ADAS Technology India: నేటి వేగవంతమైన ప్రపంచంలో ఆటోమొబైల్ రంగం కేవలం ఇంజన్ సామర్థ్యం లేదా మైలేజీకి మాత్రమే పరిమితం కావడం లేదు. ఇప్పుడు అందర దృష్టి సేఫ్టీ, టెక్నాలజీ వైపు మళ్లింది. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా, ఇప్పుడు భారత్‌లో అత్యంత ప్రాచుర్యం పొందుతున్న పదం ADAS(అడ్వాన్స్డ్‌ డ్రైవర్ అసిస్టెన్స్‌ సిస్టమ్‌). కొత్తగా కారు కొనాలని షోరూమ్‌కు వెళ్లే ఎవరికైనా ఈ పదం వినపడకుండా ఉండదు. అసలు ఈ అడాస్‌ అంటే ఏంటీ? ఇది డ్రైవర్‌కు ఎలా సహాయపడుతుంది? భారత్‌లో లభించే కార్లలో ఉండే ఆటోమెషిన్ స్థాయిలేంటీ? అనే అంశాలపై పూర్తిగా తెలుసుకుందాం. 

Continues below advertisement

అడాస్‌ అంటే ఏంటీ? కారుకు కళ్లు, మెదడుగా ఎలా పరిగణిస్తారు?

సరళంగా చెప్పాలంటే, అడాస్ అనేది కారులో ఉండే అధునాతన సాంకేతిక పరికరాల సమూహం. ఇది డ్రైవింగ్‌్ సమయంలో డ్రైవర్‌కు సహాయం చేస్తూ, ప్రమాదాలను తగ్గించడానికి, ప్రయాణాన్ని సులభతరం చేయడానికి రూపొందించారు. మన కళ్లకు బదులుగా ఈ వ్యవస్థ కెమెరాలు, రాడార్‌, లీడార్‌, ఆల్ట్రాసౌండ్‌ సెన్సార్లు ఉపయోగిస్తుంది. ఇవి కారు చుట్టూ ఉన్న  పరిస్థితులను నిరంతరం గమనిస్తూ, సాఫ్ట్‌వేర్ ద్వారా విశ్లేషించి, తక్షణ నిర్ణయాలు తీసుకుంటాయి. ఉదాహరణకు, ముందు ఏదైనా అడ్డంకి వస్తే డ్రైవర్‌ను హెచ్చరించడం లేదా అవసరమైతే ఆటోమేటిక్‌గా బ్రేక్‌ వేయడం వంటివి ఈ వ్యవస్థ ద్వారా సాధ్యమవుతాయి. 

SAE లెవల్స్‌: మీ కారు ఎంత వరకు ఆటోమేటిక్‌?

ప్రపంచవ్యాప్తంగా సొసైటీ ఆఫ్‌ ఆటోమోటివ్‌‌ ఇంజినీర్స్‌(SAE) అనే సంస్థ ఆటోమిషన్ స్థాయిలను 0 నుంచి 5 వరకు వర్గీకరించింది. మీ కారులో ఏ స్థాయి అడాస్‌ ఉందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. లెవల్‌ -0 అంటే ఇందులో కారు ఎటువంటి నియంత్రణను తీసుకోదు. కేవలం ప్రమాదం పొంచి ఉన్నప్పుడు హెచ్చరికలు మాత్రమే ఇస్తుంది. లెవల్‌ -1 ఇందులో కారు ఏదో ఒక పనిని మాత్రమే చేయగలదు. అటే వేగాన్ని నియంత్రించడం, లేదా స్టీరింగ్‌ను సరిచేయడం. లెవల్‌ 2లో ప్రస్తుతం భారత్‌ లోని టాప్ ఎండ్ కార్లలో చూస్తున్నది ఇదే. ఇందులో స్టీరింగ్‌, యాక్సిలరేషన్‌/ బ్రేకింగ్ రెండింటినీ కారు కొంత వరకు నియంత్రించగలదు. లెవల్‌ 3 నుంచి లెవల్‌ 5 వరకు ఉన్న కారు నిజమైన ఆటోనమస్‌ లేదా డ్రైవర్‌ లేని కార్లు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో డ్రైవర్ ప్రమేయం లేకుండా ఇవి ప్రయాణించగలవు. అయితే ఇవి ఇంకా భారత్‌లో విస్తృతంగా అందుబాటులోకి రాలేదు. 

