TVS Ronin Review 2025: టీవీఎస్‌ రోనిన్‌ మన మార్కెట్‌లో అడుగు పెట్టి మూడు సంవత్సరాలు పూర్తయింది. మొదటి రోజు నుంచి ఈ బైక్‌ డిజైన్‌, ఫీల్‌ వంటివి TVS లైనప్‌లోని మిగతా మోడళ్లతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉంటాయి. క్రూయిజర్, స్క్రాంబ్లర్, రోడ్‌స్టర్ - ఈ మూడింటి స్టైల్‌ల కలయికగా Ronin ను డిజైన్‌ చేశారు. GST 2.0 అమల్లోకి వచ్చిన తర్వాత రోనిన్ ధరలు భారీగా తగ్గాయి, ఫెస్టివ్‌ సీజన్‌లో మంచి సేల్స్ జరిగాయి. ఈ బండిని కొనాలని ఆలోచిస్తున్నవారు కోసం తెలుసుకోవాల్సిన 8 ముఖ్యమైన పాయింట్లు ఇక్కడ ఉన్నాయి.

Continues below advertisement

1. ఇంజిన్ పవర్ ఎంత?

TVS Roninలో 225cc సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ వస్తుంది. ఇది 20.4hp పవర్, 19.9Nm టార్క్ ఇస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఈ బైక్‌ని తయారు చేశారు. ఈ పవర్.. సిటీ రైడింగ్‌కి, రోజువారీ కమ్యూటింగ్‌కి చక్కగా సరిపోతాయి. రెస్పాన్స్ స్మూత్‌గా ఉండటం రోనిన్ ప్రత్యేకత.

Continues below advertisement

2. బరువు & సీట్ హైట్ ఎలా ఉంటాయి?

Ronin కెర్బ్‌ వెయిట్ 160kg, అంటే హ్యాండ్లింగ్‌ ఈజీగా ఉంటుంది. సీట్ హైట్ 795mm, అంటే తక్కువ హైట్ ఉన్న రైడర్లు కూడా ఈ బండిని సులభంగా మేనేజ్ చేయగలిగే విధంగా డిజైన్ చేశారు. రోజువారీ సిట్టింగులో లేదా ట్రాఫిక్‌లో రైడ్ చేయడానికి ఇది ఓ మంచి అడ్వాంటేజ్.

3. స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ ఉందా?

ఉంది. TVS Roninలో స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ స్టాండర్డ్‌గా వస్తుంది. దీంతో క్లచ్ ఆపరేషన్ చాలా లైట్‌గా ఉంటుంది, అలాగే హార్డ్ డౌన్‌షిఫ్ట్ చేసినప్పుడు రియర్ వీల్ లాక్ అయ్యే అవకాశం తగ్గుతుంది. అదనంగా అడ్జస్టబుల్ లీవర్స్ కూడా అందిస్తున్నారు.

4. ABS మోడ్‌లు / పవర్ మోడ్‌లు ఉంటాయా?

Roninలో రెండు ABS మోడ్‌లు - రెయిన్‌ & అర్బన్‌ మాత్రమే ఉన్నాయి. పవర్ మోడ్‌ మాత్రం లేదు. రెయిన్‌ మోడ్‌లో బ్రేకింగ్ చాలా పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది, అర్బన్‌ మోడ్‌లో సాధారణ పరిస్థితుల్లో మంచి కంట్రోల్ ఇస్తుంది.

5. బ్లూటూత్ కనెక్టివిటీతో LCD డిస్‌ప్లే ఉందా?

ఉంది. TVS Roninలో ఉన్న LCD డిస్‌ప్లే బ్లూటూత్-ఎనేబుల్డ్‌. ఇందులో కాల్ అలర్ట్స్, నావిగేషన్ అసిస్టెన్స్, మెసేజ్ నోటిఫికేషన్స్, రైడ్ స్టాటిస్టిక్స్ వంటి అనేక ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. సులభమైన ఇంటర్‌ఫేస్ రోనిన్‌కి ఒక మంచి ప్లస్ పాయింట్.

6. రోనిన్‌ రైవల్స్ ఎవరు?

రోనిన్‌తో యువ రైడర్లు ఎక్కువగా పోల్చి చూస్తున్న రెండు బైక్‌లు... Royal Enfield Hunter 350 & Yamaha XSR 155. Hunter 350లో క్లాసిక్ రెట్రో వైబ్ ఉంటుంది. XSR 155లో స్పోర్టీ నియో రెట్రో స్టైల్ ఉంటుంది. Ronin మాత్రం ఈ మూడింటి మిక్స్ ఉన్న ప్రత్యేక ఆకర్షణ.

7. Ronin ఏ రంగుల్లో లభిస్తుంది?

TVS Ronin మొత్తం 6 రంగుల్లో వస్తుంది, అవి: బ్లాక్, రెడ్, సిల్వర్, అంబర్, గ్రే, బ్లూ. ఇవి మూడు వేరియంట్‌ల్లో అందుబాటులో ఉంటాయి, బేస్ నుంచి టాప్ వరకు కలర్ ఆప్షన్‌లను విభజించారు.

8. GST 2.0 తర్వాత Ronin ధరలు ఎంత?

GST 2.0 అమల్లోకి వచ్చిన తర్వాత Ronin ధరలు భారీగా తగ్గాయి. ఇప్పుడు కొత్త ధరలు ఇలా ఉన్నాయి... ₹1.25 లక్ష – ₹1.59 లక్ష (ఎక్స్‌షోరూమ్). GST 2.0 తగ్గింపు ₹11,220 నుంచి ₹14,330 వరకు ఉంటుంది. వాల్యూ కోసం చూస్తున్న వారికి ఇది చాలా పెద్ద బెనిఫిట్.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.