Vespa New Electric Scooters: పాపులర్ టూవీలర్ కంపెనీ Vespa, ప్రపంచ మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ సిరీస్‌ను పరిచయం చేసింది. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రెట్రో డిజైన్‌ను కొనసాగిస్తూనే, కొత్త ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తో ఈ స్కూటర్లను తీసుకొచ్చింది. మొత్తం మూడు మోడళ్లతో ఈ కొత్త సిరీస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది, అవి - Sprint S, Primavera & Primavera Tech. వీటిలో రెండు మోడళ్లకు 2.3kWh బ్యాటరీ ప్యాక్ ఇవ్వగా, టాప్ మోడల్ Primavera Techలో పెద్ద 4.2kWh బ్యాటరీని అందించారు. ఈ టాప్ వేరియంట్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 కి.మీ. వరకు ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది.
రెట్రో డిజైన్‌తో ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్
Vespa కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఆ కంపెనీకి ప్రత్యేక గుర్తింపు అయిన రెట్రో డిజైన్ స్టైల్‌ను కొనసాగించాయి. పెట్రోల్ వెర్షన్లతో పోలిస్తే ఎగ్జాస్ట్ లేకపోవడమే ప్రధానమైన తేడా. ఈ మూడు స్కూటర్లలోనూ మోనోకాక్ ఛాసిస్‌ను ఉపయోగించారు. అలాగే ICE మోడళ్లలో కనిపించే ట్రైలింగ్ లింక్ ఫ్రంట్ సస్పెన్షన్‌ను కొనసాగించారు.
Sprint S & Primavera మోడళ్లలో 2.3kWh కెపాసిటీ గల రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. వీటిలో 3.1kW మోటార్ అమర్చారు. ఇది 2.7kW నిరంతర శక్తిని అందిస్తుంది. గరిష్ఠ టార్క్ 200Nmగా ఉంది. ఈ రెండు స్కూటర్ల గరిష్ఠ వేగం గంటకు 45 కి.మీ. ఒక్కసారి ఛార్జ్ చేస్తే, WMTC ప్రమాణాల ప్రకారం, 68 కి.మీ. ప్రయాణించవచ్చు.
500W ఛార్జర్‌తో బ్యాటరీని 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి సుమారు నాలుగు గంటలు పడుతుందని కంపెనీ వెల్లడించింది. బ్యాటరీ అమర్చిన తర్వాత ఈ రెండు స్కూటర్ల బరువు 111 కిలోలు.
ఇది కూడా చదవండి: TVS RTR 125 LC Bike: టీవీఎస్ నుంచి నాలుగు కొత్త టూవీలర్లు.. వాటిలో మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లే
Primavera Techలో పెద్ద బ్యాటరీ
ఈ కొత్త సిరీస్‌లో Primavera Tech టాప్ మోడల్‌గా నిలుస్తుంది. ఇందులో 4.2kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. దీని మోటార్ 3.6kW నిరంతర శక్తిని ఉత్పత్తి చేస్తుంది. పెద్ద బ్యాటరీ కారణంగా WMTC ప్రమాణాల ప్రకారం 80 కి.మీ. రేంజ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
ఫీచర్ల విషయానికి వస్తే.. Primavera Techలో 4.3 అంగుళాల TFT డిస్‌ప్లే ఉంటుంది. దీనికి స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్ సదుపాయాలు ఉన్నాయి. నావిగేషన్ సేవలు మొదటి మూడు సంవత్సరాలు ఉచితంగా లభిస్తాయి. ఆ తర్వాత వాటిని కొనసాగించాలంటే రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. కీ లెస్ ఇగ్నిషన్, ఫైండ్ మై స్కూటర్ ఫీచర్ కూడా ఉన్నాయి. రైడర్ అవసరానికి అనుగుణంగా Eco & Power అనే రెండు రైడింగ్ మోడ్‌లను ఎంచుకోవచ్చు. ఈ స్కూటర్ బరువు 130 కిలోలు.
మూడు మోడళ్లలోనూ సాధారణ ఫీచర్లు
ఈ మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లలోనూ Vespa ప్రత్యేక డిజైన్‌తో పాటు ఆల్ LED లైటింగ్ అందించారు. వీటికి 12/11 వీల్ సెటప్ ఉంది. ముందు భాగంలో 110 సెక్షన్, వెనుక భాగంలో 120 సెక్షన్ టైర్లను అమర్చారు. బ్రేకింగ్ కోసం ముందు 200mm డిస్క్, వెనుక 140mm డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. అయితే Primavera Techలో అదనంగా సింగిల్ ఛానల్ ABS అందించారు.
ఇది కూడా చదవండి: గత నెలలో ఈ కార్ల కోసం జనం క్యూ కట్టారు.. టాప్ 10 లిస్ట్‌లో 7 మోడళ్లు మారుతి సుజుకీవే
భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే?
ప్రస్తుతం Vespa భారత్‌లో 125, S వంటి పెట్రోల్ స్కూటర్లను విక్రయిస్తోంది. అయితే ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను భారత మార్కెట్లో విడుదల చేసే విషయంపై కంపెనీ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. ఒకవేళ వీటిని భారత్‌కు తీసుకొస్తే.. డిజైన్, నిర్మాణ శైలి పరంగా Bajaj Chetak శ్రేణికి గట్టి పోటీ ఇవ్వవచ్చు. అంతేకాదు.. Hero, TVS, Honda, Suzuki వంటి సంప్రదాయ ద్విచక్ర వాహన సంస్థల ఎలక్ట్రిక్ స్కూటర్లతో పాటు Ather, River వంటి స్టార్టప్ కంపెనీల మోడళ్లతోనూ పోటీ పడాల్సి ఉంటుంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
