Upcoming River Electric Scooters: బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ రివర్ (River) నుంచి త్వరలో కొత్త స్కూటర్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కంపెనీ విక్రయిస్తున్న ఇండీ (River Indie) స్కూటర్, తన ప్రత్యేకమైన డిజైన్‌తో ఇప్పటికే మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే, ఇప్పటివరకు ఇదొక్కటే మోడల్‌ను విక్రయిస్తున్న రివర్.. ఇక కొత్త ఉత్పత్తులపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లుగా భావిస్తున్న టెస్ట్ మ్యూల్స్ (టెస్టింగ్‌లో ఉన్న కొత్త స్కూటర్లు) రోడ్డుపై కనిపించాయి. వీటి ఫోటోలు బయటకు రావడంతో కొత్త మోడళ్లపై ఆసక్తి పెరిగింది.

Continues below advertisement

 RX02, RX03 పేర్లతో రెండు కొత్త స్కూటర్లు?

రివర్ సంస్థ RX02, RX03 అనే అంతర్గత కోడ్ నేమ్స్‌తో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను రూపొందిస్తున్నట్లు సమాచారం. తాజాగా కనిపించిన టెస్ట్ మ్యూల్స్‌లో ఇవి ఒకటా? లేక రెండు వేర్వేరు మోడళ్లా? అనేది ఇంకా స్పష్టంగా తెలియదు.

Continues below advertisement

టెస్ట్ మ్యూల్‌ను పరిశీలిస్తే ప్రస్తుత ఇండీ స్కూటర్ డిజైన్ లక్షణాలు చాలా వరకు కనిపిస్తున్నాయి. పెద్ద బాడీ డిజైన్, ఫ్లాట్ ఫ్లోర్‌బోర్డ్, ట్విన్ షాక్ అబ్జార్బర్లు, స్వింగ్‌ఆర్మ్ వంటి భాగాలు ఇండీ మోడల్‌ను పోలి ఉన్నాయి. వెనుక భాగంలో కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా టెయిల్ ల్యాంప్ డిజైన్ కొత్తగా ఉంది. ఇది  Ather Rizta, TVS Orbiter స్కూటర్లలో కనిపించే తరహా డిజైన్‌ను పోలి ఉంది. అలాగే వెనుక భాగంలో కొత్త లగేజ్ ర్యాక్‌ను కూడా ఏర్పాటు చేశారు.

 ఇండీతో పోలిస్తే మరింత చిన్నగా ఉండే అవకాశం

టెస్ట్ మ్యూల్‌లో బాడీ ప్యానెల్స్ మొత్తాన్ని కవర్ చేశారు. అందువల్ల అసలు డిజైన్‌లో ఎలాంటి మార్పులు చేశారో స్పష్టంగా తెలియడం లేదు. అయితే, బయటకు వచ్చిన ఫోటోలను బట్టి చూస్తే కొత్త స్కూటర్ ప్రస్తుత ఇండీ కంటే కొంత చిన్నదిగా కనిపిస్తోంది. రివర్ తయారు చేసిన Yamaha EC-06 మోడల్‌కు దగ్గరగా ఉండే పరిమాణం ఉండవచ్చని అంచనా. EC-06 కూడా ఇండీ ఆధారంగా రూపొందిన స్కూటరే. అయితే, ఇందులో డిజైన్, కొలతల్లో మార్పులు చేశారు.

ఇది కూడా చదవండి: క్రికెటర్ శివమ్ దూబే కొత్త కారు ఇదే.. 286 bhp పవర్, 679 కి.మీ రేంజ్, అదిరిపోయే అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు!

హెడ్‌ల్యాంప్ ఎలా ఉంటుందో ప్రస్తుతం బయటపడలేదు. ముందు ఆప్రాన్, డిస్‌ప్లే, మిర్రర్లు, వెనుక ఇండికేటర్లు మాత్రం ప్రస్తుత ఇండీ మోడల్‌లో ఉన్నవాటినే పోలి కనిపిస్తున్నాయి. అయితే, ఇవి కేవలం టెస్టింగ్ వాహనాల్లో ఉపయోగించిన భాగాలే కావచ్చని, తుది మోడల్‌లో మార్పులు ఉండవచ్చని భావిస్తున్నారు.

 కొత్త లగేజ్ యాక్సెసరీలకు అవకాశం?

కొత్త టెస్ట్ మ్యూల్‌లో కనిపించిన లగేజ్ ర్యాక్ మరో ఆసక్తికర అంశం. రివర్ తన కొత్త స్కూటర్లతో పాటు అదనపు యాక్సెసరీలను కూడా అందించే అవకాశం ఉంది. ముఖ్యంగా హార్డ్ ప్యానియర్స్ వంటి లగేజ్ సదుపాయాలను ప్రవేశపెట్టే ఆలోచనలో కంపెనీ ఉండవచ్చని అంచనా. ఇండీ స్కూటర్‌లో యుటిలిటీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన రివర్.. కొత్త మోడళ్లలోనూ అదే విధానాన్ని కొనసాగించే అవకాశం ఉంది. అయితే, 

 2027 తొలి మూడు నెలల్లో ప్రకటన!

ప్రస్తుతం రివర్ నుంచి కొత్త స్కూటర్ల విడుదల తేదీ, ఫీచర్లు, బ్యాటరీ సామర్థ్యం, రేంజ్, ధర వంటి వివరాల గురించి అధికారిక ప్రకటన లేదు. టెస్ట్ మ్యూల్స్ రోడ్లపై కనిపించడం ప్రారంభమైన నేపథ్యంలో, 2027 తొలి మూడు నెలల్లో కొత్త మోడళ్ల గురించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని అంచనా.

ఇది కూడా చదవండి: హ్యుందాయ్ వెర్నాకు భారత్ NCAPలో 5 స్టార్ రేటింగ్.. పెద్దలతో పాటు పిల్లల భద్రతలోనూ 5 స్టార్లు

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.