Variant of the 2026 Renault Kwid: భారత్‌లో అత్యంత అందుబాటు ధర హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటైన Renault Kwidకు 2026 మోడల్ ఇయర్ అప్‌డేట్ లభించింది. ఈ అప్‌డేట్‌లో భారీ మార్పులు లేకపోయినా, కొత్త డిజైన్ ఎలిమెంట్స్‌తో పాటు కంపెనీ తాజా లోగోను అందించారు. అంతేకాకుండా ధరలను కూడా తగ్గించి కొనుగోలుదారులకు మరింత ఆకర్షణీయంగా మార్చారు. అయితే కొత్త Renault Kwidలో ఏ వేరియంట్ కొనుగోలు చేస్తే మీ డబ్బుకు ఎక్కువ విలువ లభిస్తుందనేది ఇప్పుడు చూద్దాం.

Continues below advertisement

2026 Renault Kwidలో ఇంజిన్ పరంగా ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో 1.0 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ (NA) 3-సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్‌ను కొనసాగించారు. ఈ ఇంజిన్ 69 hp పవర్ & 92.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ మాన్యువల్‌ లేదా 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఫ్రంట్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో వచ్చే ఈ కారు 28 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌ను కలిగి ఉంది. పనితీరు & మైలేజ్ పరంగా గత మోడల్‌తో పోలిస్తే ఎలాంటి మార్పులు లేవు.

2026 Renault Kwid ప్రస్తుతం Evolution & Climber అనే రెండు వేరియంట్లలో మాత్రమే విక్రయానికి అందుబాటులో ఉంది. Evolution మాన్యువల్‌ గేర్‌బాక్స్ ధర రూ.4.53 లక్షల నుంచి ప్రారంభమవుతుండగా, AMT ఆప్షన్‌తో ధర రూ.4.90 లక్షలు. Climber మాన్యువల్‌ ధర రూ.5.15 లక్షలు కాగా, Climber AMT ధరను రూ.5.61 లక్షలుగా నిర్ణయించారు. పాత మోడల్‌తో పోలిస్తే వేరియంట్‌ను బట్టి రూ.10,000 నుంచి రూ.32,000 వరకు ధరలు తగ్గడం విశేషం.

Continues below advertisement

ఇది కూడా చదవండి: 5-స్టార్ రేటింగ్ ఉన్నత మాత్రాన సేఫ్‌ కాదట! యూరో NCAP సంచలన రిపోర్ట్!

Evolution వేరియంట్‌లో... యూజర్లకు అవసరమైన అన్ని ప్రాథమిక ఫీచర్లను Renault అందించింది. ఇందులో LED DRLs, 14 అంగుళాల స్టీల్ వీల్స్, రిమోట్ కీ లెస్ ఎంట్రీ, ఫ్యాబ్రిక్ సీట్లు, Manual AC, 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్‌ కార్‌ప్లే & ఆండ్రాయిడ్‌ ఆటో, రెండు స్పీకర్లు, USB & AUX పోర్టులు, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ABS, EBD, బ్రేక్ అసిస్ట్, ESP, ట్రాక్షన్ కంట్రోల్, TPMS, రియర్ పార్కింగ్ సెన్సర్లు వంటి ఫీచర్లు ఉన్నాయి.

Climber వేరియంట్‌లో అదనంగా ORVM టర్న్ ఇండికేటర్లు, డ్యూయల్ టోన్ పెయింట్, ప్రత్యేక క్లాడింగ్, స్కిడ్ ప్లేట్లు, Climber బ్యాడ్జింగ్, డ్యూయల్ టోన్ క్యాబిన్, అన్ని డోర్లకు పవర్ విండోలు, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఎలక్ట్రిక్ ORVMలు, రియర్ పార్సెల్ ట్రే, రివర్స్ కెమెరా, మాన్యువల్ అడ్జస్టబుల్ IRVM & సైడ్ ఎయిర్‌బ్యాగ్స్ అందుబాటులో ఉన్నాయి. దీనిలో మొత్తం ఆరు ఎయిర్‌బ్యాగ్స్ లభిస్తాయి. భద్రత పరంగా ఇది Evolution కంటే గణనీయంగా మెరుగ్గా నిలుస్తుంది.

ఇది కూడా చదవండి: షోరూమ్ నుంచి బయటకు వచ్చిన వెంటనే కారు ప్రమాదానికి గురైతే నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారు?

AMT వేరియంట్‌ను ఎంచుకునే వారికి అదనంగా హిల్‌ స్టార్ట్‌ అసిస్ట్‌ కూడా లభిస్తుంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో డ్రైవింగ్ చేసే వారికి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. రోజువారీ ప్రయాణాల్లో క్లచ్ ఉపయోగించే అవసరం తగ్గిపోవడం కూడా AMT ప్రత్యేకత.

ధర Evolution Manual కంటే Climber Manual ధర రూ.62,000 ఎక్కువ. అయితే అదనంగా లభించే ఆరు ఎయిర్‌బ్యాగ్స్, రివర్స్ కెమెరా, పవర్ విండోలు, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఎలక్ట్రిక్ ORVMలు, మెరుగైన ఇంటీరియర్ & స్పోర్టీ ఎక్స్‌టీరియర్ డిజైన్‌ను పరిగణనలోకి తీసుకుంటే ఈ అదనపు ధర సమంజసంగా కనిపిస్తుంది.

రోజువారీ నగర ప్రయాణాలు ఎక్కువగా చేసే వారు Climber AMTని ఎంచుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది. ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సౌలభ్యం,హిల్‌ స్టార్ట్‌ అసిస్ట్‌, పూర్తి భద్రత ఫీచర్లు & ప్రీమియం లుక్ కారణంగా ఇదే 2026 Renault Kwidలో అత్యుత్తమ వేరియంట్‌గా చెప్పవచ్చు. బడ్జెట్ పరిమితంగా ఉంటే Evolution సరిపోతుంది. అయితే డబ్బుకు పూర్తి విలువ కావాలంటే Climber AMTనే అత్యుత్తమ ఎంపికగా నిలుస్తుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.