TVS Scooters Commuter Bikes GST 2.0 Price: టూవీలర్ మార్కెట్‌లో ఈ పండుగ సీజన్‌ (Festive season 2025) చాలా స్పెషల్‌. GST 2.0 కొత్త ట్యాక్స్ స్లాబ్ వల్ల బైకులు & స్కూటర్ల ధరలు తగ్గి, ఫెస్టివ్ సీజన్ స్పెషల్ ఆఫర్స్‌ తరహాలో డిస్కౌంట్లు లభిస్తున్నాయి. టీవీఎస్ స్కూటర్లు, కమ్యూటర్ బైక్స్ ధరలు కూడా భారీగా తగ్గాయి. గరిష్టంగా రూ. 9,600 వరకు ప్రయోజనం లభిస్తోంది.

Continues below advertisement

జూపిటర్ స్కూటర్ ధర తగ్గింపు

ఫ్యామిలీ ఫ్రెండ్లీ స్కూటర్‌గా పేరుగాంచిన TVS Jupiter ఇప్పుడు మరింత అందుబాటులోకి వచ్చింది. Jupiter 110 కొత్త ఎక్స్‌ షోరూమ్ ధర రూ. 72,400 కాగా, ఇది పాత ధర కంటే రూ. 6,481 తక్కువ. Jupiter 125 కూడా డిస్కౌంట్‌తో రూ. 75,600 కి లభిస్తోంది.      

Continues below advertisement

Ntorq సిరీస్ సెన్సేషన్

యూత్‌ ఫేవరేట్‌గా ఉన్న స్పోర్టీ ఎన్‌టార్క్ కూడా బిగ్ డిస్కౌంట్‌లో వచ్చింది. Ntorq 125 ఇప్పుడు రూ. 80,900 కి లభిస్తోంది, ఇది రూ. 7,242 తగ్గింపు. కొత్తగా లాంచ్ చేసిన Ntorq 150 మీద గరిష్టంగా రూ. 9,600 ఆదా అవుతోంది. దీని కొత్త ధర రూ. 1.09 లక్షల నుంచి ప్రారంభం అవుతున్నాయి.       

కమ్యూటర్ బైక్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ

ఎంట్రీ లెవెల్ కమ్యూటర్లలో TVS XL 100 ధర రూ. 43,900కి పడిపోయింది. TVS Radeon ఇప్పుడు రూ. 55,100 కి లభిస్తోంది. TVS Sport మోడల్‌ భారీగా రూ. 8,440 తగ్గింపుతో ఇప్పుడు రూ. 51,150 కే దొరుకుతోంది. TVS Starcity ధర రూ. 72,200 కు దిగి వచ్చింది.       

Raider & Apache రేంజ్

యూత్‌కి ప్రియమైన Raider ఇప్పుడు రూ. 80,050 కే దొరుకుతోంది. దీని ధర రూ. 7,575 తగ్గింది. అలాగే, Apache రేంజ్‌పై గరిష్టంగా రూ. 27,000 వరకు సేవింగ్స్ అందుబాటులో ఉన్నాయి.       

మోడల్‌ పాత ధర (ఎక్స్‌-షోరూమ్‌) కొత్త ధర (ఎక్స్‌-షోరూమ్‌) GST బెనిఫిట్‌

TVS Jupiter 110

రూ. 78,881

రూ. 72,400

రూ. 6,481

TVS Jupiter 125

రూ. 82,395

రూ. 75,600

రూ. 6,795

TVS Ntorq 125

రూ. 88,142

రూ. 80,900

రూ. 7,242

TVS Ntorq 150

రూ. 1,19,000

రూ. 1,09,400

రూ. 9,600

TVS XL 100

రూ. 47,754

రూ. 43,900

రూ. 3,854

TVS Radeon

రూ. 59,950

రూ. 55,100

రూ. 4,850

TVS Sport

రూ. 59,590

రూ. 51,150

రూ. 8,440

TVS Star City

రూ. 78,586

రూ. 72,200

రూ. 6,386

TVS Raider

రూ. 87,625

రూ. 80,050

రూ. 7,575

TVS Zest

రూ. 76,891

రూ. 70,600

రూ. 6,291

తెలుగు రాష్ట్రాల మార్కెట్‌లో హవా

హైదరాబాద్‌, విజయవాడ, వరంగల్‌, విశాఖ వంటి నగరాల్లో జూపిటర్, ఎన్‌టార్క్, అపాచే మోడల్స్‌కి భారీ డిమాండ్ ఉంది. GST 2.0 ఆఫర్స్‌తో ఈ ఫెస్టివ్ సీజన్‌లో టీవీఎస్ సేల్స్ రికార్డ్ స్థాయిలో పెరిగే ఛాన్స్‌ ఉంది.