TVS November Sales Report: టీవీఎస్ మోటార్ కంపెనీ 2023 నవంబర్‌లో 364,231 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. 2022 నవంబర్‌లో అమ్మకాలు 277,123 యూనిట్లు కాగా, 2023 నవంబర్‌లో 31 శాతం పెరుగుదల కనిపించింది. ఇందులో దేశీయ అమ్మకాలు, ఎగుమతులు రెండూ ఉన్నాయి.


టీవీఎస్ ద్విచక్ర వాహనాల విక్రయాలు
టీవీఎస్ ఈ ఏడాది నవంబర్‌లో మొత్తం 352,103 ద్విచక్ర వాహనాలను విక్రయించింది. ఫలితంగా గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నవంబర్‌లో 34 శాతం వృద్ధిని సాధించింది. గత ఏడాది ఇదే కాలంలో దేశీయ విక్రయాలు మరియు, కలిపి మొత్తం 263,642 ద్విచక్ర వాహనాలను టీవీఎస్ విక్రయించింది. దేశీయ మార్కెట్లో టీవీఎస్ 287,017 ద్విచక్ర వాహనాలను విక్రయించింది. ఇది గతేడాదితో పోలిస్తే ఏకంగా 50 శాతం ఎక్కువ. గత ఏడాది నవంబర్‌లో దేశీయ మార్కెట్లో టీవీఎస్ 191,730 యూనిట్లను విక్రయించింది.


2023లో మొత్తం వాహన విక్రయాలలో ద్విచక్ర వాహన మోటార్‌సైకిళ్ల వాటా 172,836 యూనిట్లుగా ఉంది. గత సంవత్సరంతో పోలిస్తే 19 శాతం పెరుగుదల నమోదు చేసింది. టీవీఎస్ గత ఏడాది ఇదే నెలలో 145,006 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. అదే సమయంలో కంపెనీ స్కూటీల అమ్మకాలలో గత సంవత్సరంతో పోలిస్తే ఏకంగా 62 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2022 నవంబర్‌లో 83,679 యూనిట్లను విక్రయించగా, 2023 నవంబర్‌లో 135,749 యూనిట్లు అమ్ముడయ్యాయి.


టీవీఎస్ ఈవీ అమ్మకాలు
టీవీఎస్ ప్రస్తుతం దేశంలో ఐక్యూబ్ అనే ఒకే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మాత్రమే విక్రయిస్తుంది. కంపెనీ 2023 నవంబర్‌లో 16,782 ఐక్యూబ్ యూనిట్లను విక్రయించగా, గత ఏడాది నవంబర్‌లో 10,056 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. ఇందులో కూడా 66.88 శాతం వార్షిక వృద్ధి నమోదైంది. ఈ ఏడాది ఆగస్టులో టీవీఎస్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను దుబాయ్‌లో విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 2.50 లక్షలుగా నిర్ణయించారు. అయితే దీని డెలివరీ ఇంకా ప్రారంభం కాలేదు.


టీవీఎస్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను 4.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్, 11 కేడబ్ల్యూ పీఎంఎస్ఎం మోటార్‌తో కంపెనీ ఎక్విప్ చేసింది. ఇది ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 140 కిలోమీటర్ల రేంజ్‌ను అందించగలదు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 105 కిలోమీటర్లుగా ఉంది. అలాగే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 2.6 సెకన్లలోనే గంటకు 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. 0 నుంచి 50 శాతం ఛార్జింగ్ కేవలం గంటలోనే ఎక్కే అవకాశం ఉంది.


టీవీఎస్ ఈ స్కూటర్‌ను కొత్త డిజైన్‌తో లాంచ్ చేసింది. ఇందులో 10.2 అంగుళాల టచ్ స్క్రీన్‌ అందించారు. ఈ స్క్రీన్ ద్వారా వీడియో గేమ్‌లు, వీడియోలు చూడటం, సెట్టింగ్ థీమ్‌లు, డిజిటల్ కీలు, జియో ఫెన్సింగ్ వంటి నావిగేషన్ ఫీచర్లు, థెఫ్ట్ అలర్ట్ వంటి ఫీచర్లను యాక్సెస్ చేయవచ్చు. స్మార్ట్ హిల్ హోల్డ్, క్రూయిజ్ కంట్రోల్, ఏబీఎస్ కూడా ఉన్నాయి. ఎక్స్‌టీహెల్త్, ఎక్స్‌టీరైడ్, క్సానిక్ అనే మూడు రైడ్ మోడ్స్ ఇందులో అందించారు.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply


Also Read: సూపర్ హిట్ టయోటా కామ్రీ అప్‌డేటెడ్ వెర్షన్ త్వరలో - ఈసారి హైబ్రిడ్ ఇంజిన్‌తో!


Also Read: లాంచ్‌కు రెడీ అవుతున్న కొత్త స్విఫ్ట్ - సరికొత్త ఇంజిన్, సూపర్ లుక్‌తో!