Upcoming Cars in India July 2024: ఈ నెలలో పలు ఆటో మోబైల్ కంపెనీలు తమ లేటెస్ట్ కార్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నాయి. వీటిలో మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, బీవైడీ, నిస్సాన్ సహా పలు కంపెనీలకు చెందిన కార్లు ఉన్నాయి. ఇంతకీ జులై 2024లో విడుదలయ్యే కార్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..


1. మెర్సిడెస్ బెంజ్- EQA


లగ్జరీ కార్ల సంస్థ మెర్సిడెస్ బెంజ్ నుంచి మరో కొత్త మోడల్ విడుదలకు రెడీ అవుతోంది. ఈవీ లైనప్ లో  EQA యాడ్ అవుతోంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ రెండు బ్యాటరీ ఆప్షన్లు సహా నాలుగు వేరియంట్లతో అందుబాటులోకి రానుంది. ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ కారు ఒక ఛార్జ్‌ తో 560 కిలో మీటర్లు ప్రయాణించే అవకాశం ఉంది. ఈ నెల 8న లాంచ్ కానుంది. ఈ కొత్త మోడల్ కారు.. BMX X1, వోల్వో XC40 రీఛార్జ్, కియా EV6 కార్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.  


2. BYD Atto 3


చైనా ఆటో మోబైల్ సంస్థ బుల్డ్‌ యువర్‌ డ్రీమ్‌(BYD) భారత్ మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ కారును అందుబాటులోకి తీసుకురానుంది. BYD Atto 3 పేరుతో ఈ కారును విడుదల చేయనుంది. ఈ కారు కేవలం గంట సేపట్లో 85 శాతానికిపైగా ఛార్జ్ అవుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ కారు ఎకో, నార్మల్, స్పోర్ట్  డ్రైవింగ్ మోడ్ లలో అందుబాటులోకి రానుంది. ఈ ఎలక్ట్రిక్ కారును అత్యంత సరసమైన ధరలో విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది. అయితే, ఫీచర్లు కూడా తక్కువగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. 


3. నిస్సాన్ ఎక్స్-ట్రైల్


ప్రముఖ కార్ల తయారీ సంస్థ సరికొత్త నిస్సాన్​ ఎక్స్​- ట్రైల్ ​ని విడుదల చేసేందుకు సిద్ధం అవుతోంది. జులై 17న ఈ ఎస్​యూవీని లాంచ్ చేయనుంది. ఈ 2024 నిస్సాన్​ ఎక్స్​- ట్రైల్ పొడవు 4680 mm, వెడల్పు 2065 mm, ఎత్తు 1725mm, వీల్​బేస్​ 2705 mm,  గ్రౌండ్​ క్లియరెన్స్​ 205 mm కలిగి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్​లో ఈ కారు 5 సీటర్​, 7 సీటర్ వేరియంట్లలో అందుబాటులో లభించనుంది.  


4. BMW 5-సిరీస్ LWB


BMW నుంచి 5 సిరీస్ లాంగ్ వీల్‌బేస్(LWB) విడుదలకు రెడీ అవుతోంది. జూలై 24న ఈ కారు భారత మార్కెట్లోకి రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఈ కారు బుకింగ్స్ మొదలయ్యాయి. 5 సిరీస్ క్యాబిన్ 7 సిరీస్ లాగే ఉంటుంది. వెనుక భాగంలో అడిషనల్ లెగ్‌ రూమ్‌ ను కలిగి ఉంటుంది. BMW 5 సిరీస్ లాంగ్ వీల్‌బేస్ పెట్రోల్, డీజిల్ ఇంజన్లతో అందుబాటులోకి రానుంది.     


5. న్యూ మినీ కూపర్


మినీ కంపెనీ నుంచి కొత్త మినీ కూపర్ కారు త్వరలో విడుదలకానుంది. ఈ కారు ఫ్రంట్ భాగంలో  గ్రిల్‌ మరింత పలుచగా ఉంటుంది. హెడ్ లైట్ పాతకారు మాదిరిగానే ఉండనున్నాయి. బ్యాక్ సైడ్ యూనియన్ జాక్‌ థీమ్‌ తో కూడిన టెయిల్‌లైట్స్‌ మరింత స్పెషల్ గా ఉండనున్నాయి. ఈ కారు ఇంజిన్ 2.0-లీటర్ టర్బోఛార్జ్డ్‌ పెట్రోల్ ఇంజిన్‌ తో పని చేస్తుంది. ఈ కారు కేవలం 6.6 సెకన్లలో 100 కిలోమీటర్ల స్పీడ్ ను అందుకుంటుంది. కొత్త మినీ కూపర్ కారు గత కారుకంటే  అధిక ధరను కలిగి ఉండనుంది.  


6. న్యూ మినీ కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్


మినీ కంపెనీ నుంచి వస్తున్న మరో ఎలక్ట్రిక్ కారు న్యూ  మినీ కంట్రీమ్యాన్. ఈ కారు 8.6 సెకెన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఫుల్‌ ఛార్జ్‌ లో సుమారు 450 కిలోమీటర్ల రేంజిని పొందుతుంది. ఈ కారు రెండు వేరియంట్లలో రానుంది. కొత్త కంట్రీమ్యాన్ పెద్దదిగా ఉండబోతుంది. డిజిటల్ ఫోకస్డ్ క్యాబిన్‌ ను కలిగి ఉంటుంది. సస్టెయినబుల్ ఇంటీరియర్‌, పెద్ద టచ్‌ స్క్రీన్ తో వస్తుంది. 



Read Also: ఇండియన్ సేఫ్టీ టెస్టులో 5 స్టార్లు సాధించిన ఈవీలు ఇవే - దేశంలో సేఫెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు!