TVS iQube Smartwatch Connected Features: భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సాంకేతికత వేగంగా మారుతోంది, కొత్త మలుపులు తిరుగుతోంది. TVS iQube ఎలక్ట్రిక్ స్కూటర్, ఇప్పుడు, ప్రత్యేక నాయిస్ స్మార్ట్‌వాచ్ (Noise Smartwatch) తో అనుసంధానం అవుతుంది. ఇది మీ మణికట్టుపైనే స్కూటర్‌కు సంబంధించిన ప్రతి ఒక్క వివరాన్ని ప్రదర్శిస్తుంది. మన దేశంలో, EV & స్మార్ట్‌వాచ్ కలయికలో (EV-Smartwatch Integration) ఇలాంటి ఆవిష్కరణ ఇదే మొదటిసారి. దీనివల్ల, రైడర్లు రియల్-టైమ్ అప్‌డేట్స్ & అలెర్ట్స్ అందుకుంటారు.
EV-స్మార్ట్‌వాచ్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి?TVS & Noise మధ్య ఈ భాగస్వామ్యంలో భాగంగా, iQube కస్టమర్లు కేవలం ₹2,999 ధరకే ప్రత్యేక స్మార్ట్‌వాచ్‌ను అందుకోవచ్చు & 12 నెలల ఉచిత నాయిస్ గోల్డ్ సబ్‌స్క్రిప్షన్‌తో ఇది వస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ నేరుగా iQubeకి కనెక్ట్ అవుతుంది & స్కూటర్ స్థితి, బ్యాటరీ సమాచారం, టైర్ ప్రెజర్, భద్రత హెచ్చరికలు వంటి ముఖ్యమైన సమాచారాన్ని రైడర్లకు తక్షణమే అందిస్తుంది.
ప్రతి సమాచారం మీ మణికట్టుపై!స్మార్ట్ వాచ్ ఇంటిగ్రేషన్ యూజర్లు తమ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను నేరుగా తమ మణికట్టు (స్మార్ట్‌వాచ్) నుంచి నియంత్రించవచ్చు & పర్యవేక్షించవచ్చు. వాహనం లాక్ అయిందా, అన్‌లాక్ అయిందా, ఛార్జింగ్ ఉందా & లేదా, లేదా రైడింగ్‌లో ఉందా అనే వివరాలను ఈ స్మార్ట్‌వాచ్ అందిస్తుంది. ఛార్జ్ స్టేటస్ (SoC), బ్యాటరీ పర్సెంటేజీ & విజువల్ ప్రోగ్రెస్ బార్ సహా బ్యాటరీ స్టేటస్‌ను కూడా ఈ వాచ్‌లో చూడవచ్చు. బ్యాటరీ ఛార్జింగ్ 20% కంటే తక్కువకు పడిపోయినప్పుడు 'లో బ్యాటరీ' అలెర్ట్ కూడా స్మార్ట్ వాచ్‌లో కనిపిస్తుంది. వివిధ రైడ్ మోడ్స్‌లో మిగిలిన దూరాన్ని & టైర్ ప్రెజర్ ఆధారంగా అంచనా వేసిన రైడింగ్ రేంజ్‌ను కూడా ఈ వ్యవస్థ అందిస్తుంది. TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), రెండు టైర్లకు ప్రత్యక్ష టైర్ ప్రెజర్ & సిఫార్సు చేసిన స్థాయులను వాచ్‌లోనే ప్రదర్శిస్తుంది.
దొంగతనం హెచ్చరికలు దొంగతనం జరిగినప్పుడు లేదా బండిని ఎవరైనా జరపడానికి ప్రయత్నించినప్పుడు హెచ్చరికలు, జియోఫెన్స్ నోటిఫికేషన్‌లు & ప్రమాదం జరిగినప్పుడు లేదా స్కూటర్ పడిపోయినప్పుడు యాప్ నోటిఫికేషన్‌లు కూడా ఇందులో ఉన్నాయి. ఛార్జింగ్ ప్రారంభం, పురోగతి & పూర్తి సమాచారం కూడా స్మార్ట్‌వాచ్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ వ్యవస్థ సురక్షితమైన API & యూజర్ పర్మిషన్లపై ఆధారపడి ఉంటుందని, పూర్తి గోప్యతను నిర్ధారిస్తుందని TVS చెబుతోంది.
TVS iQube రేంజ్ & ధరTVS iQube 212 కి.మీ. వరకు IDC పరిధిని కలిగి ఉంది. 4 గంటల 18 నిమిషాల్లో 0 నుంచి 80% వరకు ఛార్జ్ చేయవచ్చు. ఆరు వేరియంట్లలో & 12 రంగుల్లో అందుబాటులో ఉన్న ఈ స్కూటర్ ధర ₹1,09,250 & ₹1,62,314 మధ్య ఉంటుంది.
TVS iQube - Smartwatch ఇంటిగ్రేషన్ భారతీయ EV పరిశ్రమలో ఒక ప్రధాన ఆవిష్కరణ. ఇది ఇ-స్కూటర్‌ను మాత్రమే కాకుండా, స్మార్ట్ టెక్నాలజీ అనుభవాన్ని కూడా అందిస్తుంది. బ్యాటరీ అప్‌డేట్స్, టైర్ ప్రెజర్, భద్రత & ఛార్జింగ్ సమాచారం ఇప్పుడు మీ మణికట్టుపైనే ఉంటుంది. ఇది, భవిష్యత్తులో మరిన్ని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ట్రెండ్ సెట్ చేయవచ్చు.