2025 Tata Nexon Variants Explained: మీరు 2025 టాటా నెక్సన్ కొనాలని భావిస్తున్నారా? ఈ కొత్త వెర్షన్‌లో Smart, Pure, Creative, Fearless అనే నాలుగు ప్రధాన ట్రిమ్ లెవల్స్ ఉన్నాయి. ఈ ట్రిమ్స్‌లోనూ... ‘+’, ‘S’, ‘PS’, ‘A PS’ వంటి వేరియంట్లు కూడా ఉన్నాయి, ఇవన్నీ అదనపు ఫీచర్లతో ఉంటాయి. అన్నీ కలిపి, 2025 Tata Nexon లో మొత్తం దాదాపు 39 వేరియంట్లు మార్కెట్లోగా ఉన్నాయి, కానీ కొన్ని ముఖ్య వేరియంట్లు మాత్రమే యాక్చువల్ ఎంపికగా నిలుస్తాయి. మీ బడ్జెట్ పరిమితి ఉంటే, Smart + మంచి ఎంట్రీ లెవెల్‌ ఆప్షన్‌. ఎక్కువ ఫీచర్లు కావాలంటే Creative + PS తీసుకోవచ్చు. ADAS ఫీచర్లు కోరే వాళ్లు Fearless + A PS ను పరిశీలించవచ్చు.

Continues below advertisement

పవర్‌ట్రెయిన్‌లు & ట్రాన్స్మిషన్‌ కాంబినేషన్లు

పెట్రోల్‌ 1.2 లీటర్ టర్బో (120 hp): Smart వేరియంట్‌లో 5 MT; Pure / Creative / Fearless వేరియంట్లలో 6 MT; కొన్ని వేరియంట్లలో 6 AMT; Creative / Fearless లో 7-speed DCT.

Continues below advertisement

డీజిల్ 1.5 లీటర్ (115 hp): సాధారణంగా 6 MT; కొన్ని వేరియంట్లలో 6 AMT.

CNG 1.2 టర్బో (100 hp): 6 MT మాత్రమే.

2025 టాటా నెక్సన్ ప్రధాన ట్రిమ్ లెవల్స్‌ - ఫీచర్లు

Smart / Smart +

ఇంజిన్‌ & ట్రాన్స్మిషన్: 1.2 లీటర్ టర్బో-పెట్రోల్ 5-MT

బేసిక్ సేఫ్టీ & ఫీచర్లు: 6 ఎయిర్‌బ్యాగ్స్‌, ESP, ISOFIX, హిల్ హోల్, LED హెడ్‌లైట్స్ & DRL, రియర్ పార్కింగ్ సెన్సార్లు

Smart + వెర్షన్‌లో అదనపు ఫీచర్లు: రిమోట్ సెంట్రల్ లాకింగ్, పవర్ విండోస్, టచ్‌స్క్రీన్ ఆడియో, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్

Smart + S / Pure + / Pure + S

Smart + S: Smart + ఫీచర్లతో పాటు ఆటో హెడ్లైట్స్, ఆటో వైపర్లు, సన్ రూఫ్, రూఫ్ రెయిల్స్

Pure +: టచ్‌స్క్రీన్ 10.25”, వైర్‌లెస్ Android Auto / Apple CarPlay, రియర్ కెమేరా, ఆటో ఫోల్డ్ OVRMs, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, రియర్ AC వెంట్స్

Pure + S: Pure + ఫీచర్లతో పాటు ఆటో హెట్‌లైట్స్‌, ఆటో వైపర్లు, సన్ రూఫ్

పవర్ ట్రైన్స్: టర్బో-పెట్రోల్ 6-MT / AMT, డీజిల్ 6-MT / AMT, CNG 6-MT

Creative / Creative + S / Creative + PS

Creative: Pure + S ఫీచర్లు + 360° కెమెరా, 16” అలాయ్ వీల్స్, క్రూజ్ కంట్రోల్, ఆటో క్లైమేట్ కంట్రోల్, USB A & C టైప్ ఛార్జింగ్ పోర్ట్స్

Creative + S: Creative ఫీచర్లు + ఆటో హెట్‌లైట్స్‌, ఆటో వైపర్లు, సన్ రూఫ్

Creative + PS: Creative + S ఫీచర్లతో పాటు టైర్ ప్రెషర్ మానిటర్, ఫ్రంట్ ఫాగ్ లైట్స్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, బై-LED హెడ్‌లైట్స్, వైర్‌లెస్ చార్జింగ్, కీ లెస్ ఎంట్రీ, 60:40 రియర్ సీట్స్‌ స్ప్లిట్, USB A & C రియర్ పోర్ట్స్

పవర్ ట్రైన్స్: టర్బో-పెట్రోల్ 6-MT / AMT / 7-DCT, డీజిల్ 6-MT / AMT, CNG 6-MT

Fearless + PS / Fearless + A PS

Fearless + PS: Creative + PS ఫీచర్లతో పాటు ఆటో డిమింగ్ రియర్‌మిర్రర్, సీటబెల్ట్ అడ్జస్ట్, WELCOME / GOODBYE LED యానిమేషన్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, లెదర్డ్‌ సీట్స్ & స్టీరింగ్, ఎయిర్ ప్యూరిఫైయర్, కనెక్టెడ్ కార్ టెక్, 10.25” డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, JBL ఆడియో + OTA అప్‌డేట్స్

Fearless + A PS: Fearless + PS ఫీచర్లతో పాటు Level 2 ADAS సూట్

ఇది టాప్ స్పెక్‌, టాప్ ఫీచర్లు, సేఫ్టీ & టెక్ అన్ని కలిపిన వేరియంట్

మీ అవసారాల పరంగా (బడ్జెట్, ఫీచర్లు, డ్రైవింగ్ స్టైల్) ఈ వేరియంట్లలో ఏది మీకు సరైనదో ఎంపిక చేసుకోవచ్చు.