Electric Two Wheeler Sales Report September 2025: మన దగ్గర, ఎలక్ట్రిక్‌ టూ వీలర్ మార్కెట్‌ రోజురోజుకీ హీట్‌ ఎక్కుతోంది, ఆధిపత్యం నిరూపించుకునే ప్రయత్నాలు నిరంతరం జరుగుతున్నాయి. సెప్టెంబర్‌ 2025లో అయితే మరింత ఆసక్తికరంగా మారింది. ఎప్పటిలాగే TVS నంబర్‌ వన్‌గా నిలిచింది. కానీ, అసలు సర్‌ప్రైజ్‌ మాత్రం Ather Energy ఇచ్చింది. బెంగళూరుకు చెందిన ఈ కంపెనీ, తొలిసారి Ola Electric ‌ని ఓడించి థర్డ్‌ పొజిషన్‌లోకి వచ్చింది.

Continues below advertisement

TVS - పోల్‌ పోజిషన్‌TVS మోటార్‌ కంపెనీ, ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని మరోమారు రుజువు చేసింది. ఒక్క సెప్టెంబర్‌ (2025) నెలలోనే 20,000 యూనిట్లకు పైగా అమ్మి పోల్‌ పోజిషన్‌లో (నంబర్‌ 1 పొజిషన్‌) లో కొనసాగుతోంది. ICE వాహనాలపై GST తగ్గింపు ఇచ్చినా ఎలక్ట్రిక్‌ వాహనాలపై డిమాండ్‌ తగ్గలేదని TVS ప్రూవ్‌ చేసింది.

బజాజ్ - కంఫర్ట్‌గా రెండో స్థానంలోబజాజ్ ఆటో, 2025 సెప్టెంబర్‌లో 16,000 యూనిట్లకుపైగా సేల్‌ చేసి సెకండ్‌ పొజిషన్‌లో నిలిచింది. ఈ ఏడాది ఆగస్ట్‌లో, రేర్‌ ఎర్త్‌ మ్యాగ్నెట్స్‌ కొరత కారణంగా ఉత్పత్తిలో ఇబ్బందులు ఎదురైనా, సెప్టెంబర్‌లో ఆ అడ్డంకులను అధిగమించి ఫుల్‌ ఫామ్‌లో తిరిగి వచ్చింది, కంఫర్ట్‌గా రెండో స్థానంలో దూసుకెళ్తోంది.

Continues below advertisement

Ather - మొదటిసారి Ola Electric ‌పై ఆధిపత్యంAther Energy, సెప్టెంబర్‌లో 15,000 యూనిట్లకుపైగా సేల్‌ చేసి Ola Electric ‌ను వెనక్కు నెట్టింది. గత కొంతకాలంగా Ather, Ola Electric ‌కు దగ్గరగా వస్తోందన్న అంచనాలను ఈసారి నిజం చేసింది. మొదటిసారి Ola Electric ‌ని దాటి మూడో స్థానంలో రావడం Ather కి కీలక మైలురాయి.

Ola Electric - వెనక్కు తగ్గి నాలుగో స్థానంలోకిఒకప్పుడు నంబర్‌ 1 స్థానం సాధించిన Ola Electric, ఇప్పుడు ఫోర్త్‌ పొజిషన్‌కి పడిపోయింది. సెప్టెంబర్‌లో 12,000 యూనిట్ల లోపు సేల్స్‌తో వెనుకబడింది. ఈ ఏడాదంతా Ola Electric సేల్స్‌ ఏ నెలకు ఆ నెల తగ్గుతూనే వస్తున్నాయి. అయితే, జనవరి-సెప్టెంబర్‌ మొత్తం సేల్స్‌ లెక్కల్లో మాత్రం 1.6 లక్షల యూనిట్లతో Ather (1.3 లక్షల యూనిట్లు) కంటే ముందే ఉంది.

Hero Vida - స్టెడీ రైడ్‌హీరో మోటోకార్ప్‌, తన Vida బ్రాండ్‌తో బలంగా రాణిస్తోంది. సెప్టెంబర్‌లో 11,000 యూనిట్లకుపైగా విక్రయాలు సాధించి Ola Electric కు పోటీగా నిలిచింది. Hero కొత్తగా తెచ్చిన Battery-as-a-Service (BaaS) ఆప్షన్‌ & అగ్రెసివ్‌ మార్కెటింగ్‌ Vida బ్రాండ్‌కి మంచి లిఫ్ట్‌ ఇచ్చాయి.

ఫెస్టివ్‌ సీజన్‌లో పాజిటివ్‌ వైబ్‌దసరా, దీపావళి పండుగ సీజన్‌తో పాటు మార్కెట్‌లో బైక్‌ బజ్‌ పెరగడం కూడా ఎలక్ట్రిక్‌ వాహనాల సేల్స్‌కి పాజిటివ్‌గా పని చేసింది. GST తగ్గింపు కారణంగా కొంతమంది ICE వాహనాలవైపు మొగ్గుచూపినా, ఎలక్ట్రిక్‌ మార్కెట్‌లో కూడా గ్రోత్‌ కొనసాగడం ఇండస్ట్రీకి మంచి సిగ్నల్‌.

సెప్టెంబర్‌ 2025 ఎలక్ట్రిక్‌ టూ వీలర్ మార్కెట్‌లో గేమ్‌చేంజర్‌ మంత్‌గా రికార్డ్‌ అయ్యింది. TVS తన లీడర్‌షిప్‌ని కొనసాగించగా, బజాజ్ సెకండ్‌ పొజిషన్‌లో స్ట్రాంగ్‌గా ఉంది. అసలు టర్నింగ్‌ పాయింట్‌ మాత్రం Ather Energy కి దొరికింది. ఇది మొదటిసారి Ola Electric ‌ని వెనక్కి నెట్టి మూడో స్థానంలోకి రావడం, ఎలక్ట్రిక్‌ మార్కెట్‌లో పోటీలో మరింత వేడి రాజేసింది.