టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ 2026లో ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. ఇటీవలే నటి రష్మిక మందానను వివాహం చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. ఆయన పెళ్లి కారణాలతో లేటెస్ట్ మూవీ రణబలి షూటింగ్‌కు కాస్త గ్యాప్ తీసుకున్నాడు. తోటి నటి రష్మిక మందానతో ప్రేమ, పెళ్లితో కొన్ని రోజుల కిందట సందడి చేశాడు. రౌడీ భాయ్ విజయ్ కెరీర్ , పర్సనల్ లైఫ్ అప్‌డేట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

Continues below advertisement

ఇటీవల ఓ ఇంటివాడైన విజయ్..టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండకు సంబంధించి విలాసవంతమైన కార్లు, కొత్త సినిమాలు, పెళ్లి ముచ్చట్లు తెలుసుకుందాం. 'రౌడీ' హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన కెరీర్  వ్యక్తిగత జీవితంలో అత్యుత్తమ దశను ఆస్వాదిస్తున్నారు. 2026 ఫిబ్రవరిలో ఆయన లాంగ్ టైం గాళ్‌ఫ్రెండ్, నటి రష్మిక మందానను వివాహం చేసుకున్నారు. కొన్ని రోజుల కిందట వీరి పెళ్లి సెన్సేషన్ అయింది. ఉదయపూర్‌లో అత్యంత వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుకలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొన్నారు. తాజాగా హనీమూన్ ముగించుకుని వచ్చిన ఈ జంట తమ షూటింగ్స్‌తో బిజీ కానుంది. ప్రజెంట్ ఉన్న క‌మిట్మెంట్ల‌కు సంబంధించి ఇద్ద‌రు షూటింగుల్లో మునిగి పోయారు. పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గా సైతం సంపాదిస్తున్న విజయ్ నెట్ వర్త్ 60, 70 కోట్ల వరకు ఉండొచ్చు అని సమాచారం.

అదిరిపోయే కార్ల కలెక్షన్విజయ్ దేవరకొండకు వేగం, లగ్జరీ అంటే ఎంతో ఇష్టం. ఆయన గ్యారేజీలో కొన్ని ఖరీదైన కార్లు ఉన్నాయి. ఆ కార్ల వివ‌రాలు తెలుసుకుందాం.  

Continues below advertisement

BMW 5 Series: నిత్యం నగరం లోపల తిరగడానికి విజయ్ దీనినే వాడుతుంటారు దీని ఖ‌రీదు సుమారు ₹70 లక్షలు అని స‌మాచారం.  Ford Mustang: అమెరికన్ మజిల్ కార్ అంటే విజయ్‌కు ఇష్టం. దీని విలువ దాదాపు ₹75 లక్షలు. Volvo XC90: భద్రతకు మారుపేరైన ఈ లగ్జరీ SUV ధర దాదాపు ₹1 కోటి వరకు ఉంటుంది.

Land Rover Range Rover: సెలబ్రిటీల ఫేవరెట్ అయిన ఈ కారు కూడా ఆయన వద్ద ఉంది. వీటితో పాటు ప్రమోషన్ల కోసం ఆయన ఒక ప్రైవేట్ జెట్‌ను కూడా ఉపయోగిస్తుండటం విశేషం. మొత్తానికి అద్భుత‌మైన కలెక్ష‌న్ ను ఆయ‌న క‌లిగి ఉన్నారు.

 

ప్రస్తుతం సినిమా కెరీర్.. పెళ్లి తర్వాత కూడా అటు  విజయ్, ఇటు ర‌ష్మిక‌ వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. రణబలి (Ranabaali): రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో వస్తున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 11, 2026న విడుదల కానుంది. ఇందులో రష్మిక మందాన హీరోయిన్ కావడం విశేషం. రౌడీ జనార్దన (Rowdy Janardhana): రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఒక మాస్ ఎంటర్టైనర్‌గా ఇది తెరకెక్కుతోంది. గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్: భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్‌లో విజయ్ ఒక శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. గ‌తంలో వీరిద్ద‌రూ కింగ్డ‌మ్ అనే మూవీలో క‌లిసి ప‌ని చేసిన సంగ‌తి తెలిసిందే.  మొత్తానికి, అటు వైవాహిక జీవితాన్ని, ఇటు ప్రొఫెషనల్ కెరీర్‌ను విజయ్ దేవరకొండ బ్యాలెన్స్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.