2025 జూన్ 24 రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu June 24th  2025

మేష రాశి (Aries) జూన్ 24, 2025

ఈ రోజు కుటుంబానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. మీ ప్రవర్తనను సానుకూలంగా ఉంచుకోండి. భవిష్యత్తు కోసం చేసిన ప్రణాళికలపై కూడా ఈ రోజు కొంత ఆలోచించవచ్చు. మీ లక్ష్యాలను సాధించేందుకు అడుగు ముందుకు వేస్తారు. మీ కుటుంబం, స్నేహితులు,  జీవిత భాగస్వామి నుంచి మీకు సహకారం ఉంటుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యుల కోసం ప్రయాణం చేయాల్సి వస్తుంది.

వృషభ రాశి (Taurus) జూన్ 24, 2025

ఈ రోజు ఈ రాశులవ్యాపారులు లాభపడతారు.  పెట్టుబడికి సంబంధించిన కొన్ని మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్త ఆలోచనలు మీ ముందుకు వస్తాయి. నూతన ప్రణాళికలు వేసుకోవడానికి ,  నిర్ణయాలు తీసుకోవడానికి చాలా మంచి రోజు. ఈ రోజు మీరు మీ బాధ్యతలపై పూర్తి శ్రద్ధ వహించండి.ప్రతి పనిని ఉత్సాహంతో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఈ రోజు అదృష్టం  కలిసొస్తుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. 

మిథున రాశి (Gemini) జూన్ 24, 2025

ఈ రోజు మీకు సంతోషకరమైన రోజు అవుతుంది. కొత్త పనులు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. వ్యాపారంలో రెట్టింపు వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి.ఈ రోజు మీ పనిని చాలా జాగ్రత్తగా చేయండి ఇతరులకు సహాయం చేసేందుకు ప్రయత్నించండి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది.  భాగస్వామి నుంచి ప్రేమ మరియు సహకారం లభిస్తుంది. విద్యార్థులకు ఈ సమయం బాగానే ఉంటుంది.  అనవసరమైన వివాదాల్లో చిక్కుకోకుండా జాగ్రత్తపడండి.

కర్కాటక రాశి (Cancer) జూన్ 24, 2025

ఈ రోజు బాగానే ఉంటుంది. ఈ రోజు మీ ఆలోచనలను సానుకూలంగా ఉంచుకోండి. ఈ రోజు  ఉద్యోగం మారాలని ఆలోచించవచ్చు , మంచి అవకాశాలు రాబోతున్నాయి. పెండింగ్ పనులు పూర్తిచేస్తారు. ఏదైనా నిర్ణయం తీసుకునేముందు మరోసారి ఆలోచించండి. తొందరపడి పని చేస్తే నష్టపోతారు. వ్యక్తిగత జీవితంలో సమస్యలు తీరిపోతాయి.

సింహ రాశి (Leo) జూన్ 24, 2025

ఈ రోజు మీకు ఉత్సాహంగా ఉంటుంది. వ్యాపారంలో కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది.  పని చేసే చోట మీ మాటలను అదుపులో ఉంచుకోండి. మీ కెరీర్‌కు సంబంధించి మనస్సులో కొన్ని సందేహాలు ఉంటాయి కానీ అవి త్వరలోనే పరిష్కారమవుతాయి. ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది.  వైవాహిక జీవితంలో ఇంతకు ముందు ఉన్న వివాదాల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీ ఖర్చులను నియంత్రించండి 

కన్యా రాశి (Virgo) జూన్ 24, 2025

ఈ రోజు ఈ రాశివారు ఇంటా బయటా ప్రశంసలు పొందుతారు. ఆర్థికంగా లాభపడతారు. అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయడానికి ఈ రోజు మంచిది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రభుత్వానికి సంబంధించిన పనులు పూర్తవ్వాలంటే కొంత ఓపిక పట్టాలి. విద్యార్థులు ఏదైనా కొత్త కోర్సులో చేరాలనుకుంటే ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. 

