భారతదేశ మార్కెట్లో స్కూటీ విభాగానికి నిరంతరం ప్రజాధరణ పెరుగుతోంది. అందులోనూ ముఖ్యంగా 125cc స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఈ స్కూటర్లు పవర్‌ఫుల్, మైలేజ్, స్పోర్టీ డిజైన్, అధునాతన ఫీచర్లతో వస్తాయి. ప్రముఖ బ్రాండ్లు టీవీఎస్ TVS, Honda, Suzuki, Yamaha, హీరో (Hero) వంటి బ్రాండ్లు ఈ విభాగంలో తమదైన ముద్ర వేశాయి. ఇక్కడ 125cc కేటగిరీలో అత్యంత శక్తివంతమైన స్కూటీల వివరాలు అందిస్తున్నాం. వాటి పనితీరు, ఫీచర్ల కారణంగా వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. 

Continues below advertisement


టీవీఎస్ స్కూటర్.. TVS Ntorq 125


 ఈ విభాగంలో అత్యుత్తమ పనితీరును కనబరిచే స్కూటర్ TVS Ntorq 125. దీని 124.8cc ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ 7.5 kW శక్తిని, 11.5 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రేస్ మోడ్లో ఇది 98 km/h గరిష్ట వేగాన్ని అందుకోగలదు. ఇది ఇతర స్కూటీల నుంచి దీన్ని ప్రత్యేకంగా మార్చుతుంది. ఇందులో డిజిటల్ స్పీడోమీటర్, LED లైటింగ్, రైడింగ్ మోడ్స్, స్మార్ట్ కనెక్టివిటీ, USB ఛార్జింగ్, ఇంటెలిజెంట్ స్టార్ట్/స్టాప్ ఫీచర్లతో వస్తుంది. టీవీఎస్ స్కూటీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 80,900 నుంచి ప్రారంభమవుతుంది.


Honda Dio 125


బెస్ట్ పనితీరు స్కూటర్లను ప్రారంభించిన స్కూటర్ Honda Dio 125 125cc. దీని ఇంజిన్ 6.11 kW శక్తిని, అదే సమయంలో 10.5 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. హొండా స్కూటీ 90 km/h వరకు వేగాన్ని అందుకోగలదు. ఇది రిమోట్ కీ, బ్లూటూత్ కనెక్టివిటీ, LED హెడ్ల్యాంప్స్, Honda RoadSyncతో కూడిన TFT మీటర్ సహా అధునాతన ఐడిలింగ్ స్టాప్ సిస్టమ్ కలిగి ఉంది. హొండా డియో స్కూటీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 84,870 నుంచి ప్రారంభమవుతుంది.


Hero Xoom 125


Hero Xoom 125 చాలా తేలికైనది, యాక్టివ్. నగరంలో రోజువారీ ప్రయాణాలకు ఇది సరైన స్కూటర్. 125cc ఇంజిన్ 7.3 kW శక్తిని, 10.4 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 95 km/h వేగం వరకు వెళ్తుంది. హీరో Xoom స్కూటీలో LED ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, ఫాల్కన్-స్టైల్ పొజిషన్ లైట్లు, సీక్వెన్షియల్ LED ఇండికేటర్లు, డిజిటల్ స్పీడోమీటర్ సహా నావిగేషన్ ఫీచర్లను కలిగి ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 80,494గా ఉంది.



సుజుకీ స్కూటీ.. Suzuki Avenis 125


Suzuki Avenis 125 124cc ఇంజిన్ కలిగి ఉంది. ఇది 6.3 kW శక్తిని, 10 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 90 km/h గరిష్ట వేగాన్ని చేరుకోగలదు. ఈ స్కూటీ 21.5L అండర్-సీట్ స్టోరేజ్, LED సెటప్, USB సాకెట్, బ్లూటూత్ సౌకర్యం, డిజిటల్ కన్సోల్‌ను కలిగి ఉంది. ఈ స్కూటీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 87,000 నుంచి ప్రారంభమవుతుంది.


యమహా స్కూటీ.. Yamaha RayZR 125


 ఈ జాబితాలో తేలికైన స్కూటర్లలో ఒకటి Yamaha RayZR 125. దీని 125cc ఇంజిన్ 6.0 kW శక్తితో పాటు 10.3 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 90 km/h గరిష్ట వేగం అందుకోగలదు. స్కూటర్ LED హెడ్లైట్, డిజిటల్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, 21L స్టోరేజీ, ఆటో స్టార్ట్/స్టాప్ సిస్టమ్ కలిగి ఉంది. దీని ధర రూ. 73,430 నుంచి ప్రారంభమవుతుంది. మీ ఖర్చుకు తగ్గట్లు విలువైన స్కూటర్ అని సామాన్యులు భావిస్తారు.