TVS Ntorq 125 Price And Features: మన మార్కెట్‌లో స్పోర్టీ స్కూటర్ల విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో TVS ఎన్‌టార్క్ 125 ఒకటి. ఆకర్షణీయమైన డిజైన్, శక్తిమంతమైన ఇంజిన్, ఆధునిక ఫీచర్లతో యువతను ఎక్కువగా ఆకట్టుకుంటున్న ఈ స్కూటర్.. ప్రస్తుతం ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఎన్‌టార్క్ 125 కొనుగోలు చేయాలని భావిస్తున్నవారు తప్పక తెలుసుకోవాల్సిన ఐదు ముఖ్యమైన విషయాలు ఇవే.

Continues below advertisement

తెలుగు రాష్ట్రాల్లో ధరమొదటగా ధర గురించి తెలుసుకోండి. తెలుగు రాష్ట్రాల్లో TVS ఎన్‌టార్క్ 125 ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.82,500గా ఉంది. టాప్ వేరియంట్ XT ధర రూ.1,00,650 వరకు ఉంటుంది. రేస్ ఎడిషన్ ధర రూ.87,950, సూపర్ స్క్వాడ్ ఎడిషన్ రూ.91,550, రేస్ XP రూ.93,650గా నిర్ణయించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ స్కూటర్ ఆన్ రోడ్ ధర సుమారు రూ.96,112 నుంచి రూ.1.18 లక్షల వరకు ఉంటుంది. వేరియంట్‌ను బట్టి ధరలో మార్పు ఉంటుంది.

ఇంజిన్ అన్ని సాధారణ వేరియంట్లలో 124.8cc సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌ను అందిస్తున్నారు. ఇది 9.5 hp పవర్‌తో పాటు 10.6 hp టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రేస్ XP వేరియంట్‌లో మాత్రం అదే ఇంజిన్‌ను మరింత పనితీరుతో ట్యూన్ చేశారు. ఇందులో 10.2 hp పవర్ & 11.5 hp టార్క్ లభిస్తుంది. పనితీరు పరంగా ఈ వేరియంట్ 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 7.61 సెకన్లలో అందుకుంటుంది.

Continues below advertisement

ఇది కూడా చదవండి: రూ.6 లక్షలకే కొత్త SUV తీసుకొస్తున్న మారుతి! టాటా పంచ్‌కి షాక్ తప్పదా?

మైలేజ్ ఎన్‌టార్క్ 125 బలమైన అంశాల్లో మైలేజ్ ఒకటి. రేస్ XP వేరియంట్ పరీక్షల్లో నగరంలో లీటర్‌కు 52.4 కిలోమీటర్లు, హైవేపై 56.66 కిలోమీటర్ల మైలేజ్ నమోదైంది. రేస్ XP ఇంజిన్ ఎక్కువ పనితీరుతో ట్యూన్ చేసినందున, మిగిలిన వేరియంట్లు దీనికంటే స్వల్పంగా ఎక్కువ మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది.

ఫీచర్లుఫీచర్ల విషయంలోనూ TVS ఎన్‌టార్క్ 125 తన సెగ్మెంట్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. అన్ని వేరియంట్లలో పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అందుబాటులో ఉంటుంది. ఇందులో స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, ఫ్యూయల్ గేజ్, ఇంజిన్ ఉష్ణోగ్రత వివరాలు & ల్యాప్ టైమర్ వంటి సమాచారం కనిపిస్తుంది. TVS SmartXonnect ద్వారా Bluetooth కనెక్టివిటీ, కాల్ అలర్ట్స్, SMS అలర్ట్స్ & టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా అందుబాటులో ఉంటాయి.

రేస్ XP వేరియంట్‌లో స్ట్రీట్ మోడ్ & రేస్ మోడ్ అనే రెండు రైడింగ్ మోడ్‌లు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. టాప్ వేరియంట్ XTలో స్ప్లిట్ స్క్రీన్ డిస్‌ప్లే అందిస్తున్నారు. ఇందులో TFT స్క్రీన్‌తో పాటు నెగెటివ్ LCD డిస్‌ప్లే ఉంటుంది. వాయిస్ కమాండ్స్, WhatsApp నోటిఫికేషన్స్, Instagram నోటిఫికేషన్స్, లైవ్ క్రికెట్ స్కోర్లు వంటి ఆధునిక కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో లభిస్తాయి.

ఇది కూడా చదవండి: 026 Renault Kwidలో ఏ వేరియంట్‌ కొనడం తెలివైన నిర్ణయం - ధరలు, ఫీచర్లపై అనాలసిస్‌

వేరియంట్లుఈ స్కూటర్‌లో డిస్క్ వేరియంట్ బేస్ మోడల్‌గా ఉంటుంది. రేస్ ఎడిషన్‌లో స్పోర్టీ గ్రాఫిక్స్, సూపర్ స్క్వాడ్ ఎడిషన్‌లో మార్వెల్ థీమ్ గ్రాఫిక్స్ అందిస్తారు. ఈ రెండు వేరియంట్లలో ఇంజిన్ పరంగా ఎలాంటి మార్పు ఉండదు. ఎక్కువ పనితీరు కోరుకునే వారికి రేస్ XP సరైన ఎంపికగా నిలుస్తుంది. అత్యాధునిక ఫీచర్లు, ప్రీమియం డిస్‌ప్లే, మెరుగైన కనెక్టివిటీ కోరుకునే వారికి XT వేరియంట్ అనువైనది.

మొత్తం మీద TVS ఎన్‌టార్క్ 125 స్టైలిష్ డిజైన్, మంచి పనితీరు, ఆకట్టుకునే మైలేజ్ & సెగ్మెంట్‌లో అత్యుత్తమ ఫీచర్లతో యువతకు బెస్ట్ స్పోర్టీ స్కూటర్లలో ఒకటిగా కొనసాగుతోంది. మీ బడ్జెట్ & అవసరాలను బట్టి సరైన వేరియంట్‌ను ఎంపిక చేసుకుంటే మంచి విలువ లభించే అవకాశం ఉంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.