TVS Ntorq 150 vs Hero Xoom 160 Features Performance Comparison: తెలుగు ప్రజలు, ముఖ్యంగా యువత, బైకుల కంటే స్కూటర్లకే ఇప్పుడు ప్రిఫరెన్స్‌ ఇస్తున్నారు, దీంతో డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. కొనేవాళ్లు కేవలం మైలేజ్ లేదా ధర కోసం మాత్రమే కాకుండా, డిజైన్, ఫీచర్లు & పనితీరు కోసం కూడా చూస్తున్నారు. కస్టమర్ల ఆకాంక్షలను తీర్చేందుకు, ఈ విభాగంలో రెండు కొత్త & ప్రసిద్ధ మోడళ్లు TVS Ntorq 150 & Hero Xoom 160 దూసుకొచ్చాయి. ఈ రెండు స్కూటర్లు స్టైలిష్ లుక్స్ & హై-టెక్ ఫీచర్లను కలిగి ఉన్నాయి. అయితే మీకు ఏది సరైన ఎంపిక అన్నదే ఇక్కడ ప్రశ్న.

ఏ బండి ధర తక్కువ?

తెలుగు రాష్ట్రాల్లో, టీవీఎస్‌ ఎన్‌టార్క్‌ 150 బేస్ వేరియంట్ ₹1.19 లక్షల (ఎక్స్-షోరూమ్) కు ధరకు లభిస్తుంది & దీని టాప్ వేరియంట్ ₹1.29 లక్షల (ఎక్స్-షోరూమ్) కు అందుబాటులో ఉంది. 

హీరో జూమ్ 160 ₹1.48 లక్షల (ఎక్స్-షోరూమ్) తో ప్రారంభమవుతుంది. 

దీని అర్థం TVS Ntorq 150 ధర పరంగా అనువైనది. మీ బడ్జెట్ పరిమితంగా ఉంటే, ఈ స్కూటర్ మంచి డీల్. 

డిజైన్ & స్టైల్‌లో ఏ బండి ముందు ఉంటుంది?

TVS Ntorq 150 స్పోర్టియర్ & యూత్‌ను ఆకర్షించే డిజైన్‌ కలిగి ఉంది. ఇందులో స్ప్లిట్ LED హెడ్‌ల్యాంప్‌లు, స్టైలిష్ DRLs & 12 అంగుళాల చక్రాలు ఉన్నాయి. దీని కాంపాక్ట్ వీల్‌బేస్ నగర రోడ్లపై మరింత తెలివిగా పని చేస్తుంది. 

Hero Xoom 160 మ్యాక్సీ-స్కూటర్ లుక్స్‌తో ప్రత్యేకంగా నిలుస్తుంది. దీని వెడల్పు సీటు, పెద్ద 14-అంగుళాల చక్రాలు & డ్యూయల్-షాక్ సస్పెన్షన్ హైవే వినియోగానికి & టూరింగ్‌కు అనువుగా ఉంటాయి. ఈ టూవీలర్‌ LED డిజైన్ కూడా దీనికి ప్రీమియం ఆకర్షణను ఇస్తుంది.

ఫీచర్లలో ఏది ఆధునికం?

TVS Ntorq 150 ఒక స్పోర్ట్స్ బైక్ కంటే తక్కువేమీ కాదు, హై-టెక్ ఫీచర్లను అందిస్తుంది. దీనిలో 5-అంగుళాల TFT స్క్రీన్, బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్, జియో-ఫెన్సింగ్, క్రాష్ అలర్ట్‌లు, అలెక్సా వాయిస్ కంట్రోల్ & మల్టీ రైడింగ్ మోడ్స్‌ వంటి అధునాతన ఫీచర్‌లు లభిస్తాయి. ఈ స్కూటర్‌లో ట్రాక్షన్ కంట్రోల్ & ABS కూడా ఉన్నాయి. 

Hero Xoom 160 పూర్తిగా డిజిటల్ LCD డిస్‌ప్లే, కాల్ & SMS అలర్ట్‌లు, టర్న్-బై-టర్న్ నావిగేషన్, కీలెస్ ఇగ్నిషన్ & రిమోట్ బూట్ ఓపెనింగ్ వంటి ప్రీమియం ఫీచర్లను అందిస్తుంది. 

ఫీచర్ల పరంగా ఈ రెండు బండ్లు శక్తిమంతమైనవే అయినప్పటికీ, Ntorq 150 సాంకేతికత దానిని కాస్త ప్రత్యేకంగా నిలబెడుతుంది.

ఇంజిన్ & పనితీరు

TVS Ntorq 150 149.7cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది, ఇది 13.2hp శక్తిని & 14.2Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ కేవలం 6.3 సెకన్లలో గంటలకు 0-60 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది & గరిష్టంగా గంటకు 104 కి.మీ. వేగాన్ని చేరుకుంటుంది. 

Hero Xoom 160 మరింత శక్తిమంతమైనది. ఇది 14.6hp శక్తిని & 14Nm టార్క్‌ను జనరేట్‌ చేసే 156cc లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంది. మృదువైన పనితీరు & మెరుగైన హైవే రైడింగ్‌తో లాంగ్‌ రైడ్స్‌కు అనుకూలంగా ఉంటుంది.

ఏ బండి కొనడం బెటర్? 

మీరు స్పోర్టి డిజైన్, అధునాతన ఫీచర్లు & అందుబాటు ధరను కోరుకుంటే, TVS Ntorq 150 ఉత్తమ ఎంపిక. మీ బడ్జెట్ కొంచెం ఎక్కువగా ఉండి, టూరింగ్ లేదా లాంగ్ జర్నీలకు మృదువైన & శక్తిమంతమైన స్కూటర్‌ను కోరుకుంటే, Hero Xoom 160 మంచి ఎంపిక. ఈ రెండు స్కూటర్లు వాటి సంబంధిత విభాగాలలో బలంగా ఉన్నాయి. నిర్ణయం మీ బడ్జెట్ & అవసరాలపై ఆధారపడి ఉంటుంది.