ఫిబ్రవరిలో ద్విచక్ర వాహనాల మార్కెట్‌ను హీరో పూర్తిగా డామినేట్ చేసింది. టాప్ ఫైవ్ టూ వీలర్ తయారీ కంపెనీల్లో 3,82,317 వాహనాలను విక్రయించి 37.65 మార్కెట్ షేర్‌ను సంపాదించింది. గత సంవత్సరం ఫిబ్రవరితో పోలిస్తే 15.34 శాతం వృద్ధిని హీరో కనపరించింది. అలాగే గత నెలతో పోలిస్తే 9.41 శాతం ఎక్కువ అమ్మకాలను సాధించింది. కానీ రెండో స్థానంలో ఉన్న హోండా మాత్రం హీరోకు పూర్తిగా తిరోగమనంలో సాగుతోంది. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే 20.52 శాతం, గత నెలతో పోలిస్తే 18.36 శాతం అమ్మకాలను హోండా కోల్పోయింది.


ఇక మూడో స్థానంలో ఉన్న టీవీఎస్ దాదాపుగా హోండాను చేరుకుంది. ఈ రెండిటి మధ్య 5,662 యూనిట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. టీవీఎస్ గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే 27.83 శాతం, గత నెలతో పోలిస్తే 2.28 శాతం వృద్ధిని సాధించింది. ప్రస్తుతం టీవీఎస్ మార్కెట్ షేర్ 21.80 శాతంగా ఉంది. ఇది హోండా కంటే కేవలం 0.56 మాత్రమే తక్కువ. నాలుగో స్థానంలో ఉన్న బజాజ్ గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే 24.67 శాతం వృద్ధిని సాధించింది. కానీ గత నెలతో పోలిస్తే 14.06 శాతం అమ్మకాలు తగ్గాయి.


ఐదో స్థానంలో ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ గత నెలలో 64,436 యూనిట్లను విక్రయించింది. ఈ బ్రిటిష్ కంపెనీ గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే 23.59 శాతం వృద్ధిని కనబరించింది. కానీ గత నెల కంటే 4.82 శాతం తక్కువ సేల్స్ ఉన్నాయి.


టాప్ ఫైవ్ బ్రాండ్లు అన్నీ కలిపి మొత్తంగా 10,15,554 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించాయి. గతేడాది ఫిబ్రవరిలో 9,38,995 ద్విచక్ర వాహనాలు అమ్ముడుపోయాయి. 2023 జనవరిలో 10,51,781 యూనిట్లను విక్రయించారు. అంటే గతేడాది ఫిబ్రవరి కంటే 8.15 పురోగతి సాధించగా, జనవరితో పోలిస్తే మాత్రం 3.44 తక్కువగా అమ్మకాలను నమోదు చేశాయి.


హీరో మోటో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను గతేడాది అక్టోబర్‌లో విడుదల చేసింది. అదే హీరో విడా వీ1. భారతదేశంలోని కొన్ని ఇతర లెగసీ ఆటోమేకర్‌ల మాదిరిగానే, హీరో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ప్రారంభించడంలో వెనుకబడి ఉంది. టైగర్ గ్లోబల్ సపోర్ట్ ఉన్న ఏథర్ ఎనర్జీ, సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ మద్దతుతో ఓలా ఎలక్ట్రిక్ వంటి స్టార్టప్‌లకు మొదటి-మూవర్ ప్రయోజనాన్ని అందిస్తోంది.


భారతదేశంలో ఈ-స్కూటర్లు, ఈ-బైక్‌లు 2030 నాటికి మొత్తం టూ-వీలర్ అమ్మకాలలో 80 శాతంగా ఉంటాయని అంచనా. ఇప్పుడు ఇది దాదాపు 2 శాతంగా ఉంది. పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో ప్రజలు గ్యాసోలిన్ స్కూటర్‌లకు దూరంగా ఉండటంతో అమ్మకాలు వేగవంతం అవుతున్నప్పటికీ, ఇటీవల ఎలక్ట్రిక్ స్కూటర్‌లకు మంటలు అంటుకోవడం భద్రతపై ఆందోళనలను పెంచింది. ఇది వినియోగదారుల విశ్వాసాన్ కూడాని దెబ్బతీసింది.


హీరో తొలి ఎలక్ట్రిక్ మోడల్ విడా వీ1. ధర రూ.1.45 లక్షలుగా ఉంది. ఇది భారతదేశంలోని చాలా ఎలక్ట్రిక్ స్కూటర్ల కంటే ఎక్కువ. ఏథర్ మాదిరిగానే ఒక్కసారి చార్జ్ చేస్తే కనీసం 143 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుంది. అక్టోబర్ 10వ తేదీ నుంచి దీని బుకింగ్స్ ప్రారంభం అవుతాయి. డెలివరీలను డిసెంబర్ నుంచి మొదలు పెట్టనున్నారు.


ఎలక్ట్రిక్ వాహనాల స్టార్టప్‌లలో హీరో వరుసగా పెట్టుబడులు పెట్టింది. సెప్టెంబర్‌లో కాలిఫోర్నియాకు చెందిన జీరో మోటార్‌సైకిల్స్‌లో సంయుక్తంగా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను అభివృద్ధి చేసేందుకు $60 మిలియన్లు (దాదాపు రూ. 500 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు హీరో తెలిపింది. జనవరిలో ఇది ఏథర్‌లో $56 మిలియన్ల (దాదాపు రూ. 460 కోట్లు) పెట్టుబడిని ప్రకటించింది. 2021లో దాని బ్యాటరీ షేరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం తైవాన్‌కు చెందిన గోగోరోతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.