Volkswagen Virtus: ఫోక్స్‌వాగన్ మనదేశంలో కొత్త సెడాన్ కారును రివీల్ చేసింది. అదే ఫోక్స్‌వాగన్ వర్ట్యూస్. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ కారును మొదటిసారి ప్రదర్శించారు కూడా. ఇది ఒక మిడ్ సైజ్ సెడాన్. వెంటోను ఇది రీప్లేస్ చేయనుంది. ఇది వెంటో కంటే శక్తివంతమైనది కాకుండా విలాసవంతమైన కారు కూడా.


టైగూన్‌కు దీనికి కొంచెం దగ్గరి పోలికలు ఉన్నాయి. ఈ రెండిటినీ ఒకే ప్లాట్‌ఫాం మీద రూపొందించారు. ఈ ప్లాట్‌ఫాంపై రూపొందించే కార్లను బాగా లోకలైజేషన్ చేయడంతో పాటు ధరను ఇతర బ్రాండ్లతో పోటీ పడేవిధంగా నిర్ణయిస్తారు. భారతదేశంలో కోసమే దీన్ని ప్రత్యేకంగా రూపొందించారు.


వర్ట్యూస్ కొంచెం పెద్ద కారే. దీని పొడవు 4,561 మిల్లీమీటర్లుగా ఉంది. వెడల్పు కూడా ఎక్కువే. ఇక డిజైన్ చూడగానే సన్నని గీతలతో చూడగానే ఫోక్స్‌వాగన్ కారు అని గుర్తుపట్టే విధంగా ఉంది. హెడ్‌ల్యాంప్స్‌ను గ్రిల్స్‌తో మ్యాచ్ చేసిన విధానం చాలా బాగుంది. బంపర్ డిజైన్ కూడా ఇప్పటివరకు వచ్చిన ఫోక్స్‌వాగన్ కార్లన్నిటి కంటే షార్ప్‌గా ఉంది.


ఈ కారు అసలైన సెడాన్ ఆకారంలో ఉంది. వెనకవైపు పెద్ద ల్యాంప్స్ చూస్తే వెంటో కంటే ప్రీమియంగా ఉందని తెలుస్తోంది. జీటీ ట్రిమ్ వేరియంట్‌లో బ్లాక్ డ్యూయల్ టోన్ రూఫ్, రెడ్ బ్రేక్ క్యాలిపర్స్, బ్లాక్ అలోయ్స్ ఇందులో ఉన్నాయి. వర్ట్యూస్ టర్బోచార్జ్‌డ్ పెట్రోల్ వేరియంట్‌తో లాంచ్ కానుంది.


ఇందులో 1.0 లీటర్, 1.5 లీటర్ టర్బోచార్జ్‌డ్ పెట్రోల్ వేరియంట్లను అందించనున్నారు. స్టాండర్డ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు ఆటోమేటిక్ వెర్షన్లు కూడా ఇందులో ఉండనున్నాయి. దీని ఇంటీరియర్ చాలా స్పేషియస్‌గా ఉండనుంది. దీని క్యాబిన్ డిజైన్ కొంచెం టైగూన్‌కు దగ్గరగా ఉండనుంది.


టైగూన్‌లో ఉన్న కొన్ని ఫీచర్లను ఇందులో కూడా అందించారు. సన్‌రూఫ్, వెంటిలేటెడ్ లెదర్ సీట్లు, కనెక్టెడ్ టెక్నాలజీ వంటి ఫీచర్లు రెండిట్లోనూ ఉన్నాయి. వర్ట్యూస్ త్వరలో లాంచ్ కానుంది. స్కోడా స్లేవియా, హోండా సిటీ, హ్యుండాయ్ వెర్నాలతో ఈ కారు పోటీ పడనుంది.


Also Read: Baleno Vs Swift: బలెనో వర్సెస్ స్విఫ్ట్ - బడ్జెట్ కార్లలో ఏది బెస్ట్!


Also Read: ఏకంగా మూడు కొత్త కార్లు లాంచ్ చేయనున్న జీప్ - అదిరిపోయే ఫీచర్లు - ధర కూడా తక్కువగానే!