Two Wheelers Launching in 2024: భారతీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త ద్విచక్ర వాహనాలు లాంచ్ అవుతూనే ఉంటాయి. ద్విచక్ర వాహన కొనుగోలుదారులకు 2024 గొప్ప సంవత్సరంగా మారనుంది. ఈ సంవత్సరం మనదేశంలో అనేక కొత్త ద్విచక్ర వాహనాలు మార్కెట్లోకి విడుదల కానున్నాయి. వీటిలో బెస్ట్ ఏవో ఇప్పుడు చూద్దాం.


కేటీయం 490 డ్యూక్ (KTM 490 Duke)
కేటీయం 490 డ్యూక్ అనేది ఒక స్పోర్ట్స్ బైక్. ఈ ఏడాది డిసెంబర్‌లో కేటీయం 490 డ్యూక్ మనదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ బైక్‌లో 490 సీసీ ఇంజన్ అందిస్తారని వార్తలు వస్తున్నాయి. కేటీయం తీసుకొస్తున్న ఈ మోడల్ ధర దాదాపు రూ. 3.5 లక్షలు ఉండవచ్చని తెలుస్తోంది.


హోండా యాక్టివా 7జీ (Honda Activa 7G)
హోండా యాక్టివా కొత్త మోడల్ మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. అదే హోండా యాక్టివా 7జీ. ఈ మోడల్‌లో 110 సీసీ ఇంజన్ అందుబాటులో ఉంది. హోండా యాక్టివా 7జీ 2024 ఏప్రిల్ 15వ తేదీన విడుదల కానుంది. ఈ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ.80 వేల నుంచి రూ.90 వేల వరకు ఉండవచ్చని సమాచారం.


యమహా ఎక్స్‌ఎస్‌ఆర్ 155 (Yamaha XSR 155)
యమహా తన కొత్త బైక్ అయిన ఎక్స్ఎస్ఆర్ 155ను ఈ ఏడాది చివర్లో మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ బైక్‌లో 155 సీసీ ఇంజన్ ఉండనుంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 1.4 లక్షల కంటే ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది. ఈ మోడల్‌ను 2024 డిసెంబర్‌లో విడుదల చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.


కవాసకి జెడ్400 (Kawasaki Z400)
స్పోర్ట్స్ బైకులకు కవాసకి అంటే పెట్టింది పేరు. కవాసకి జెడ్400పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ బైక్ 2024 నవంబర్‌లో మనదేశంలో లాంచ్ కానుందని తెలుస్తోంది. కవాసకి జెడ్400 ధర దాదాపు రూ.4 లక్షలు ఉండవచ్చు.


బెనెల్లీ టీఎన్‌టీ 300 (Bennelli TNT 300)
బెనెల్లీ లాంచ్ చేయనున్న ఈ మోడల్‌లో 300 సీసీ ఇంజిన్ ఉండవచ్చని తెలుస్తోంది. 2024 నవంబర్‌లోనే ఈ బైక్ కూడా మనదేశంలో లాంచ్ కానుందని సమాచారం. బెనెల్లీ టీఎన్‌టీ 300 ధర మనదేశంలో రూ. 2.99 లక్షల నుంచి రూ. 3.5 లక్షల మధ్య ఉండవచ్చని వార్తలు వస్తున్నాయి.


టీవీఎస్ జెప్పెలిన్ (TVS Zeppelin)
ఈ బైక్ ధర రూ.2 లక్షల నుంచి రూ.3.2 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. మైల్డ్ హైబ్రిడ్ సిస్టం ఉన్న 220 సీసీ ఇంజిన్ ఈ బైక్‌లో చూడవచ్చు. మనదేశంలో మైల్డ్ హైబ్రిడ్ సిస్టంతో లాంచ్ కానున్న మొదటి క్రూయిజర్ బైక్ ఇదే.


హీరో జూమ్ 160 (Hero Xoom 160)
2024లోనే హీరో జూమ్ 160 మనదేశంలో లాంచ్ కానుంది. దీని ధర రూ.1.4 లక్షల నుంచి రూ.1.5 లక్షల మధ్య ఉండనుంది. ఈ బైక్‌లో 160 సీసీ ఇంజిన్ అందించనున్నారు. బైక్ పెర్ఫార్మెన్స్‌ను ఇది మరింత మెరుగుపరచనుంది. కార్నరింగ్ ఏబీఎస్ టెక్నాలజీతో ఈ బైక్ మార్కెట్లోకి రానుంది.


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!