• ఒకే రాష్ట్రంలో కారు ఓనర్‌షిప్‌ మార్చడానికి ప్రభుత్వ ఫీజులు కేవలం 500 నుంచి 600 మధ్య ఉంటుంది.. 
  • వాహనంపై పెండింగ్‌ చలాన్లు, బ్లాక్‌లిస్ట్‌ రికార్డులు, ఇంజిన్ ఛాసీస్‌ నెంబర్లను కొనే ముందే సరిచూసుకోవడం అత్యంత కీలకం. 
  • వంద రూపాయల స్టాంప్ పేపర్‌పై సేల్‌ అగ్రిమెంట్‌ రాసుకోవడం ద్వారా భవిష్యత్‌లో వచ్చే చట్టపరమైన చిక్కుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. 

యూజ్డ్ కార్ల మార్కెట్‌కు భారీ డిమాండ్

సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్‌లో తక్కువ ధరకు నచ్చిన మోడల్‌ దొరికినప్పుడు కలిగే సంతోషం అంతాఇంతా కాదు. కానీ ఆ వాహనాన్ని చట్టబద్ధంగా మీ పేరు మీదకు మార్చుకోకపోతే, ఆ సంతోషం కాస్త పెద్ద తలనొప్పిగా మారే ప్రమాదం ఉంది. ఆర్సీ ట్రాన్స్‌ఫర్‌ అనేది కేవలం కాగితపు పని మాత్రమే కాదు, అది వాహనంపై మీకు పూర్తి యాజమాన్య హక్కును కల్పిస్తుంది. 

Continues below advertisement

ఎంత ఖర్చు అవుతుంది?

చాలా మంది బ్రోకర్లు లేదా ఏజెంట్లు ఆర్సీ బదలీ కోసం వేల రూపాయలు  డిమాండ్‌ చేస్తుంటారు. కానీ వాస్తవ ధరలు చాలా తక్కువ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఒకే రాష్ట్ర పరిధిలో కారు బదిలీకి అయ్యే ప్రాథమిక ఫీజు సుమారు 300 నుంచి 500 వరకు ఉంటుంది. దీనికి తోడు స్మార్ట్ కార్డ్ కోసం 200, పోస్టల్‌ ఛార్జీల కోసం మరో యాభై రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే మొత్తం మీద 550 రూపాయలు నుంచి 600లోపే మీ పని పూర్తి అవుతుంది. అయితే 14 రోజుల గడువు దాటితే వెయ్యి పెనాల్టీ పడే అవకాశం ఉంది. 

రాష్ట్రం మారితే లెక్క మారుతుందా?

ఒక వేళ మీరు పక్క రాష్ట్రం నుంచి కారు కొని తెచ్చుకుంటే ఖర్చులు భారీగా పెరుగుతాయి. ముందుగా పాత రాష్ట్ర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవడం తప్పనిసరి. మీ రాష్ట్ర నిబంధనలను బట్టి కారు వయసుపై 9 శాతం నుంచి 15శాతం వరకు రీ రిజిస్ట్రేషన్ రోడ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. దీని వల్ల ఇంటర్‌ స్టేట్ ట్రాన్స్‌ఫర్ ఖర్చు 3000 నుంచి 10వేల దాటే అవకాశం ఉందని గమనించాలి. 

Continues below advertisement

మోసాలు నుంచి ఎలా కాపాడుకోవాలి?

సెకండ్‌ హ్యాండ్‌ రంగంలో పేపర్‌  వర్క్ సరిగ్గా లేకపోతే కోర్టులు, పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. ముందుగా పరివాహన్ వెబ్‌సైట్‌ లేదా యాప్‌ ద్వారా వాహనంపై ఏవైనా పెండింగ్‌ చలాన్లు ఉన్నాయో అనేది తనిఖీ చేయండి. చలాన్లు క్లియర్ చేయకుండా ఆర్టీవో పోర్టల్‌ మీ ట్రాన్స్‌ఫర్‌ అప్లికేషన్ అస్సలు ప్రాసెస్ చేయదు. అలాగే కారు బోనెట్‌ లోపల ఉండే ఇంజన్, చేసిన నంబర్లను ఆర్సీ కార్డుపై ఉన్న నెంబర్లతో స్వయంగా సరిపోల్చుకోండి. 

లోన్, బ్యాంక్ ఎన్‌వోసీ

కారు ఆర్సీపై హైపోథికేటెడ్‌ టు అని ఉంటే ఆ వాహనంపై ఇంకా బ్యాంక్‌ లోన్ ఉన్నట్టు అర్థం. అమ్మే వ్యక్తి లోన్ క్లియ్ చేసి బ్యాంక్ నుంచి ఫామ్‌ 35 ఎన్‌వోసీ తెచ్చారో లేదో కచ్చితంగా చూడాలి. బ్యాంక్‌ ఎన్‌వోసీ లేకపోతే ఆర్టీవో కార్యాలయం ఆర్సీని మీ పేరు మీదకు మారదు. లోన్ క్లియర్ అయిన తర్వాత హైపోథెకేషన్ రద్దు చేయడానికి వంద నుంచి రెండు వందల రూపాయల  ఫీజు చెల్లించాలి. 

సేల్ అగ్రిమెంట్‌ అవసరం 

కారుకు డబ్బులు ఇచ్చే సమయంలో కేవలం మాటల మీద ఆధారపడకుండా వంద రూపాయలు స్టాంప్ పేపర్‌పై పక్కాగా ఒప్పందం రాసుకోండి. అందులో కారు ఏ రోజు ఏ సమయానికి మీకు అప్పగించారనేది స్పష్టంగా ఉండాలి. దీని వల్ల మీరు కారు తీసుకున్న సమయం కంటే ముందు జరిగిన ప్రమాదాలకు మీరు బాధ్యులు కాకుండా ఉంటారు. అమ్మే వ్యక్తి ఆధార్, పాన్‌కార్డు వివరాలు ఆర్సీలోని వివరాలతో మ్యాచ్ అవుతున్నాయో లేదో చూడండి. 

ఇన్సూరెన్స్‌, పీయూసీ

ఆర్సీ బదిలీతోపాటు ఇన్సూరెన్స్‌ను కూడా మీ పేరు మీదకు మార్చుకోవడం మర్చిపోకండి. కారు మీ పేరు మీదు మారిన 14 రోజుల్లోపు ఇన్సూరెన్స్‌ ఎండార్‌మెంట్‌ ప్రక్రియ పూర్తి చేయాలి. అలాగే వాహనానికి కాలుష్య నియంత్రణ పత్రం కూడా రన్నింగ్‌లో ఉండాలి. మెకానిక్‌తో ఇంజన్, బ్రేక్స్‌, అండర్‌బాడీని కసారి తనిఖీ చేయించడం ఎప్పుడూ మంచిది. 

పరివాహన్ ద్వారా ఆన్‌లైన్ సేవలు 

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పరివాహన్ పోర్టల్ ద్వారా ఈ ప్రక్రియను చాలా సులభతరం చేసింది. దళారులను ఆశ్రయించకుండా మీ ఆధార్‌ కార్డు సహాయంతో ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. టీ-యాప్‌ పోలియో వంటి ప్రభుత్వం యాప్స్‌ కూడా ఈ సేవల కోసం ఉపయోగపడతాయి. సరైన పత్రాలు ఉంటే ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే పనులు పూర్తవుతాయి.