Upcoming 7 Seater SUVs: డీజిల్ వాహనాలు అనేక దశాబ్దాలుగా భారతీయ కార్ల కొనుగోలుదారులకు ఆకర్షణీయమైన ఆప్షన్లుగా ఉన్నాయి. ఈ ఇంజన్లు వాటి టార్క్, పవర్, ఇంధన సామర్థ్యం కోసం ఎల్లప్పుడూ ఇష్టపడతాయి. అయితే కఠినమైన ఎమిషన్ రూల్స్, 10 ఏళ్ల డీజిల్ కార్లపై నిషేధం, పెట్రోల్ మోటార్ల మెరుగైన మైలేజీ తర్వాత ప్రజల ప్రాధాన్యతలు మారుతున్నాయి. మారుతి సుజుకి, హోండా వంటి కారు కంపెనీలు ఇప్పటికే డీజిల్ ఇంజిన్‌లను తమ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియో నుంచి పూర్తిగా తొలగించాయి.
హ్యుందాయ్, టాటా, మహీంద్రా ఇప్పటికీ డీజిల్‌తో నడిచే కార్లను తయారు చేస్తున్న కొన్ని కంపెనీలలో ఉన్నాయి. మీరు 7 సీటర్ డీజిల్ ఎస్‌యూవీని కొనుగోలు చేయాలనుకుంటే ఈ సంవత్సరం అలాంటి మూడు కొత్త మోడల్‌లు మార్కెట్లోకి రానున్నాయి. రాబోయే ఈ 7 సీటర్ డీజిల్ ఎస్‌యూవీల గురించి తెలుసుకుందాం.
హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ (Hyundai Alcazar Facelift)
2024 హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ విక్రయాలు మే లేదా జూన్ నుంచి ప్రారంభం అవుతాయి. అప్‌డేట్ అయిన క్రెటా, క్రెటా ఎన్ లైన్ తర్వాత ఇది ఈ సంవత్సరం కంపెనీ చేయనున్న మూడో ప్రొడక్ట్ లాంచ్ అవుతుంది. అప్‌డేట్ అయిన అల్కజార్ నుంచి కొన్ని డిజైన్ డిటైల్స్‌ను కొత్త క్రెటా నుంచి తీసుకున్నారు. అప్‌డేట్ చేసిన గ్రిల్, బంపర్, డీఆర్‌ఎల్‌తో చేసిన హెడ్‌ల్యాంప్‌లను చూడవచ్చు. కొత్త అల్లాయ్ వీల్స్ కాకుండా సైడ్ ప్రొఫైల్ చాలా వరకు అలాగే ఉంటుంది. ఇది కొత్త క్రెటా వంటి డ్యాష్‌బోర్డ్‌ను కలిగి ఉంటుంది. దీని ఇంటీరియర్ థీమ్, సీట్ అప్‌హోల్స్ట్రీ కూడా కొత్తగా ఉండవచ్చు. అలాగే ఇది లెవెల్ 2 ఏడీఏఎస్ టెక్నాలజీతో మార్కెట్లోకి వచ్చింది. అయితే దీని ఇంజన్ సెటప్‌లో ఎటువంటి మార్పు ఉండదు. ఇది 1.5 లీటర్ 4 సిలిండర్ టర్బో డీజిల్, 2.0 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌లతోనే మార్కెట్లోకి రానుంది.
ఎంజీ గ్లోస్టర్ ఫేస్‌లిఫ్ట్(MG Gloster Facelift)
7 సీటర్ డీజిల్ ఎస్‌యూవీ కోసం చూస్తున్న కొనుగోలుదారులకు ఎంజీ గ్లోస్టర్ ఫేస్‌లిఫ్ట్ మంచి ఆప్షన్. ఇది 2024 సెకండాఫ్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో చాలా బ్యూటీ ఛేంజెస్ ఫ్రంట్ ఎండ్‌లో చేయవచ్చని భావిస్తున్నారు. ఎస్‌యూవీ పెద్ద ఫ్రంట్ గ్రిల్‌తో నిలువుగా అమర్చిన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లతో కనెక్ట్ చేసిన ఎల్ఈడీ డీఆర్ఎల్స్, అప్‌డేట్ చేసిన ఫ్రంట్ బంపర్‌ని కలిగి ఉంటుంది. క్యాబిన్ లోపల కొన్ని అప్‌గ్రేడ్‌లు జరిగే అవకాశం ఉంది. ఇందులో కొత్త కలర్ థీమ్చ అప్హోల్స్టరీ ఉన్నాయి. 2024 ఎంజీ గ్లోస్టర్ ఫేస్‌లిఫ్ట్ 4డబ్ల్యూడీ లేఅవుట్‌తో 2.0 లీటర్ ట్విన్ టర్బో డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో పాటు ఆర్‌డబ్ల్యూడీ సెటప్‌తో 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది.
కొత్త తరం టయోటా ఫార్చ్యూనర్ (New Toyota Fortuner)
కొత్త తరం టయోటా ఫార్చ్యూనర్ ఈ ఏడాది చివర్లో గ్లోబల్ మార్కెట్లోకి రానుంది. ఆ తర్వాత భారతదేశంలో లాంచ్ కానుంది. డిజైన్, ఫీచర్లు, మెకానిజం పరంగా ఈ ఎస్‌యూవీలో చాలా మార్పులు కనిపించనున్నాయి. 2024 టయోటా ఫార్చ్యూనర్ ఐఎంవీ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉండనుంది. ఇది మల్టీపుల్ బాడీ టైప్స్, ఇంజిన్‌లకు (ఐసీఈ, హైబ్రిడ్‌తో సహా) సపోర్ట్ ఇస్తుంది. ఎస్‌యూవీ కొత్త జెన్ మోడల్‌లో 48వీ మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో 2.8 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ ఉండనుంది. కొత్త ఫార్చ్యూనర్‌లో ఏడీఏఎస్ టెక్నాలజీ కూడా ఉంటుందని నివేదికలు సూచిస్తున్నాయి.