Upcoming SUVs Launches 2026: ఇండియాలో మిడ్‌సైజ్‌ SUV సెగ్మెంట్‌ ఎప్పుడూ హాట్‌గానే ఉంటుంది. Hyundai Creta, Kia Seltos, Maruti Grand Vitara లాంటి మోడల్స్‌ ఈ సెగ్మెంట్‌ను ఏళ్లుగా లీడ్‌ చేస్తున్నాయి. 2025లో Maruti Suzuki Victoris, Tata Sierra లాంచ్‌లతో పోటీ మరింత పెరిగింది. ఇకపై, 2026లో ఈ సెగ్మెంట్‌లో అసలు రచ్చ మొదలవనుంది. కొత్త జనరేషన్‌ మోడల్స్‌, పాపులర్‌ బ్రాండ్‌ రీఎంట్రీలు, కీలక ఫేస్‌లిఫ్ట్‌లు వరుసగా రానున్నాయి.

Continues below advertisement

New Kia Seltos –  న్యూ జనరేషన్‌

2026 జనవరి 2న కొత్త తరం Kia Seltos ధరలు వెల్లడించనున్నారు. కొత్త K3 ప్లాట్‌ఫామ్‌పై రూపొందిన ఈ SUV సైజ్‌లో పెద్దదిగా మారింది. డ్యూయల్‌ 12.3 అంగుళాల స్క్రీన్లు, 5 అంగుళాల AC కంట్రోల్‌ డిస్‌ప్లే, మెమరీ ఫంక్షన్‌తో పవర్డ్‌ డ్రైవర్‌ సీటు వంటి ఫీచర్లు ఆకట్టుకుంటాయి. ఇంజిన్‌ ఎంపికల్లో 1.5 లీటర్‌ పెట్రోల్‌, టర్బో పెట్రోల్‌, డీజిల్‌ కొనసాగుతాయి. 2027లో హైబ్రిడ్‌ వేరియంట్‌ కూడా వచ్చే అవకాశం ఉంది.

Continues below advertisement

Mahindra XUV 7XO – ఫ్లాగ్‌షిప్‌ అప్‌డేట్‌

Mahindra XUV700కి ఫేస్‌లిఫ్ట్‌గా రానున్న XUV 7XO... 2026 తొలి త్రైమాసికంలో లాంచ్‌ అవుతుంది. ట్రిపుల్‌ స్క్రీన్‌ సెటప్‌, ఎలక్ట్రిక్‌ బాస్‌ మోడ్‌, ప్యానోరామిక్‌ సన్‌రూఫ్‌, కస్టమైజ్‌ చేసుకునే అంబియంట్‌ లైటింగ్‌ దీని ప్రత్యేకత. 2.0 లీటర్‌ టర్బో పెట్రోల్‌, 2.2 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ ఆప్షన్లు కొనసాగుతాయి.

Renault Duster – డస్టర్‌ రీఎంట్రీ

ఒకప్పుడు ఇండియన్‌ మార్కెట్‌లో హిట్‌ అయిన Renault Duster.. 2026 జనవరి 26న రీఎంట్రీ ఇస్తుంది. మూడో తరం డస్టర్‌ మరింత ప్రీమియం డిజైన్‌, అప్‌మార్కెట్‌ ఇంటీరియర్‌తో రానుంది. 1.3 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ ప్రధానంగా ఉండే అవకాశం ఉంది. భవిష్యత్తులో హైబ్రిడ్‌ వేరియంట్‌ కూడా రావచ్చు.

Nissan Tekton – డస్టర్‌కు ప్రత్యర్థి

Renault Duster లాంచ్‌ తర్వాత Nissan తన కొత్త Tekton SUVని పరిచయం చేయనుంది. Patrol SUV నుంచి ప్రేరణ పొందిన డిజైన్‌, C-షేప్‌ LED DRLs, కనెక్టెడ్‌ టెయిల్‌ల్యాంప్స్‌ దీని హైలైట్స్‌. ఇంజిన్‌ పరంగా డస్టర్‌ ప్లాట్‌ఫామ్‌ ఆధారంగా ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది.

Skoda Kushaq & Volkswagen Taigun – ఫేస్‌లిఫ్ట్‌లు

2026లో Skoda Kushaq, Volkswagen Taigun రెండూ ఫేస్‌లిఫ్ట్‌తో రానున్నాయి. ఫుల్‌ విడ్త్‌ LED లైట్‌బార్‌, కొత్త బంపర్లు, ప్యానోరామిక్‌ సన్‌రూఫ్‌, ADAS, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు జోడిస్తారు. ఇంజిన్‌ ఆప్షన్లు మారకపోయినా, కొత్త ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ రావచ్చు.

Honda Elevate – అప్‌డేట్‌ అవసరం

Honda Elevate కూడా 2026లో ఫేస్‌లిఫ్ట్‌తో రానుంది. కొత్త ఫ్రంట్‌, రియర్‌ డిజైన్‌, రిఫ్రెష్‌ చేసిన డ్యాష్‌బోర్డ్‌, మరిన్ని ఆధునిక ఫీచర్లతో ఈ SUV మరింత ఆకర్షణీయంగా మారనుంది.

మొత్తంగా చూస్తే, 2026లో మిడ్‌సైజ్‌ SUV కొనాలనుకునే వారికి ఆప్షన్ల కొరత ఉండదు. కొత్త మోడల్స్‌, పాతవాటికి తాజా అప్‌డేట్‌లు కలిసి ఈ సెగ్మెంట్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లనున్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.