Tata Nexon Price, Down Payment, Loan and EMI Details: భారతీయ మార్కెట్లో, తక్కువ ధరకు మంచి మైలేజ్ & ఆధునిక ఫీచర్లు కలిగిన కార్లకే గిరాకీ ఎక్కువ. అలాంటి కార్ల లిస్ట్‌లో టాటా నెక్సాన్ కూడా ఉంది. ఇది, టాటా మోటార్స్ బెస్ట్ సెల్లింగ్ వాహనాలలో ఒకటి. పాపులర్ & సేఫెస్ట్ SUVల జాబితాలో ఉన్న ఈ ఫోర్‌వీలర్ రూ. 8 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు (Tata Nexon ex-showroom price) అందుబాటులో ఉంది.
మీ కోరికల జాబితాలో కారు ఉన్నప్పటికీ తక్కువ బడ్జెట్ కారణంగా కొనుగోలును వాయిదా వేస్తున్నారా?. మీరు సరిగ్గా ప్లాన్ చేస్తే, చాలా తక్కువ ఖర్చుతో కొత్త కారుకు ఓనర్ కావచ్చు. ఉదాహరణకు, మీరు టాటా నెక్సాన్ కొనాలనుకుంటే, మీ దగ్గర ఒకేసారి రూ. 9.56 లక్షలు ఉండాల్సిన అవసరం లేదు. ఒకేసారి పూర్తి చెల్లింపు చేయడానికి బదులుగా ప్రతి నెలా కొంత మొత్తాన్ని EMI రూపంలో చెల్లిస్తే సరిపోతుంది, డ్రీమ్ కార్ మీ సొంతం అవుతుంది.
టాటా నెక్సాన్ ఫైనాన్స్ ప్లాన్తెలుగు నగరాల్లో టాటా నెక్సాన్ స్మార్ట్ (పెట్రోల్) వేరియంట్ ఆన్-రోడ్ ధర 9.56 లక్షల రూపాయలు (స్వల్ప తేడాలతో). మీరు కేవలం రూ. 50,000 జేబులో పెట్టుకుని టాటా మోటార్స్ కార్ షోరూమ్‌కు వెళ్లండి. ఆ డబ్బును డౌన్ పేమెంట్ చేసి, మిగిలిన రూ. 9.06 లక్షలకు కారు లోన్ తీసుకోవాలి. బ్యాంక్ మీకు 9 శాతం వార్షిక వడ్డీ రేటుతో ఈ లోన్ మంజూరు చేసిందని అనుకుందాం. ఇప్పుడు, మంత్లీ EMI ఎంత అవుతుందో లెక్క చూద్దాం.
రుణం: రూ.9,06,000 - వడ్డీ రేటు: 9% - EMI: ?
* 7 సంవత్సరాల్లో తిరిగి తీర్చేలా లోన్ తీసుకుంటే మీరు ప్రతి నెలా రూ. 14,577 EMI చెల్లించాలి.
* 6 సంవత్సరాల కాలం కోసం రుణం తీసుకుంటే నెలకు రూ. 16,331 EMI డిపాజిట్ చేయాలి.
* 5 సంవత్సరాల లోన్ టెన్యూర్ పెట్టుకుంటే నెలనెలా రూ. 18,807 EMI జమ చేయాలి.
* 4 సంవత్సరాల్లో తిరిగి తీర్చేలా లోన్ తీసుకుంటే మీరు ప్రతి నెలా రూ. 22,546 EMI చెల్లించాలి.
మీరు ఎంత ఎక్కువ డౌన్‌పేమెంట్ చేస్తే అంత మంచిది, వడ్డీ భారం తగ్గుతుంది. బ్యాంక్ ఇచ్చే లోన్ మొత్తం, వసూలు చేసే వడ్డీ రేటు మీ క్రెడిట్ స్కోర్, క్రెడిట్ హిస్టరీ, బ్యాంక్ పాలసీపై ఆధారపడి ఉంటుంది.
టాటా నెక్సాన్ పవర్‌ట్రెయిన్టాటా నెక్సాన్‌లో కంపెనీ 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను అందించింది. ఈ ఇంజన్ గరిష్టంగా 120 bhp పవర్‌తో 170 Nm గరిష్ట టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ కారు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ వేరియంట్ 110 bhp గరిష్ట పవర్‌తో 260 Nm గరిష్ట టార్క్‌ను ఇస్తుంది.
టాటా నెక్సాన్‌లో కీలక ఫీచర్లుటాటా మోటార్స్, చాలా మంచి ఫీచర్లతో టాటా నెక్సాన్‌ను డిజైన్ చేసింది. కారులో 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేతో పాటు 10.25-అంగుళాల డిజిటల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఎత్తు సర్దుబాటు చేయగల సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, USB ఫాస్ట్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ & అల్లాయ్ వీల్స్ వంటివి ఉన్నాయి.