MG M9 vs Kia Carnival vs Toyota Vellfire: మీరు, SUVలే అతి పెద్ద వాహనాలు అని అనుకుంటుంటే.. MG M9, కియా కార్నివాల్ & టయోటా వెల్‌ఫైర్ వంటి MPVలను ఓసారి చెక్‌ చేయండి. ఈ వెహికల్స్‌ 5 మీటర్లకు పైగా పొడవుతో ఉంటాయి. అంతేకాదు, వెడల్పు & వీల్‌బేస్ పరంగానూ చాలా పెద్దవి.

నిజానికి, MG M9 ఇండియాలో ఇంకా లాంచ్‌ కాలేదు, త్వరలో విడుదల అవుతుంది. దీని సైజ్‌ దీనిని MPV విభాగంలో చాలా ప్రత్యేకంగా నిలబెడుతుంది. కియా కార్నివాల్, టయోటా వెల్‌ఫైర్ ఇప్పటికే దేశంలో అందుబాటులో ఉన్నాయి.

పొడవు పొడవు పరంగా, MG M9 అత్యంత పొడవైన MPV. దీని పొడవు 5200 mm. కియా కార్నివాల్ పొడవు 5155 mm & టయోటా వెల్‌ఫైర్ పొడవు 5010 mm. ఈ మూడు కార్లు 5 మీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉండటం వలన వాటిని సూపర్ ప్రీమియం విభాగంలో చేర్చారు.

వెడల్పు & ఎత్తువెడల్పు విషయానికి వస్తే... MG M9 2000 mm వెడల్పుతో ఈ విషయంలోనూ ముందంజలో ఉంది. కియా కార్నివాల్ వెడల్పు 1995 mm & టయోటా వెల్‌ఫైర్ వెడల్పు 1850 mm. ఈ రెండిటి కంటే MG M9 వెడల్పు ఎక్కువ.

ఎత్తు విషయంలో.. టయోటా వెల్‌ఫైర్ 1950 mm ఎత్తుతో అగ్రస్థానంలో ఉంది. దీని తరువాత, MG M9 1840 mm ఎత్తును కలిగి ఉంది & కియా కార్నివాల్ ఎత్తు 1775 mm. అంటే.. Toyota Vellfire పొడవు పరంగా మూడో స్థానంలో ఉన్నప్పటికీ, ఎత్తు పరంగా అగ్రస్థానంలో ఉంది. ఇది దీని రోడ్ ప్రెజెన్స్‌‌ను  & హెడ్‌రూమ్‌ను మెరుగ్గా మారుస్తుంది.

వీల్ బేస్వీల్‌బేస్ అంటే, ఒక వాహనం ముందు చక్రం మధ్యభాగం నుంచి వెనుక చక్రాల మధ్య భాగం వరకు ఉండే దూరం. ఈ కేస్‌లో MG M9 ముందుంది, దీని వీల్‌బేస్ 3200 mm. కియా కార్నివాల్ (3090 mm) & టయోటా వెల్‌ఫైర్ (3000 mm) కంటే ఇది ఎక్కువ. దీని అర్థం MG M9 లోపల సీటింగ్ & లెగ్ స్పేస్ గరిష్టంగా ఉంటుంది, ఇది ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేస్తుంది.

చక్రాల పరిమాణం ఇప్పుడు వీల్ సైజ్‌ దగ్గరకు వద్దాం. MG M9 & Toyota Vellfire రెండు కార్లకు 19-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ ఉన్నాయి. Kia Carnival అల్లాయ్ వీల్స్‌ సైజ్‌ 18-అంగుళాలు. 

ఈ లెక్కలన్నీ కలిపి చూస్తే...

  • MG M9 పొడవు 5200 mm, వెడల్పు 2000 mm, ఎత్తు 1840 mm, వీల్‌బేస్ 3200 mm & వీల్ సైజ్‌ 19 అంగుళాలు. 
  • కియా కార్నివాల్ పొడవు 5155 mm, వెడల్పు 1995 mm, ఎత్తు 1775 mm, వీల్‌బేస్ 3090 mm & వీల్ సైజ్‌ 18 అంగుళాలు.
  • టయోటా వెల్‌ఫైర్ పొడవు 5010 mm, వెడల్పు 1850 mm, ఎత్తు 1950 mm, వీల్‌బేస్ 3000 mm & వీల్ సైజ్‌ 19 అంగుళాలు.

ఈ కొలతలు చూస్తే, MG M9 ఈ విభాగంలో అత్యుత్తమ MPV అని చెప్పవచ్చు. ఈ కారును త్వరలో MG సెలెక్ట్ డీలర్‌షిప్‌ల ద్వారా భారతదేశంలో లాంచ్‌ చేస్తారు & ప్రారంభంలో దేశంలోని 30 ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉంటుంది.