Motorcycle, Scooter, Moped Difference: భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో రవాణా వ్యవస్థకు టూ వీలర్లు వెన్నుముక వంటివి. ప్రతి ఇంటి అవసరానికి, ప్రతి యువకుడి ఆశయానికి,, ప్రతి వ్యాపారి కష్టానికి ఒక టూవీలర్ తోడు ఉంటుంది. అయితే మార్కెట్‌లో ఉన్న వందలాది మోడళ్లలో మోటార్ సైకిల్, స్కూటీ, మోపెడ్ మధ్య ఉన్న తేడాలను గుర్తించడం సామాన్య వాహనదారుడికి తరుచూ గందరగోళంగానే ఉంటుంది. డిజైన్, ఇంజిన్ సామర్థ్యం, వేగం, చట్టపరమైన నిబంధనల పరంగా ఈ వాహనాల మధ్య ఉన్న స్పష్టమైన వ్యత్యాసాలను ఇక్కడ తెలుసుకుందాం
మెటార్ సైకిల్ , బైక్ తేడా ఏంటీ
సాధారణంగా భారతీయ వాడుక భాషలో బైక్, మోటార్ సైకిల్ అనే పదాలు ఒకే అర్థంలో ఉపయోగిస్తారు. సాంకేతికంగా చూస్తే ఇవి మాన్యువల్ గేర్లు కిగిన శక్తిమంతమైన వాహనాలు. వీటికి ప్రధానంగా స్టెప్ ఓవర్ ఫ్రేమ్‌డిజైన్ చేస్తారు. అంటే వాహనం ఎక్కడానికి కాలు పైకి ఎత్తి వేయాల్సి ఉంటుంది.
ఇవి సాధారణంగా 100మమ కంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన ఇంజిన్లతో వస్తాయి. ఇవి గంటలకు 75 మైళ్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించగలవు. దీని వల్ల హైవేలపై, సుదీర్ఘ ప్రయాణాలకు ఇవి అత్యంత అనువైనవి. వీటిలో చక్రాల పరిమాణం పెద్దదిగా ఉంటుంది. ఇది రఫ్ రోడ్లపై, గుంతల్లో ప్రయాణించేటప్పుడు వాహనానికి స్థిరత్వాన్ని ఇస్తుంది. బైక్‌లు సాధారణంగా లీటర్‌కు 50 నుంచి 70 కిలోమీట్ల మైలేజీని అందిస్తాయి. హీరో స్ప్లెండర్, బజాజ్ పల్సర్ వంటి మోడళ్లు ఈ విభాగంలోకి వస్తాయి. వీటి మెయింటెనెన్ ఖర్చు కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ కస్టమైజేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. హైస్పీడ్ వద్ద ఇవి స్టేబుల్‌గా ఉన్నా, ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.
స్కూటీ అంటే ఏంటీ?
భారత్‌లో స్కూటీ అనేది ఒకప్పుడు ఒక బ్రాండ్ పేరు. అయినప్పటికీ ఇప్పుడు అది గేర్‌లెస్ స్కూటర్లన్నింటికీ పర్యాయపదంగా మారిపోయింది. నగరాల్లో ట్రాఫిక్ పెరగడంతో క్లచ్, గేర్ల తిప్పలు లేని స్కూటర్లకు ఆదరణ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం అర్బన్ ఏరియాల్లో స్కూటర్లకు ఆదరణ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం అర్బన్ ఏరియాల్లో స్కూటర్లు 70 శాతం మార్కెట్‌లో వాటాను కలిగి ఉన్నాయి. కాలు పైకి ఎత్తాల్సిన అవసరం లేకుండానే కూర్చోవచ్చు. చిన్న చక్రాలు ఉండం వల్ల సిటీ ట్రాఫిక్‌కు అనుకూలంగా ఉంటాయి. ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో పని చేస్తాయి. అంటే యాక్సిలరేటర్ ఇస్తే సరిపోతుంది. సీటు కింద ఉండే విశాలమైన స్టోరేజ్ స్పేస్ కుటుంబ అవసరాలకు సరిపోతుంది. ఆఫీస్ ప్రయాణాలకు అనువుగా ఉంటుంది. ఇవి 50సీసీ నుంచి 250 సీసీ వరకు వివిధ సామర్థ్యాల్లో లభిస్తాయి. హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్ వంటివి వీటికి ఉదాహరణలు.
మోపెడ్ అంటే ఏంటీ?
తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాన్ని ఆశించే వారికి మోపెడ్ ఒక అద్భుతమైన వరం. మోటార్, పెడల్ అనే పదాల అద్భుత కలయిక నుంచే మోపెడ్ అనే పేరు వచ్చింది. ఒకప్పుడు వీటికి పెడల్స్ ఉండేవి, కానీ ఆధునిక మోపెడ్లు కేవలం ఇంజిన్ శక్తితోనే నడుస్తున్నాయి. మోపెడ్లు లీటర్‌కు 70 నుంచి 100 కిలోమీటర్ల మైలేజీని అందిస్తాయి. ఇవి సాధారణంగా 50 సీసీ కంటే తక్కువ సామర్థ్యం కలిగి ఉండి, గంటకు 25-30 మైళ్ల తక్కువ వేగంతో ప్రయాణిస్తాయి. ఇవి కేవలం నగర ప్రయాణాలకు, సరకు రవాణాకు మాత్రమే పరిమితం అవుతాయి. హైవేలపై అనుమతించరు. వీటి ఖర్చు చాలా తక్కువ. ఇండియాలో టీవీఎస్ ఎక్స్‌ఎల్ సిరీస్ మోపెడ్లు బాగా ప్రజాదరణ పొందాయి.
ఎవరికి ఏ వాహనం మంచిది?
దూర ప్రయాణాలు చేసే వారికి 100 సీసీ పైన ఉండే మోటార్ సైకిల్ అవసరం అవుతుంది. సిటీ ట్రాఫిక్, షాపింగ్, సులభమైన డ్రైవింగ్ కోసం ఆటోమాటిక్ స్కూటర్ సరైన ఎంపిక. తక్కువ బడ్జెట్, భారీ మేలేజీ అవసరమైన వారికి మోపెడ్ ఉత్తమమని చెప్పవచ్చు.
భారత్‌లో రిజిస్ట్రేషన్ అవసరం లేని వాహనాలు ఉన్నాయా?
మోటార్ వెహికల్ చట్టం 1988 ప్రకారం కొన్ని నిబంధనలు ఫ్రేమ్ చేశారు. అందులో గేర్లు లేని వాహనాలు నడపడానికి 16 ఏళ్లు నిండిన వారు లైసెన్స్ పొందవచ్చు. గేర్లు ఉన్న బైక్‌లు నడపడానికి మాత్రం 18 ఏళ్లు నిండి ఉండాలి. 50 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం గల స్కూటర్లు, మోటార్‌సైకిళ్లకు రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా చేయించాలి.
ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం
పర్యావరణం హితానికి, ఇంధన ఖర్చు ఆదా చేయడానికి ఎలక్ట్రిక్ వాహనాలు జోరు పెరిగింది. ముఖ్యంగా స్కూటర్ విభాగంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.