తులా రాశి (Libra) జూన్ 24, 2025

ఈ రోజు మీ మనస్సులో కొత్త ఆలోచనలు వస్తాయి. చేపట్టిన ప్రణాళికలో మార్పు ఉండవచ్చు. వ్యాపారంలో ఏదైనా కొత్తగా ట్రై చేయాలనే ఆలోచన వస్తుంది. ఆర్థిక లాభం వల్ల అప్పుల నుంచి విముక్తి పొందుతారు. ఈ రోజు కార్యాలయంలో పదోన్నత పొందే అవకాశం ఉంది. ఈ రోజు కుటుంబ సభ్యులతో కలసి శుభకార్యానికి హాజరవుతారు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు పొందుతారు. వృశ్చిక రాశి (Scorpio) జూన్ 24, 2025

ఈ రోజు ఆస్తిలో పెట్టుబడి పెట్టడానికి మంచి రోజు. పెద్దల సలహా మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ధన లాభం యోగం ఉంది. శత్రువులు మిమ్మల్ని ఓడించడానికి ప్రయత్నిస్తారు, కానీ వారు మీ ముందు నిలబడలేరు.  ఉద్యోగం చేసే వ్యక్తులు ప్రత్యేక విజయాన్ని సాధిస్తారు. వ్యాపారులు కొత్త ఆదాయ మార్గాలను పొందుతారు. ఈ రోజు మీరు మీ పాత స్నేహితుడితో మాట్లాడుతారు. ధనుస్సు రాశి (Sagittarius) జూన్ 24, 2025

ఈ రోజు మీ ఆలోచనలు ఆధ్యాత్మికతవైపు ఉంటాయి. ఏదైనా మతపరమైన యాత్రకు వెళ్లే అవకాశం ఉంది. రాజకీయ కార్యకలాపాలలో మీకు ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. వ్యాపారం, ఉద్యోగంలో శుభఫలితాలున్నాయి. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది.  

మకర రాశి (Capricorn) జూన్ 24, 2025

ఈ రోజు కార్యాలయంలో సీనియర్ అధికారి మీ పనిని మెచ్చుకుంటారు...ఈ రాశి ఉద్యోగులు శుభవార్త వింటారు.  విద్యార్థులకు అనుకూల సమయం.  వ్యాపారంలో లాభం వచ్చే అవకాశం ఉంది. ధన లాభం ద్వారా మీరు మీ పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఆలయంలో ధార్మిక కార్యక్రమాలు చేపట్టింది.  ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కుంభ రాశి (Aquarius) జూన్ 24, 2025

ఈ రోజు మీకు చాలా బాగుంటుంది. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పని రంగంలో మీరు ఆశించిన విజయాన్ని సాధిస్తారు. కుటుంబ విషయాల్లో, జీవిత భాగస్వామితో ఏదైనా విషయం గురించి చర్చ ఉండవచ్చు.  ఈ రోజు దూర ప్రయాణాలు చేయకుండా ఉండండి. వ్యాపారంలో పెట్టుబడి పెట్టేందుకు ఇది సరైన సమయం కాదు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మంచి రోజు. ఆరోగ్యం బావుంటుంది. మీన రాశి (Pisces) జూన్ 24, 2025

ఈ రోజంతా మీరు ఉత్సాహంగా ఉంటారు. ఏదైనా శుభకార్య నిర్వహణకు ప్లాన్ చేస్తారు. సంతానం కెరీర్ గురించి మనసులో ఆందోళన ఉంటుంది.  స్నేహితులతో కలిసి మంచి వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. రోజంతా ఆనందంగా ఉంటారు. ఉద్యోగులు పనితీరుతో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. కార్యాలయంలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఈ రోజు ఏదైనా కొత్తపని ప్రారంభించేముందు తల్లిదండ్రులు నమస్కరించండి.

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.