TVS Ntorq 150 Review: టీవీఎస్‌ కంపెనీ నుంచి వచ్చే Ntorq స్కూటర్‌ సిరీస్ ఎప్పుడూ యువతరానికి బాగా నచ్చుతుంది. పవర్‌, స్టైల్‌, టెక్నాలజీ - ఈ మూడు కలిసిన ఒక పర్ఫెక్ట్‌ కాంబినేషన్‌లా Ntorq మార్కెట్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇటీవల కొత్తగా వచ్చిన TVS Ntorq 150 మోడల్‌ అయితే 150cc సెగ్మెంట్‌లో అత్యంత అందుబాటు ధర స్కూటర్ కావడం విశేషం. ఈ స్కూటర్ కొనాలా, వద్దా అని మీరు ఆలోచిస్తుంటే, ఈ రివ్యూ మీకు స్పష్టమైన ఐడియా ఇస్తుంది.

Continues below advertisement

కొనడానికి 3 బలమైన కారణాలు

1. శక్తిమంతమైన పనితీరు – త్వరగా స్పందించే ఇంజిన్‌Ntorq 150లో ఇచ్చిన ఎయిర్‌ కూల్డ్‌ ఇంజిన్‌ అత్యంత పవర్‌ ఇచ్చేదానిలా పేపర్‌పై కనిపించకపోయినా, ఈ క్లాస్‌లోనే అత్యధిక టార్క్‌ (14.2Nm) ఇస్తుంది. ముఖ్యంగా ఈ టార్క్‌ తక్కువ రేవ్స్ వద్దే అందుబాటులోకి రావడం దీనిలో పెద్ద ప్రత్యేకత.సిటీ రైడింగ్‌ అయినా, హైవే మీద గంటకు 80km స్పీడ్‌తో దూసుకెళ్లడం అయినా ఈ స్కూటర్ చాలా ఈజీగా, గమ్మత్తుగా పికప్ ఇస్తుంది. ఇంజిన్‌ నుంచి వచ్చే చిన్న థ్రోటీ సౌండ్‌ కూడా దీనికి మంచి స్పోర్టీ ఫీల్ ఇస్తుంది.

Continues below advertisement

2. కంఫర్ట్‌ & హ్యాండ్లింగ్‌ – రెండు మధ్య బలమైన బలాన్స్‌TVS స్కూటర్లు ఇచ్చే కంఫర్ట్‌ బాగుంటుందని మనందరికీ తెలిసిన విషయమే. కానీ Ntorq 150లో కంఫర్ట్‌తో పాటు హ్యాండ్లింగ్‌ కూడా అద్భుతంగా ఉంది. దీని సస్పెషన్‌ సెటప్‌ను 125తో పోలిస్తే కొద్దిగా గట్టిగా ఉన్నప్పటికీ, రోడ్డు మీద వచ్చే చిన్న చిన్న గుంతలు, రఫ్‌ పాచెస్‌ను ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. రైడింగ్‌ పొజిషన్ రూమీగా ఉండడం, సీటు ఇద్దరికి సరిపోయేంత వెడల్పుగా ఉండటం కూడా దీనిని ఫ్యామిలీ యూజ్‌కి కూడా సూట్ అయ్యేలా చేస్తుంది. 770mm సీట్ హైట్ ఉండడం వల్ల తక్కువ హైట్ ఉన్నవారికి కూడా మంచి కంఫర్ట్ ఉంటుంది.

3. ఫీచర్ల పరంగా టాప్ క్లాస్ - ధర మాత్రం కాంపిటీటివ్‌Ntorq 150ని రెండు వేరియంట్లలో అందిస్తున్నారు. టాప్ వేరియంట్‌లో 5-inch TFT స్క్రీన్ ఉండటం పెద్ద అదనం. ఈ TFT ద్వారా నావిగేషన్‌, మ్యూజిక్‌, నోటిఫికేషన్లు, అలెక్సా సపోర్ట్‌, స్మార్ట్‌వాచ్‌ పెయిరింగ్‌, జియో ఫెన్సింగ్‌... ఇలా చాలా పనులు చేయవచ్చు. అంతేకాదు, ట్రాక్షన్ కంట్రోల్ & సింగిల్‌ చానల్ ABS కూడా స్టాండర్డ్‌గా రావడం సేఫ్టీ పరంగా పెద్ద ప్లస్.

కొనకుండా ఆగవలసిన 2 కారణాలు

1. రియర్ బ్రేక్ సులభంగా లాక్ అవుతుందిసింగల్ చానల్ ABS కేవలం ఫ్రంట్ బ్రేక్‌కు మాత్రమే పనిచేస్తుంది. ఫ్రంట్ బ్రేక్ బాగానే స్పందించినా, రియర్ బ్రేక్ చాలా త్వరగా లాక్ అవుతుంది. ఈ సెగ్మెంట్‌లో ఇది అసాధారణం కాదు, కానీ కొత్తగా రైడ్ చేసే వారికి అలవాటు పడటానికి టైమ్ పడుతుంది. లైట్ టచ్‌తోనే బ్రేక్ వేయాలి.

2. స్ట్రీట్‌ మోడ్‌లో ఎలక్ట్రిక్ బూస్ట్ లేకపోవడంTVS ఇచ్చిన iGO ఎలక్ట్రిక్ అసిస్ట్ అదనంగా 0.7Nm టార్క్ ఇస్తుంది. కానీ ఇది కేవలం రేస్‌ మోడ్‌లో మాత్రమే పని చేస్తుంది. స్ట్రీట్‌ ోడ్‌లో పవర్ తక్కువగా ఉన్నప్పుడు ఈ బూస్ట్‌ అవసరం అనిపిస్తుంది. కానీ, ఈ మోడ్‌లో అది అందుబాటులో లేకపోవడం కొంచం మైనస్. రోజువారీ సిటీ రైడింగ్‌లో ఈ బూస్ట్ ఉంటే మరింత బెటర్‌గా ఉండేది.

మొత్తంగా, TVS Ntorq 150 స్కూటర్ శక్తిమంతమైన పనితీరు, ఆధునిక ఫీచర్లు, కంఫర్ట్‌, సేఫ్టీ ఇచ్చే ఆల్‌ రౌండ్‌ ప్యాకేజ్‌గా ఉంటుంది. చిన్న లోపాలున్నా, 150cc సెగ్మెంట్‌లో అఫోర్డబుల్ ప్రైస్‌తో ఇది పర్ఫెక్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.