ. 5,724 EMI చెల్లించాలి.

3 సంవత్సరాల కాలం కోసం రుణం తీసుకుంటే నెలకు రూ. 7,314 EMI డిపాజిట్ చేయాలి. 

2 సంవత్సరాల లోన్‌ టెన్యూర్‌ పెట్టుకుంటే నెలనెలా రూ. 10,507 EMI జమ చేయాలి. 

మీరు ఎంత ఎక్కువ డౌన్‌పేమెంట్‌ చేస్తే, బ్యాంక్‌కు చెల్లించాల్సిన మొత్తం వడ్డీ ఆ మేరకు తగ్గుతుంది. బ్యాంక్‌ లోన్‌, వడ్డీ రేటు అనేవి మీ క్రెడిట్‌ స్కోర్‌, క్రెడిట్‌ హిస్టరీ, బ్యాంక్‌ పాలసీపై ఆధారపడి ఉంటుంది. రుణం తీసుకునే ముందు అన్ని పత్రాలను జాగ్రత్తగా చదవడం మరిచిపోవద్దు.