టూ వీలర్ రంగంలో తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్. ఈ కంపెనీ నుంచి వచ్చే బైకులకు వినియోగదారులలో మంచి క్రేజ్ ఉంది. త్వరలో ఈ కంపెనీ హంటర్ 450 పేరుతో సరికొత్త బైక్ ను మార్కెట్లోకి తీసుకురాబోతోంది.


రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 450 ఇంజిన్ ప్రత్యేకతలు


కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 450 cc లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌తో రాబోతోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రస్తుతం 450 cc, 650 cc మోటార్‌సైకిళ్లపై పని చేస్తోంది. వాటిలో కొన్ని ఇప్పటికే భారత్ సహా విదేశాల్లో పరీక్షించబడ్డాయి. పవర్‌ట్రెయిన్ సుమారు 40 bhp, 40 Nm గరిష్ట టార్క్‌ ను కలిగి ఉండబోతోంది. ఇది స్లిప్పర్ క్లచ్ సహాయంతో ఆరు-స్పీడ్ ట్రాన్స్‌ మిషన్‌తో అనుసంధానించబడి ఉంటుంది. ఇది పెద్ద చక్రాలు, అడ్జస్టబుల్ లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్, ఇతర కొత్త ఫీచర్లతో ఎక్కువ ప్రీమియం లుక్ ను కలిగి ఉంటుంది.డ్యూయల్-పర్పస్ అడ్వెంచర్ టూరర్ ఈ ఏడాది చివర్లో వచ్చే మొదటి 450 cc మోటార్‌ సైకిల్ అవుతుంది. దీనిని హిమాలయన్ 450 అని పిలిచే అవకాశం ఉంది. దీని తర్వాత 2024లో స్క్రాంబ్లర్ వచ్చే అవకాశం ఉంది.


అత్యంత స్పోర్టీస్‌గా కనిపించే రాయల్ ఎన్‌ఫీల్డ్


రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 450 ఇప్పటికే పలు మార్లు అనేక పరీక్షలు జరుపుకుంది. ఈ బైక్ రెట్రో-లేటెస్ట్ డిజైన్ ను కలిగి ఉంటుంది. వృత్తాకార LED హెడ్‌ల్యాంప్‌ను కలిగి ఉంటుంది.  అయితే, షార్ప్ టర్న్ ఇండికేటర్‌లు,  హారిజొంటల్  టెయిల్ ల్యాంప్ కూడా LEDతో రానుంది. వచ్చే ఏడాది భారత్‌లోకి వచ్చిన తర్వాత ఇది అత్యంత స్పోర్టీస్‌గా కనిపించే రాయల్ ఎన్‌ఫీల్డ్ అవుతుంది. స్క్రాంబ్లర్ అప్పీల్ ప్యాటర్న్ రబ్బరుతో కూడిన అదిరిపోయే బ్యాక్ టైర్‌తో వస్తుంటది. ఇది టార్మాక్‌,  బీట్ పాత్‌  రైడింగ్‌లో సహాయపడుతుంది. ఇది పొడవాటి సీటు ఎత్తు, మెరుగైన సౌలభ్యం కోసం రైడర్ సీటింగ్ ప్రాంతంలో కొంచెం వంపు ఉన్నట్లు కనిపిస్తుంది. వెడల్పాటి హ్యాండిల్‌బార్ సెటప్, కొద్దిగా వెనుకకు సెట్ చేయబడిన ఫుట్‌పెగ్‌లు  రైడర్ ట్రయాంగిల్‌ను నిర్ధారిస్తాయి.


హిమాలయన్ 450 మాదిరిగా ఫ్లోటింగ్ ఫుల్-డిజిటల్ యూనిట్‌


రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 450  హిమాలయన్ 450లో మాదిరిగానే అండర్‌ పిన్నింగ్‌లను కలిగి ఉంటుంది.  సాంప్రదాయ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్ సెటప్‌ను కలిగి ఉండవచ్చు. ఫైనల్ ప్రొడక్షన్ మోడల్‌లో మోనోషాక్ రియర్ సస్పెన్షన్ అమర్చబడి ఉంటుంది. దాని అడ్వాన్స్ సిబ్లింగ్‌లో ఈ విషయం గుర్తించబడింది.  క్రోమ్డ్ రియర్‌వ్యూ మిర్రర్స్, హిమాలయన్ 450లో కనిపించే ఫ్లోటింగ్ ఫుల్-డిజిటల్ యూనిట్‌ను పోలి ఉండే ఆధునిక డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సైడ్-మౌంటెడ్ ఎగ్జాస్ట్ సిస్టమ్, రెండు వైపులా 17-అంగుళాల బ్లాక్ అల్లాయ్ వీల్స్, ముందు,  వెనుక డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. డ్యూయల్-ఛానల్ ABS సిస్టమ్ ను కలిగి ఉంటుంది. మరి మీకు ఈ బైక్ కూడా ఈ బైక్ కొనాలని ఉందా? అయితే, ఒక్క ఏడాది పాటు వేచి చూడాల్సిందే. 


Read Also: బజాజ్ పల్సర్ మళ్లీ వచ్చేస్తోంది - లుక్, ఫీచర్స్ అదుర్స్, ధర ఎంతంటే..