Continues below advertisement

లెవల్‌ 1 vs లెవల్‌ 2; వినియోగదారులు గమనించాల్సిన తేడాలు ఏంటీ?

చాలా మంది వినియోగదారులు లెవల్‌ 1, లెవల్‌ 2 మధ్య గందరగోళాన్ని గురవుతుంటారు. లెవల్‌ 1లో డ్రైవర్ కళ్లు ఎప్పుడూ రోడ్డుపైనే ఉండాలి. ఇది కేవలం స్పీడ్‌ కంట్రోల్‌ వంటి ఫీచర్‌ను మాత్రమే అందిస్తుంది. కానీ లెవల్‌ 2కి వచ్చేసరికి, ఆడాప్టివ్‌ క్రూయిజ్‌ కంట్రోల్‌తో పాటు లేన్ కీప్‌ అసిస్ట్‌ కూడా జతవుతుంది. అంటే కారు తనంతట తానుగా వేగాన్ని పెంచడం తగ్గించంతోపాటు రోడ్డుపై ఉన్న లేన్ల మధ్య ప్రయాణించేలా స్టీరింగ్‌ను కూడా నియంత్రిస్తుంది. దీనిని కొన్ని కంపెనీలు హైవే డ్రైవింగ్ అసిస్ట్‌ అని కూడా అంటారు. అయితే లెవల్‌ 2లో కూడా్రైవర్ నిరంతర అలర్ట్‌గా ఉండాలి. సిస్టమ్‌ పర్యవేక్షణలో ఉండాలి. 

అడాస్‌లోని కీలక ఫీచర్లు- అవి ఎలా పని చేస్తాయి?

ACC అనేది కేవలం స్థిరమైన వేగంతో వెళ్లడమే కాకుండా, ముందున్న వాహనం వేగాన్ని బట్టి మన కారు వేగాన్ని ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేస్తుంది. 

లేక్ కీప్‌ అసిస్ట్‌(LKA) కారు పొరపాటున లేన్ దాటి వెళ్తుంటే స్టీరింగ్‌ను సున్నితంగా తిప్పి కారును తిరిగి లేన్ మధ్యలోకి తీసుకువస్తుంది. 

ఆటోమేటిక్‌ ఎమర్జెన్సీ బ్రేకింగ్(AEB) దీని వల్ల ఏదైనా వాహనం లేదా వ్యక్తి అకస్మాత్తుగా అడ్డం వస్తే, డ్రైవర్ స్పందించక ముందే కారు ఆటోమేటిక్‌గా బ్రేక్ వేసి ప్రమాదాన్ని నివారిస్తుంది. 

బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ కూడా పక్కనే ఉన్న లేన్‌లో మనకు కనపడని ప్రదేశాల్లో వాహనాలు ఉంటే మనల్ని హెచ్చరిస్తుంది. 

ఒకప్పుడు కేవలం లగ్జరీ కార్లకే పరిమితమైన అడాస్ ఇప్పుడు సామాన్యులకు అందుబాటులో ఉన్న కార్లలో కూడా వస్తోంది. మహీంద్ర XUV 700, హ్యూందాయ్‌ క్రెటా, కియా సెల్టోస్, టాటా కార్లలో ఇప్పుడు లెవల్‌ -2 అడాస్‌ ఫీచర్లు ప్రామాణికంగా మారుతున్నాయి. ముఖ్యంగా హైవే ప్రయాణాల్లో అలసట తగ్గించడానికి, భద్రతను పెంచడానికి ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుంది.