Up To Rs 90000 Discount On Renault Kwid: ఇండియాలో, చవకైన & ఎక్కువ మైలేజ్ వాహనాలకే మార్కెట్‌ ఉంటుంది. భారతీయుల నాడిని పట్టుకున్న రెనాల్ట్‌ కార్‌ కంపెనీ, తక్కువ బడ్జెట్‌లో స్టైలిష్, ఎక్కువ ఫీచర్లు & సురక్షితమైన కార్లను లంచ్‌ చేస్తోంది. సరిగ్గా ఇదే లక్షణాలు ఉన్న కార్‌ కావాలని మీరు కోరుకుంటే, రెనాల్ట్ క్విడ్ మీకు బెస్ట్‌ ఆప్షన్‌ కావచ్చు. అంతేకాదు, ఈ నెలలో, రెనాల్ట్‌ కంపెనీ క్విడ్‌ మోడల్‌ మీద బంపర్‌ డిస్కౌంట్‌ అందిస్తోంది. అంటే, బెస్ట్‌ కార్‌ను మరింత చీప్‌గా కొనే టైమ్‌ నడుస్తోంది.

రెనాల్ట్ క్విడ్‌పై ఎంత డిస్కౌంట్ లభిస్తుంది?2025 మే నెలలో రెనాల్ట్ క్విడ్‌పై "గ్రేట్‌ డిస్కౌంట్ ఆఫర్" లైవ్‌లో ఉంది. కస్టమర్‌లు MY 2024 మోడల్‌పై 90,000 రూపాయల వరకు డిస్కౌంట్‌ పొందవచ్చు. రూ. 50,000 క్యాష్‌ డిస్కౌంట్‌ & రూ. 40,000 ఎక్స్ఛేంజ్ బోనస్ కలిసి రూ. 90,000 వరకు ప్రయోజనం పొందవచ్చు. ఇంకా.. MY 2025 (VIN 2025) మోడల్‌ మీద కూడా రూ. 25,000 వరకు తగ్గింపును రెనాల్ట్‌ కంపెనీ ఆఫర్‌ చేస్తోంది. ఇందులో రూ. 10,000 క్యాష్‌ డిస్కౌంట్‌ & రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బెనిఫిట్‌ కలిసి ఉన్నాయి. 

రేటు & వేరియంట్లురెనాల్ట్ క్విడ్ ఎక్స్-షోరూమ్ ధర ‍‌(Renault Kwid ex-showroom price) రూ. 4.70 లక్షల నుంచి ప్రారంభమై, వేరియంట్‌ను బట్టి రూ. 6.45 లక్షల వరకు ఉంటుంది. RTO, ఇన్సూరెన్స్‌, ఇతర ఖర్చులు కలుపుకుని తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌-రోడ్‌ ధర ‍‌(Renault Kwid on-road price) రూ. 5.64 లక్షల నుంచి రూ. 7.81 లక్షల వరకు ఉంటుంది. ఈ కారు, ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్‌గా జనంలో బాగా పాపులర్‌ అయింది. 

ఇంజిన్ & మైలేజ్ రెనాల్ట్ క్విడ్ 1.0 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ (NA) పెట్రోల్ ఇంజిన్‌తో స్మూత్‌గా పరిగెడుతుంది, ఇది 68 PS పవర్‌ను & 91 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. ఈ కార్‌ రెండు ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్స్‌తో తయారైంది - 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌ బాక్స్ & 5-స్పీడ్ ఆటోమేటిక్ (AMT). ఈ కార్‌లోని ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌ కొత్త డ్రైవర్లకు బెస్ట్‌ సపోర్ట్‌ అందిస్తుంది. రెనాల్ట్ వెల్లడించిన ప్రకారం, ఈ కారు 21.46 kmpl నుంచి 22.3 kmpl వరకు మైలేజీని అందించగలదు. అంటే, ఇంధనం పరంగా డబ్బు ఆదా చేయగలదు.

రెనాల్ట్ క్విడ్ ఫీచర్లు & సేఫ్టీ రెనాల్ట్ క్విడ్ ప్రీమియం ఫీల్‌ ఫీచర్ల & కస్టమర్‌-ఫ్రెండ్లీ టెక్నాలజీని చూడవచ్చు. కారులో 8-అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంది, ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్‌తో ఇది పని చేస్తుంది. ఇంకా... LED డిజిటల్ టాకోమీటర్, గేర్ షిఫ్ట్ ఇండికేటర్, ఫ్రంట్ పవర్ విండోస్, మాన్యువల్ AC, రిమోట్ కీలెస్ ఎంట్రీ, USB ఛార్జింగ్ పోర్ట్స్‌ & థియేటర్ డిమ్మింగ్‌తో క్యాబిన్ లైటింగ్ వంటి కన్వీనియెంట్‌ ఫీచర్లను కూడా యాడ్‌ చేశారు. ఇవి బడ్జెట్ సెగ్మెంట్‌లో మీ డబ్బుకు అదనపు విలువను అందిస్తాయి.

భద్రతపరంగానూ క్విడ్ చాలా బలంగా ఉంది. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, ABS & EBD, ESP, హిల్ స్టార్ట్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్, రియర్ వ్యూ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, సీట్ బెల్ట్ రిమైండర్ & స్పీడ్ అలర్ట్ సిస్టమ్ వంటి అత్యాధునిక భద్రత లక్షణాలతో రెనాల్ట్‌ క్విడ్‌ తయారైంది.