టీవీఎస్ తన కొత్త ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఇందులో 7 అంగుళాల స్క్రీన్ కొత్త యూఐ, వాయిస్ అసిస్టెంట్, టీవీఎస్ ఐక్యూబ్ అలెక్సా ఇంటిగ్రేషన్, ఓటీఏ అప్‌డేట్స్, 1.5 కేడబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్, బ్లూటూత్, క్లౌడ్ కనెక్టివిటీ అందించారు.
దీని టాప్ ఎండ్ వేరియంట్లో 5.1 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఏకంగా 140 కిలోమీటర్ల రేంజ్‌ను ఇది అందించనుంది. ఐక్యూబ్ ఎస్, ఐక్యూబ్ వేరియంట్లలో 3.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇవి 100 కిలోమీటర్ల రేంజ్ అందించనున్నాయి. మిగతా ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోలిస్తే ఇది బెస్టేనా?
ఏథర్ 450 ప్లస్ వర్సెస్ ఓలా ఎస్1 ప్రో వర్సెస్ టీవీఎస్ ఐక్యూబ్
ఐక్యూబ్ ఎస్, ఐక్యూబ్ ఎస్‌టీల్లో బ్యాటరీ అవుట్‌పుట్ 4.4 కేడబ్ల్యూ అవుట్‌పుట్‌ను అందించనున్నాయి. ఓలా ఎస్1 ప్రో 8.5 కేడబ్ల్యూ, ఏథర్ 5.4 కేడబ్ల్యూ అవుట్‌పుట్‌ను అందించనున్నాయి. అన్నిటికంటే ముఖ్యమైన రేంజ్ విషయానికి వస్తే.. ఐక్యూబ్ వేరియంట్‌ను బట్టి 140 కిలోమీటర్ల వరకు అందించనుంది. ఓలా ఎస్1 ప్రో రేంజ్ 181 కిలోమీటర్లు కాగా... ఏథర్ రేంజ్ 116 కిలోమీటర్లుగా ఉంది.
టీవీఎస్ ఐక్యూబ్ ప్రారంభ వేరియంట్ ధర రూ.98,564 కాగా, ఎస్ వేరియంట్ ధర రూ.1.08 లక్షలుగా ఉంది. టాప్ ఎండ్ అయిన ఐక్యూబ్ ఎస్‌టీ వేరియంట్ ధరలు తెలియరాలేదు. ఓలా ఎస్1 ధర రూ.85,000 కాగా... ఎస్1 ప్రో ధర రూ.1.2 లక్షలుగా ఉంది. ఇక ఏథర్ ధర రూ.1.19 లక్షల నుంచి రూ.1.4 లక్షల మధ్య ఉంది.
వీటి రేంజ్, పవర్ అవుట్‌పుట్‌లు వేర్వేరుగా ఉన్నా... రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను బట్టి మీకు కావాల్సిన బైక్‌ను ఎంచుకోవచ్చు. ప్రస్తుతానికి వీటిలో ఏథర్ బెస్ట్ అన్నట్లు కనిపించినప్పటికీ మిగతా రెండిటినీ కూడా ఊరికే తీసిపారేయలేం.
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?