EV batteries Life: భారత దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం వేగంగా విస్తరిస్తోంది.అయితే కొత్తా ఈవీ కొనాలనుకునే వారిని ఇప్పిటకే వేధిస్తున్న ప్రధాన ప్రశ్న బ్యాటరీ ఎన్ని రోజులు వస్తుంది? ఐదేళ్ల తర్వాత ఫోన్ బ్యాటరికీ లాగానే ఇది కూడా పాడైపోతుందా? గ్లోబల్‌ స్టడీస్, భారతీయ రోడ్లపై తిరుగుతున్న వేల వాహనాల పని తీరును విశ్లేషించిన పరిశోధన సంస్థలు ఈవీ బ్యాటరీ సామర్థ్యంపై ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. 

బ్యాటరీలో క్షీణత ఎంత?

సుమారు 22, 700 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్‌ వాహనాలపై జరిగిన జియోాబ్‌ అధ్యయనం ప్రకారం ఆధునిక ఈవీ బ్యాటరీల సగటు క్షీణత రేటు సంవత్సరానికి 2.3శాతంగా ఉందని చెబుతుంది. 2024లో ది1.8గా ఉండేదని ఇప్పుడు ఫాస్ట్‌ ఛార్జింగ్ వినియోగం పెరగడం వల్ల  రేటు స్వల్పంగా పెరిగినట్టు తెలుస్తోంది. ఈ లెక్కన ఐదేళ్ల తర్వాత బ్యాటరీ తన అసలు తన సామర్థ్యంలో సుమారు 88 శాతం నుంచి 90 శాతం వరకు నిలుపుకుంటుంది. అంటే కారు మైలేజీలో పది నుంచి  12 శాతం మాత్రమే తగ్గుతుంది. ఎనిమిదేళ్ల తర్వాత బ్యాటరీ కెపాసిటీ 81 శాతం నుంచి 82 శాతం మధ్య ఉంటుంది. రేంజ్‌ సుమారు 18 శాతం నుంచి 20 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. 

వాస్తవానికి చాలా బ్యాటరీలు 10 నుంచి ఇరవై సంవత్సరాల పాటు లేదా 16 లక్షల నుంచి 3.2 లక్షల కిలోమీటర్ల వరకు సమర్థవంతంగా పని చేస్తాయని, ఇది కారు మొత్తం జీవితకాలం కంటే ఎక్కువ కాలమని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. 

టాటా నెక్సాన్ ఈవీ: ఒకట్రెండు సంవత్సరాల వాడకం లేదా 15వేల నుంచి 40 వేల కిలోమీటర్ల ప్రయాణం తర్వాత కూడా బ్యాటరీ SOH 98 శాతంనుంచి 99 శాతం వరకు స్థిరంగా ఉంటోంది. లక్ష కిలోమీటర్లు తిరిగిన తర్‌వాత కూడా ఇది దాదాపు 85 శాతం సామర్థ్యాన్ని కలిగి ఉంటోంది. 

ఎంజీ జెడ్‌ఎస్‌ ఈవీ: ఇందులో ఉన్న లిక్విడ్‌- కూల్డ్ బ్యాటరీ కారణంగా, నాలుగేళ్ల వాడకం తర్వాత కూడా 80 శాతం నుంచి 82 శాతం కెపాసిటీని నిలుపుకుంటోంది. అయితే కొందరు వినియోగదారులు అధిక వాడకం వల్ల రెండేళ్లలోనే 91 శాతం SOHకి చేరుకోవడం గమనించారు. 

హ్యూందాయ్‌ అయానిక్‌5: అత్యంత అద్భుతమైన పని తీరు చూపిస్తున్న ఈ మోడల్‌, నాలుగు లక్షల కిలోమీటర్ల ప్రయాణం తర్వాత కూడా 90 శాతంం కంటే ఎక్కువ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని పరీక్షల్లో తేలింది. 

హైదరాబాద్‌ వంటి వెదర్ కండీషన్ బ్యాటరీలపై ఎలా  ప్రభావం చూపుతాయి?

హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో 35 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉండే రోజులు బ్యాటరీపై అదనపు ప్రభావాన్ని చూపుతాయి. వేడి వాతారణం వల్ల మైల్డ్‌ క్లైమేట్‌ కంటే ఏటా అదనంగా 0.4 శాతం బ్యాటరీ క్షీణత ఉంటుంది. 

అయితే ఆధునిక ఈవీలలో వస్తున్న లిక్విడ్ కూలింగ్, ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీలు అధిక వేడిని సమర్థవంతంగా తట్టుకుంటున్నాయి. దీని వల్ల బ్యాటరీ క్షీణత పెద్దగా పెరగడం లేదు. కాకపోతే 100kW కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న డీసీ ఫాస్ట్‌ ఛార్జర్‌లను నిరంతరం వాడటం వల్ల క్షీణత రేటు  3శాతం వరకు పెరిగే ప్రమాదం ఉంది. 

బ్యాటరీలపై  కంపెనీ ఎంత వారంటీ ఇస్తోంది?

టాటా మోటార్స్‌కు చెందిన నెక్సాన్ ఈవీ, కర్వ్‌ ఈవీ మోడళ్లకు మొదటి యజమానికి లైప్‌టైమ్‌ బ్యాటరీ వారంటీ కల్పిస్తోంది. ఒక వేళ కారును సెకండ్ హ్యాండ్‌లో కొంటే, రెండో యజమానికి 8 సంవత్సరాలు లేదా 1.6 లక్షల కిలోమీటర్ల వారంటీ లభిస్తోంది. 

ఎంజీ, హ్యాందాయ్ సాధారణంగా 8 ఏళ్లు లేదా 1.5 నుంచి 1.6 లక్షల కిలోమీటర్ల వారంటీని ఇస్తున్నాయి. ఈ కాలంలో బ్యాటరీ సామర్థ్యం 70 శాతం నుంచి 80 కంటే తగ్గితే ఉచితంగా రీప్లేస్ చేస్తాయి.