TVS Jupiter CNG Updates, Price. Features: భారతదేశంలో ద్విచక్ర వాహనాలపై మోజు ఎప్పటికీ తగ్గదు. అందులోనూ స్కూటర్లు అంటే ప్రత్యేకమైన క్రేజ్, అవి ఫ్యామిలీకి కూడా చాలా ఉపయోగపడతాయి. కానీ, ఇంధనం ధరలు ఆకాశాన్ని చూస్తున్న ఈ సమయంలో, టూవీలర్లలో CNG ఆప్షన్ ఎంత హ్యాపీ బాగుంటుందో కదా. ఇదే డ్రీమ్‌తో, ఈ ఏడాది ఆరంభంలో జరిగిన భారత్ మొబిలిటీ ఆటో ఎక్స్‌పోలో TVS తన కొత్త జూపిటర్ CNG స్కూటర్‌ను ప్రదర్శించింది. ఆ సమయంలో, ఈ CNG స్కూటర్‌కు వచ్చిన రెస్పాన్స్ నిజంగా అద్భుతంగా ఉంది. "హోండా యాక్టివా CNG వస్తుందనుకున్నాం, కానీ TVS మైండ్ బ్లో చేసింది" అని అందరూ అనుకున్నారు. అయితే, ఎక్స్‌పోలో షోకేస్ చేసిన తర్వాత, ఈ స్కూటర్ గురించి కంపెనీ నుంచి ఒక్క అప్‌డేట్ కూడా ఇవ్వలేదు. దీంతో, ఈ స్కూటర్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌లో చిన్న నిరాశ కనిపిస్తోంది.
ఎప్పుడు లాంచ్ అవుతుంది?ముందుగా ఉన్న అంచనాల ప్రకారం, ఈ ఫెస్టివ్ సీజన్‌కల్లా ఈ జూపిటర్ CNG రోడ్డుమీద దూసుకురావాలి. కానీ ఇప్పుడు ఆ డ్రీమ్ డిలే అవుతోంది. ఎందుకంటే, TVS, ముందుగా తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఆర్బిటర్‌ను (TVS Orbiter electric scooter launched) ఆగస్టు 28న లాంచ్ చేసింది. అందుకే జూపిటర్ CNG ప్రాజెక్ట్ వెనక్కి వెళ్లిపోయినట్టు కనిపిస్తోంది.
TVS జూపిటర్ CNG ఫీచర్లుఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన మోడల్‌లో 1.4 కిలోల CNG ట్యాంక్ పెట్టారు. అదనంగా, 2 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ కూడా ఉంది. అంటే, రెండు ఫ్యూయల్ ఆప్షన్లతో కలిపి ఈ స్కూటర్ 220 కి.మీ. నుంచి 230 కి.మీ. వరకు రేంజ్ ఇస్తుంది అని కంపెనీ క్లెయిమ్ చేసింది.
డిజైన్ మాత్రం పెట్రోల్ జూపిటర్ ఉన్నట్లే ఉంది. అదే బాడీ షేప్, అవే ఫీచర్లు. కానీ, ఒక పెద్ద మైనస్ ఏమిటంటే - అండర్‌సీట్ స్టోరేజ్ ఉండదు, ఆ ప్లేస్‌లో CNG ట్యాంక్ ఉంది. అంటే.. స్కూటర్ సీట్ కింద బాగ్, హెల్మెట్ వంటివి పెట్టుకోవడంలో ఇబ్బంది పడాల్సి రావచ్చు.
ధర అంచనాలుకంపెనీ అధికారికంగా ఎలాంటి లాంచ్ డేటు & రేటు చెప్పకపోయినా, మార్కెట్ అంచనాలు మాత్రం స్పష్టంగా ఉన్నాయి. TVS Jupiter CNG స్కూటర్ ధర రూ. 90,000 నుంచి రూ. 1.15 లక్షల మధ్య (ఆన్-రోడ్) ఉండొచ్చని టాక్. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో కూడా ఇదే రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది.
కస్టమర్లలో నిరాశఎక్స్‌పోలో చూసిన తర్వాత, ఈ బండిని కొనాలని చాలా మంది ఎక్సైట్ అయ్యారు, లాంచ్ కోసం ఎదురుచూస్తున్నారు. "అదేంటి, CNG స్కూటర్‌ను చూపించి మౌనంగా వెళ్లిపోయారు" అని చాలామంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కనీసం ఒక చిన్న టీజర్ లేదా అప్‌డేట్ అయినా ఇస్తే కస్టమర్లలో క్యూరియాసిటీ కొనసాగుతుందని భావిస్తున్నారు.
ఇండియాలో మొదటి CNG స్కూటర్‌గా జూపిటర్ CNG రావడం ఖాయం. కానీ ఎప్పుడు? అనేది మిలియన్ డాలర్ ప్రశ్న. ఫెస్టివ్ సీజన్‌లో కాకపోతే, ఈ ఏడాది చివర్లో అయినా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అప్పటివరకు ఆశావాహులు ఎదురుచూడాల్సిందే.